అధిక శబ్దంతో కొన్ని వాహనాలు వెళ్తుంటాయి.. అయితే, అధిక శబ్దంతో నడిచే వాహనాలపై చర్యలకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుండి అధిక శబ్దాలతో ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు..