Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Casting Couch: నటన రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించే అమ్మాయిలకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే తనకు ఎదురైన ఇలాంటి అనుభవాలను ఏ మాత్రం భయపడకుండా బయటపెట్టే నటీమణుల్లో ఖుషీ ముఖర్జీ ఒకరు. నటి, మోడల్ ఖుషీ ముఖర్జీ పలు టీవీ రియాలిటీ షోలు, దక్షిణాది సినిమాలు, హిందీ వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో ఆమె పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. తన బోల్డ్ స్టైల్, ముక్కుసూటి మాటలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. తనకు కూడా ఇలాంటి ఆఫర్లు వచ్చాయని చెప్పిన ఖుషీ.. వాటికి తాను ఎలా సమాధానం ఇచ్చేదో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో కొంతమంది డైరెక్టర్లు మహిళల నుంచి అనైతిక డిమాండ్లు చేస్తున్నారని ఖుషీ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పని కావాలంటే తమతో రాజీ పడాలని చెప్పడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆమె మండిపడ్డారు. ఒక నటికి ప్రతిభ, కష్టపడి పనిచేసే సామర్థ్యం కాకుండా వ్యక్తిగత సంబంధాలను అవకాశాలకు షరతుగా పెట్టడం పూర్తిగా తప్పని ఆమె అన్నారు.
Also Read
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
తనకు కూడా పాత్రలు ఇస్తామని చెప్పి ఇలాంటి ప్రతిపాదనలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఖుషీ తెలిపారు. అయితే అలాంటి పరిస్థితుల్లో తాను భయపడకుండా వారికి గట్టిగానే సమాధానం ఇచ్చేదానినని చెప్పారు. తనతో పడుకోవాలనుకుంటే తన స్థానంలో ఒక డమ్మీని తీసుకురావాలని, దానికి తన ఫొటోను అతికించి అది ఖుషీ అని ఊహించుకోవచ్చంటూ తాను వ్యంగ్యంగా చెప్పేదానినని ఆమె వెల్లడించారు.
క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను ఇబ్బందులకు గురిచేయడం వెనుక ఉన్న మైండ్‌సెట్‌పై కూడా ఖుషీ తీవ్రంగా స్పందించారు. ఒక అమ్మాయి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తుందంటే ప్రతి విషయంలోనూ రాజీ పడాల్సిందే అన్నట్టుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. నటీమణులను కేవలం తమ వ్యక్తిగత కోరికలు తీర్చే వస్తువులుగా చూడటం అవమానకరమని వ్యాఖ్యానించారు.
ఇలాంటి డిమాండ్లు చేసే వ్యక్తులను ఖుషీ తీవ్రంగా విమర్శించారు. తమను తాము ఇండస్ట్రీలో పెద్దవారిగా చూపించుకుంటూ కొత్తగా వచ్చే నటీనటులను ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యంగా అవకాశాల కోసం వచ్చే యువ నటీమణుల బలహీనతలను ఆసరాగా చేసుకుని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించడం నైతికంగా పూర్తిగా తప్పని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు ఒక దర్శకుడు హైదరాబాద్‌లో తనను మోసం చేసి, ఒక రాత్రి కోసం నిర్మాతకు ₹1 లక్షకు ఎలా అమ్మేయాలని చూశాడో కూడా ఆమె ధైర్యంగా బయటపెట్టారు.
ఖుషీ ముఖర్జీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీస్తున్నాయి. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే పలువురు నటీమణులు తమ అనుభవాలను పంచుకున్న నేపథ్యంలో, ఖుషీ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. అవకాశాలు ఇవ్వడం పేరుతో ఎవరైనా ఇలాంటి డిమాండ్లు చేస్తే వాటిని అంగీకరించాల్సిన అవసరం లేదని, వాటిని గట్టిగా ఎదుర్కోవాలని ఆమె ఒక సందేశాన్ని అయితే ఇస్తున్నారు.
- Tags
- Casting Couch
- cinema
తాజావార్తలు
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు