Ramayana Box Office Collection: ‘రామాయణ’ రికార్డుల వేట.. 17 రోజుల్లోనే రూ.1,675 కోట్లు.. డే వైజ్ కలెక్షన్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Box Office Day Wise Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ క్రమంలో కేవలం 17 రోజుల్లోనే రూ.1,675 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే జోరు కొనసాగితే 18 రోజుల్లోనే రూ.1,750 కోట్ల మార్కును అందుకునే అవకాశముంది. అత్యధిక ప్రపంచవ్యాప్త గ్రాస్ సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ఇప్పటికే రామాయణ ఐదో స్థానానికి చేరింది.
రామాయణ రోజువారీ వసూళ్లను పరిశీలిస్తే.. మొదటి రోజు రూ.155 కోట్లు, రెండో రోజు రూ.105 కోట్లు, మూడో రోజు రూ.149 కోట్లు, నాలుగో రోజు రూ.118 కోట్లు రాబట్టింది. ఐదో రోజు అత్యధికంగా రూ.166 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ఆరో రోజు రూ.146 కోట్లు, ఏడో రోజు రూ.114 కోట్లు సాధించింది. ఇక ఎనిమిదో రోజు నుంచి వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ.. రామాయణ తన జోరును కొనసాగించింది. ఎనిమిదో రోజు రూ.91 కోట్లు, తొమ్మిదో రోజు రూ.84 కోట్లు, పదో రోజు రూ.141 కోట్లు వసూలు చేసింది. 11వ రోజు రూ.137 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. 12వ రోజు రూ.49 కోట్లు, 13వ రోజు రూ.54 కోట్లు, 14వ రోజు రూ.45-50 కోట్ల మధ్య వసూలు చేసినట్లు సమాచారం. 15వ రోజు రూ.40 కోట్లు, 16వ రోజు రూ.30-35 కోట్లు, 17వ రోజు రూ.50-60 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
Also Read
- Rakul Preet Singh: టాలీవుడ్ అన్నీ ఇచ్చింది.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్!
- Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
- Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
- Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
అత్యధిక ప్రపంచవ్యాప్త గ్రాస్ సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ‘దంగల్’ రూ.2,070.30 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ‘ధురంధర్ 2’ రూ.1,852.44 కోట్లతో రెండో స్థానంలో, ‘బాహుబలి 2’ రూ.1,788.06 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ‘పుష్ప 2’ రూ.1,742.10 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. రూ.1,675 కోట్లతో రామాయణ ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ‘ధురంధర్’ రూ.1,307.35 కోట్లు, ‘ఆర్ఆర్ఆర్’ రూ.1,230 కోట్లు, ‘కేజీఎఫ్ 2’ రూ.1,215 కోట్లు, ‘జవాన్’ రూ.1,160 కోట్లు, ‘పఠాన్’ రూ.1,055 కోట్లు, ‘కల్కి 2898 ఏడీ’ రూ.1,042.25 కోట్ల వసూళ్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రామాయణ రోజువారీ ప్రపంచవ్యాప్త వసూళ్లు (గ్రాస్):
1వ రోజు – రూ.155 కోట్లు
2వ రోజు – రూ.105 కోట్లు
3వ రోజు – రూ.149 కోట్లు
4వ రోజు – రూ.118 కోట్లు
5వ రోజు – రూ.166 కోట్లు
6వ రోజు – రూ.146 కోట్లు
7వ రోజు – రూ.114 కోట్లు
8వ రోజు – రూ.91 కోట్లు
9వ రోజు – రూ.84 కోట్లు
10వ రోజు – రూ.141 కోట్లు
11వ రోజు – రూ.137 కోట్లు
12వ రోజు – రూ.49 కోట్లు
13వ రోజు – రూ.54 కోట్లు
14వ రోజు – రూ.45-50 కోట్లు
15వ రోజు – రూ.40 కోట్లు
16వ రోజు – రూ.30-35 కోట్లు
17వ రోజు – రూ.50-60 కోట్లు
తాజావార్తలు
-
Ramayana Box Office Collection: ‘రామాయణ’ రికార్డుల వేట.. 17 రోజుల్లోనే రూ.1,675 కోట్లు.. డే వైజ్ కలెక్షన్స్ ఇవే!
-
Rakul Preet Singh: టాలీవుడ్ అన్నీ ఇచ్చింది.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Seattle Airport Chaos: ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ఇద్దరిని ఈడ్చుకెళ్లిన ICE అధికారులు!
-
Millet Vegetable Soup Recipe: చలికాలంలో టీ, కాఫీకి గుడ్‌బై..! వేడివేడిగా ఈ సూప్ తాగండి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
-
Iran Warns US: అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. ‘ఇది ఆరంభం మాత్రమే’.. అండర్‌గ్రౌండ్ మిసైల్ సిటీలో IRGC చీఫ్!
ట్రెండింగ్
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!