Site icon NTV Telugu

Revanth Reddy: మనీ, మద్యంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు..

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: బీఆర్‌ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములకు పట్టాల పంపిణీ జరిగిందన్నారు. మా హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందిందన్నారు. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేస్తామని బీఆర్‌ఎస్‌ హామీ నెరవేరలేదన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాస్‌ పేట్‌లో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రేవంత్ ప్రసంగించారు. కృష్ణా జలాలు తీసుకోస్తామని మోసం చేశారన్నారు. మాదనపూర్ నుంచి ఇక్కడ తండాలకు రోడ్లు వేయించింది తానేనని.. పదేళ్లలో ఈ ప్రాంతానికి కేసీఆర్ చేసిందేం లేదన్నారు.

Also Read: BJP MP Laxman: బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.. కేవలం సలహాలు, సూచనలు మాత్రమే..

ఓటుకు పదివేలు ఇచ్చి బీఆర్‌ఎస్‌ గెలవాలనుకుంటోందన్నారు. మనీ, మద్యంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ సంగతేమో కానీ.. భార్య మెడలో బంగారం అమ్మే పరిస్థితి తెలంగాణలో దాపురించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల మొదటి తారీఖు రూ.2500 ఖాతాలో వేస్తామన్నారు. రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలందరికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారుప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.

రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తామని.. రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తామన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు సాయం అందిస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4వేలు పెన్షన్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ హామీలు గుప్పించారు.

 

Exit mobile version