Site icon NTV Telugu

Revanth Reddy : త్యాగాల పునాదులపై గద్దెనెక్కారు.. దమ్ముంటే రండి చూసుకుందాం..

Congress

Congress

నిజమాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాం సాగర్ గుర్తొస్తుంది.. నాటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథిని బంధించిన జైలు గుర్తొస్తుంది.. నిజామాబాద్ కు గొప్ప పేరు తెచ్చిన మహనీయుల గడ్డను ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు.. ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు? అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Uddhav Thackeray: లౌకికవాదం కోసమే వాజ్‌పేయ్ ప్రధాని అయ్యారు.. హిందుత్వాన్ని విడిచింది మీరా..? మేమా..?

అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసాగించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, 30 పడకల ఆసుపత్రి కాంగ్రెస్ హయాంలో వచ్చిందేనని ఆయన గుర్తు చేశారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్.. ఇక్కడ ఎవరు వ్యాపారం చేసినా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పెట్టుబడి లేకుండా భాగస్వామిగా ఉంటాడని రేవంత్ రెడ్డి ఆరోపించాడు.

Also Read : All England Open 2023: పీవీ సింధుకి చేదు అనుభవం.. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం

అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగింది.. అంబేడ్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగింది.. అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తన చెంచాలతో నన్ను తిట్టిస్తున్నాడని టీపీసీసీ చీఫ్ తెలిపాడు. పెద్దమనిషి స్థానంలో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇసుక దందాలను తన కొడుకులకు పంచి ఇచ్చిండని ఆరోపించాడు. మోదీ తన జేబులో ఉన్నాడన్న అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తీసుకురాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ధర్మపురి అరవింద్ పేరులోనే ధర్మం ఉంది.. ఆయన పనిలో అధర్మం కనిపిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.

Also Read : Ravanasura: ‘ఇడియట్’ రవితేజ గుర్తొచ్చాడు బ్రో..

కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దు.. తల్లిని చంపి పిల్లను బతికించారని మోదీ తెలంగాణను అవమానించారు.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఉచితంగా అందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది..
రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తాం.. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలను ఏడాదిలోగా భర్తీ చేస్తామన్నారు. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ ది అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరు మైనారిటీల సంక్షేమానికి పాటుపడ్డారో ముస్లిం సోదరులు ఆలోచించండి.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను అడిగారు.

Exit mobile version