NTV Telugu Site icon

Madhya Pradesh: మధ్యప్రదేశ్లో విషాదం.. రైలు నుండి జారిపడి ఇద్దరు మృతి

Madya Pradesh

Madya Pradesh

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న పూణె వీక్లీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లోని ప్రయాణికులపై వేడి వేడి ‘టీ’ పడటంతో గందరగోళం నెలకొంది. ముగ్గురు ప్రయాణీకులపై టీ పడటంతో.. వారు ప్రయాణించే కోచ్ అల్లకల్లోలం అయింది. తమపై ‘టీ’ పడటంతో చాలా ఇబ్బందిగా, నొప్పిగా ఉందంటూ.. కోచ్ లో నెట్టడం, లాగడం చేశారు. ఈ గందరగోళంలో డోర్ వద్ద కూర్చున్న ఇద్దరు ప్రయాణికులకు తగలడంతో కదులుతున్న రైలు నుండి జారి పడిపోయారు. దీంతో.. వారు అక్కడికక్కడే చనిపోయారు.

Deputy CM Pawan Kalyan: ఏనుగుల నుంచి రక్షణకు చర్యలు.. ‘కుంకీ’ ఏనుగుల కోసం కర్ణాటకతో చర్చలు..

వివరాల్లోకి వెళ్తే.. పూణే వీక్లీ ఎక్స్‌ప్రెస్ (15029) శుక్రవారం ఉదయం 7 గంటలకు కరోండా స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. టీ అమ్ముకునే వ్యక్తి జనరల్ కోచ్‌లోకి వచ్చాడు. అయితే.. అతని నిర్లక్ష్యం కారణంగా థర్మోస్ ఫ్లాస్క్‌ మూత తెరుచుకుంది. దీంతో.. వేడివేడిగా ఉన్న ఛాయ్.. విశ్వనాథ్, మనీష్, దీపక్‌లపై పడింది. దీంతో.. వారు నొప్పితో అల్లాడుతూ కోచ్ మొత్తం అటు ఇటు పరిగెత్తారు. కోచ్ లోపల గందరగోళం నెలకొంది. ఈ గొడవలో డోర్‌ వద్ద కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు కిందపడిపోయారు. ఈ సంఘటన తర్వాత.. రైలు బినా స్టేషన్‌కు చేరుకోగానే బోగీలోని ప్రయాణికులు టీ అమ్మే వ్యక్తినిన పట్టుకుని GRPకి అప్పగించారు.

UP: వృద్ధుడిపై బీజేపీ నేత కుమారుడు దాడి.. సీసీకెమెరాలో రికార్డ్

రైలు నుండి దూకిన ప్రయాణీకుల సమాచారం గురించి కరోండా రైల్వే స్టేషన్ అధికారులు.. భాంగార్ పోలీసులకు తెలిపారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చర్యలు తీసుకున్నారు. రెండు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం బినా సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. మృతుల బంధువులను గుర్తించి సంఘటన గురించి వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు.