Site icon NTV Telugu

Loud Silencers : శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు హన్మకొండ పోలీసులు నిర్ణయం

Loud

Loud

హన్మకొండలోని కేయూ క్రాస్ వద్ద సోమవారం ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల సైలెన్సర్‌లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. భారీ శబ్దం వచ్చే సైలెన్సర్‌ల వల్ల కలిగే శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్‌లను మార్చే వాహనదారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ ఏసీపీ భోజరాజు తెలిపారు. సైలెన్సర్‌లను మోడిఫైడ్ చేయడానికి సహకరించిన వాహనదారులు, మెకానిక్‌లపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు.

Also Read : Sree Vishnu : తన తరువాత సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న యంగ్ హీరో..

మోడిఫైడ్ సైలెన్సర్లతో ద్విచక్ర వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. గత కొద్దిరోజులుగా ట్రై సిటీ ప్రాంతంలో 200కు పైగా ద్విచక్ర వాహనాలపై పోలీసులు సైలెన్సర్లను తొలగించారు. వాహనదారులు కంపెనీతో పాటు వచ్చే సైలెన్సర్లను వినియోగించాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు. మోడిఫైడ్ సైలెన్సర్‌ల వల్ల శబ్ద కాలుష్యం మాత్రమే కాకుండా ప్రమాదకరంగా కూడా పరిణమించవచ్చని అన్నారు. హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకట్, సుజాత, ట్రాఫిక్ ఎస్‌ఐలు వేణు, యుగంధర్, పూర్ణచంద్రారెడ్డి, శ్రావణి సమక్షంలో లౌడ్ సైలెన్సర్‌లను ధ్వంసం చేశారు.

Also Read : Rahul Gandhi: మళ్లీ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన రాహుల్.. ట్విట్టర్ బయోలో మార్పు

Exit mobile version