రామచంద్ర తెలుగు సినిమాల్లో పనిచేసి, మంచి గుర్తింపు పొందిన నటుడు. ప్రత్యేకించి వెంకీ సినిమాలో అతని నటన ప్రేక్షకులకు సుపరిచితమైంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పక్షవాతం సమస్యతో బాధపడుతున్నారు. ఈ అనారోగ్యం వల్ల సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది, మరియు ఆయన ఆరోగ్యం గురించి ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. మంచు మనోజ్ ఈ సందర్భంగా రామచంద్రకు మద్దతుగా నిలబడి,రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. Also Read : Shivani…
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో…
రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్ పర్యటనలో మాట్లాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
ఇందిరాభవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజీ షెడ్యూల్ ఉన్న.. తెలంగాణ కు రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ వర్గాల నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా తొలిసారిగా తెలంగాణకు రానున్నారు.
ప్రధాని మోదీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో.. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో బసకు ఏర్పాటు చేసారు అధికారులు. మోడీ రాకకు ముందుగా నిన్న (బుధవార)మే హైదరాబాద్‌కు చేరుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బృందాలు నోవాటెల్ హోటల్‌లో స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో.. ప్రధానితోపాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్న సందర్భంగా.. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అయితే.. రాజ్‌భవన్‌లోనే మోడీ బస చేస్తారని తొలుత భావించారు.…