TPCC Mahesh Goud : ఇందిరాభవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజీ షెడ్యూల్ ఉన్న.. తెలంగాణ కు రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు. కుల గణన కు అత్యంత ప్రాధాన్యం ఉన్నందున రాహుల్ వస్తున్నారని ఆయన వెల్లడించారు. 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు వస్తున్నారని, బిజీ షెడ్యూల్ ఉన్నందున రాహుల్ గంట సేపు మాత్రమే ఉంటారని ఆయన పేర్కొన్నారు. కుల గణన లో ఎలాంటి అంశాలు ఉండాలో సూచించాలన్నారు మహేష్ గౌడ్. కుల గణన అత్యంత ప్రాధాన్యత గా కాంగ్రెస్ పార్టీ స్వీకరించిందని, రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర లో కుల గణన చేపట్టి ఆయా వర్గాల జనాభా ప్రకారం సంపద పంపిణీ జరగలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు.
Thatikonda Rajaiah : కడియంకి రేవంత్ రెడ్డిని కలిసే దిక్కు లేకుండా పోయింది…
కులగణన ఎన్నో దశాబ్దాల తర్వాత జరుగుతున్నదన్నారు మహేష్ గౌడ్. కుల గణన జరిగితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, ఇందులో అనేక ప్రశ్నలు పొందుపరచడం జరుగుతోందన్నారు. ఇంకా ఎలాంటి అంశాలు ఉంటే సమగ్రంగా మరింత లోతుగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లు చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నారని, తెలంగాణ కుల ఘనన దేశానికి ఆదర్శంగా ఉండాలన్నారు.