Site icon NTV Telugu

TPCC Mahesh Goud: ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

TPCC Mahesh Goud: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పరెడ్డి గూడ గ్రామంలో ప్రజా పాలన లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు కుసుమ కుమార్, శివసేనా రెడ్డి తదితరులు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లబ్దిదారులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లకు ఎన్నికైన వారికి ధృవీకారణ పత్రాలు అందజేశారు. మహేష్ కుమార్ గౌడమాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే మహిళ్లకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మామ, అల్లుడు, బిడ్డ, కొడుకు కాదన్నారు. కుటుంబ పాలన కాదన్నారు.

Bhatti Vikramarka:”తెలంగాణకు అన్యాయం” పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం రియాక్షన్…

ప్రజల్లో నుండి వచ్చిన నాయకులే ఉంటారన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఖర్చు లేకుండా ప్రభుత్వ ఫలాలు అందజేస్తున్నామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రన్ని ఏడున్నర లక్షల కోట్లు అప్పుల పాలు చేసి ఇప్పుడు ఫామ్ హౌజ్ లో పడుకున్నాడు. కెసిఆర్ ఫామ్ హౌజ్ లో పడుకుంటే అల్లుడు, కొడుక్కి కాంగ్రెస్ ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి కడుపు మంటగ ఉందన్నారు. ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 56000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి లో పోసి కమీషన్లు దండుకున్న ఘనత కెసిఆర్ ది అన్నారు. రాష్టంలో ప్రతి పేద వాడికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత కాంగ్రెస్ ది అన్నారు. బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాళ్లన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో నే అభివృద్ధి సాధ్యమన్నారు. పథకాలకు ఇందిరా, రాజీవ్ ల పేర్లు పెడితే నిధులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని అన్నారు మహేష్ కుమార్ గౌడ్..

Uttam Kumar Reddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేసిన మంత్రి..

Exit mobile version