Revanth Reddy : సీఎం కేసీఆర్‌కు మరోసారి రేవంత్ రెడ్డి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Revanth Reddy Letter To CM KCR
మరోసారి టీపీసీస చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తాజాగా రేవంత్ రెడ్డి రాసిన లేఖలో.. రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు చేయించాం.. గత ఏడాది రామగుండం పరిశ్రమ తిరిగి ప్రారంభించారు.. అయితే అక్కడ ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి దాదాపు 800 మంది నిరుద్యోగుల నుంచి 6 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేసి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చారు. మీకు ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని, అవసరం అనుకుంటే ఆ ఉద్యోగాన్ని వేరే వాళ్లకు అమ్ముకోవచ్చని నమ్మబలికారు. దాదాపు 50 కోట్ల రూపాయలు ఈ ఉద్యోగాల నియామకంలో చేతులు మారాయి. అయితే ఇటీవల రామగుండం ఉద్యోగాల నియామక కాంట్రాక్ట్ మారిపోవడంతో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ గతంలో నియమించిన వారిలో సగం మందిని తొలగించారు.. దీంతో వారంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ తొలగింపులో తీవ్రంగా మానసిక ఆందోళనకు గురైన కేశవ పట్నం మండలం అమ్మలపురం గ్రామానికి హరీష్ గౌడ్ అనే ఉద్యోగి సెల్ఫీ వీడియో పెట్టి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అయితే రేపు కేసీఆర్ రామగుండం రానున్న నేపథ్యంలో హరీష్ శవానికి రామగుండంలో పోస్టుమార్టం చేయకుండా కరీంనగర్ తరలించి పోస్టుమార్టం చేసి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇన్ని అక్రమాలు అవినీతి జరుగుతున్న కేసీఆర్, కేటీఆర్ లు ఎలాంటి స్పందన లేదు. అవినీతికి పాల్పడితే తన కుటుంబ సభ్యులనైనా జైల్లో వేస్తా అని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఈ విషయంలో ఇంత జరుగుతున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే చర్యలు తీసుకొని మంత్రి కొప్పుల ఈశ్వర్ ను, ఎమ్మెల్యే చందర్ ను బర్తరఫ్ చేయాలి. ఈ విషయంలో పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రోహిత్, సుజిత్, పైసా రవి, అంజన్ కుమార్ తదితర కాంగ్రెసునాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లో బంధించారు.. వెంటనే వారిని విడుదల చేయాలి.ఉద్యోగాలు తీసేసిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలి. మృతి చెందిన హరీష్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి..’ అని పేర్కొన్నారు.
డిమాండ్లు…
1. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ లను బర్తరఫ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి విచారన జరపాలి
2. ఉద్యోగాలు తొలగించిన అందరికి తిరిగి ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి.
3. మృతులు హరీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 50 లక్షల నష్టపరిహారాన్ని ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
4. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, కవ్వం పల్లి సత్యనారాయణ, అది శ్రీను, తదితరులను వెంటనే విడుదల చేయాలి.
5. మొత్తం వ్యవహారం లో కేసీఆర్ స్పందించి సమగ్ర విచారణ చేయాలి..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!