Pakistan: తీవ్ర గాలి కాలుష్యం.. పాకిస్తాన్‌లోని ఈ నగరాల్లో లాక్డౌన్
- పాకిస్తాన్లో బీభత్సం సృష్టిస్తున్న గాలి కాలుష్యం
- పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు నగరాలు లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్డౌన్
- తీవ్ర గాలి కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితులు
- ముల్తాన్ నగరంలో 2000 దాటిన AQI
- లాహోర్‌లో AQI 1100 కంటే ఎక్కువగానే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాలి కాలుష్యం ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంలోనే కాకుండా.. పాకిస్తాన్లో కూడా బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు నగరాలు లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్డౌన్ విధించారు. తీవ్ర గాలి కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముల్తాన్ నగరంలో AQI 2000 దాటింది. లాహోర్‌లో AQI 1100 కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వం లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్డౌన్ విధించిందని పాక్ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ARY న్యూస్ రిపోర్టు ప్రకారం.. లాహోర్ ప్రపంచంలోని రెండవ అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించారు.
Read Also: TPCC Mahesh Goud : కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
పంజాబ్ సీనియర్ ప్రావిన్షియల్ మంత్రి మరియం ఔరంగజేబ్ మాట్లాడుతూ.. పొగమంచు, కాలుష్యం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల గురించి వివరించారు. దీనివల్ల ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడిందని.. ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. ఇప్పటి పరిస్థితులను కోవిడ్ సమయంలో అనుభవించిన ప్రమాదాలతో పోల్చాడు. మరోవైపు.. పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా.. పంజాబ్ ప్రభుత్వం నవంబర్ 24 వరకు హయ్యర్ సెకండరీ స్థాయి వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Air passenger Record: దేశీయ విమాన రంగంలో సరికొత్త రికార్డు
ఇదిలా ఉంటే.. పంజాబ్ ప్రావిన్స్‌లో కేవలం ఒక వారంలోనే 600,000 మందికి పైగా ప్రజలు కాలుష్య సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. గత వారంలో 65,000 మందికి పైగా ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు. ఈ దృష్ట్యా, ప్రాంతీయ ప్రభుత్వం పారామెడికల్ సిబ్బంది సెలవులను రద్దు చేసింది. OPD సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగించింది.
తాజావార్తలు
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..