MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..
- నారాయణపేట జిల్లాలోని బసిరెడ్డిపల్లిలో విషాదం
- చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య
- డెడ్ బాడీని చెరువు కట్టపై పడేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారాయణపేట జిల్లాలోని బసిరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. కేవలం ఐదు సంవత్సరాల వయసున్న చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని చెరువు కట్టపై పడేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. చిన్నారి డెడ్ బాడీని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కేసులో అసలేం జరిగింది? చిన్నారిని ఎవరు చంపేశారు?
Also Read:Catering: క్యాటరింగ్ బిజినెస్ మాటున పెద్ద కథే నడిపిస్తున్నాడుగా..
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
నారాయణపేట జిల్లా బసిరెడ్డిపల్లికి చెందిన అంజి, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. ఒక పాప, ఒక బాబు ఉన్నారు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వారి వెంట బాబును తీసుకెళ్లారు. ఐతే కూతుర్ని మాత్రం వారి తల్లిదండ్రుల దగ్గర ఉంచేశారు. దాంతో అవ్వా తాత.. చిన్నారి తేజశ్రీని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మరోవైపు చిన్నారి తేజశ్రీ కూడా అవ్వా, తాత దగ్గర బాగానే పెరుగుతోంది. రోజూ అంగన్‌వాడీకి వెళ్లడం.. తర్వాత తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది.
అంతా బాగుంది అనుకున్న తరుణంలో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎండాకాలం కావడంతో గ్రామాల్లో ఆరుబయట నిద్రించడం ఆనవాయితీ. రాత్రి అవ్వ తాతతో కలిసి తేజశ్రీ బయట నిద్రించింది. కానీ అర్ధరాత్రి సమయంలో అమ్మాయి వారి పక్కలో లేకపోవడంతో వృద్ధ దంపతులు కంగారు పడ్డారు. గ్రామస్థుల సహాయంతో గ్రామంలో వెతుకగా చెరువు కట్టపై చిన్నారి విగతజీవిగా పడి ఉంది. అది చూసిన గ్రామస్తులు హుటాహుటిన నారాయణపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసు జాగిలాలతో సంఘటన స్థలాన్ని పరీక్షించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
ఐదేళ్ల చిన్నారి తేజశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆ చిన్నారిని తెలిసిన వారే ఎవరైనా హత్య చేశారా? లేదా దొంగతనానికి వచ్చి.. అమ్మాయి పైనున్న వెండి పట్టీల కోసం దుండగులు ఎవరైనా చంపేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అని వాటిపై దర్యాప్తు చేస్తున్నామని నారాయణపేట DSP లింగయ్య తెలిపారు.
Also Read:Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తేజశ్రీని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంత చిన్న గ్రామంలో తేజ శ్రీని ఎవరు.. ఎందుకు చంపారనే దానిపై మిస్టరీ వీడడం లేదు. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సేకరించే ఆధారాలే కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!