యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. రీసెంట్ గా శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమన సినిమా సూపర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సినిమా లో అదిరిపోయే కామెడీ ఉండటం వల్ల ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఎంతగానో అలరించింది…అయితే ఈ సినిమా లో శ్రీ విష్ణు నటన కూడా చాలా వరకు సూపర్ గా ఉంది.శ్రీ విష్ణు చాలా వరకు సీరియస్ గా ఉండే సినిమాలలోనే నటించాడు.సామజవరగమన సినిమాలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఈ సినిమా లో శ్రీ విష్ణు సరసన రెబా మోనికా హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వంటి వారు ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషించారు.
హీరో శ్రీ విష్ణు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సినిమాల్లో హీరో గా రానిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు… నిజానికి శ్రీ విష్ణు చేసే సినిమా సబ్జెక్ట్ లు ఎంతో అద్భుతంగా ఉంటాయి కానీ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయితే కాలేదు. అయితే సామజవరగమన సినిమా సూపర్ సక్సెస్ కావడం తో శ్రీ విష్ణు తన తరువాత సినిమాని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం.అందులో భాగంగా గానే కొత్త డైరక్టర్లు చెబుతున్న కథలు వింటున్నాడనీ సమాచారం.అలాగే ఇండస్ట్రీ లో తనకి ఎంతగానో పరిచయం వున్న డైరెక్టర్లు చెప్పే కథలు కూడా వింటున్నాడు. సామజవరగమన తరువాత మరో సక్సెస్ సాదించాలనీ ఈ హీరో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.ఇక సమాజవరగమన సినిమాతో దాదాపు యాభై కోట్లకి పైన కలక్షన్స్ ని రాబట్టి ఫస్ట్ టైం ఈ యంగ్ హీరో యాభై కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.