Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vellulli Karam Recipe: జ్వరం లేదా జలుబు చేసినప్పుడు, నోటికి ఏదీ రుచించనప్పుడు, లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అతి తక్కువ సమయంలో చేసుకోగలిగే అద్భుతమైన వంటకం రాయలసీమ స్పెషల్ ‘వెల్లుల్లి కారం’. ఘాటైన వెల్లుల్లి, కారం, మరియు ధనియాల సువాసనతో తయారయ్యే ఈ కారం ఎంతో ప్రసిద్ధి చెందింది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకుని ఈ వెల్లుల్లి కారంతో తింటే ఆ రుచి అమృతంలా ఉంటుందంటే నమ్మండి. ఇది కేవలం అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లలోకి, అలాగే వేపుడు కూరల్లో (Fry recipes) అదనపు రుచి కోసం కూడా వాడుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి దీన్ని ఎలా తాయారు చేయాలో చూసేద్దామా..
బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..
Also Read
- AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
- Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
కావలసిన పదార్థాలు:
* వెల్లుల్లి రెబ్బలు: 2 మీడియం సైజు గడ్డలు (సుమారు 50 గ్రాములు)
* ఎండుమిర్చి: 10 గ్రాములు (లేదా తగినన్ని)
* ధనియాలు: 1 టేబుల్ స్పూన్ (10 గ్రాములు)
* జీలకర్ర: అర టీస్పూన్
* కారం: 2 టేబుల్ స్పూన్లు (20 గ్రాములు)
* పసుపు: అర టీస్పూన్
* ఉప్పు: రుచికి తగినంత
* నూనె: 2–3 టేబుల్ స్పూన్లు (తాలింపు కోసం)
* తాలింపు దినుసులు: ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు.
MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!
తయారీ విధానం:
* ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కారం, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేయాలి. వీటన్నింటినీ మెత్తని ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి. రోలు అందుబాటులో ఉంటే రోట్లో దంచుకుంటే రుచి ఇంకా బాగుంటుంది.
* ఆ తర్వాత స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టి, అందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించాలి.
* అలా తాలింపు వేగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారం ముద్దను అందులో వేయాలి. స్టవ్ ఆపేసి ఆ వేడి నూనెలో కారాన్ని ఒక్కసారి బాగా కలిపితే సరిపోతుంది. ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం లేదు.
ఈ ఎల్లిపాయ కారాన్ని నేరుగా అన్నంలోకే కాకుండా, గుడ్డు ఫ్రై లేదా ఇతర వేపుడు కూరల్లో కూడా రుచి కోసం వాడుకోవచ్చు. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కారంతో తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ప్రయత్నించి చూడండి.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!