Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్య్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఉదయం 11:40 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మంటపంలో జరిగే రెండు రోజుల సదస్సులో భాగం కానున్నారు. జిన్‌పింగ్ కాన్వాయ్‌లో సీపీసీ సెంట్రల్ కమిటీ జనరల్ ఆఫీస్ డైరెక్టర్ కై కీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వంటి కీలక నేతలు కూడా ఉన్నారు.
ఈ పర్యటనలో అందరి దృష్టి ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌ల మధ్య జరగనున్న ద్వైపాక్షిక భేటీపైనే నెలకొంది. గతంలో 2019లో చెన్నైలో జరిగిన అనధికారిక సదస్సు తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, అక్టోబర్ 2024లో సరిహద్దుల వద్ద దళాల ఉపసంహరణ (డిస్ఎంగేజ్మెంట్)పై ఒప్పందం కుదిరిన నాటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలు మళ్లీ పుంజుకోవడం ప్రారంభించాయి. సరిహద్దుల్లో సైనిక మోహరింపులు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వాణిజ్య, వ్యాపార సంబంధాలు క్రమంగా సర్దుమణుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న మోడీ-జిన్‌పింగ్ భేటీలో ఇరు దేశాల సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, మార్కెట్ యాక్సెస్, సరిహద్దు వివాదాల పరిష్కారం వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భేటీకి ముందే చైనా కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి చూపింది. ఇరు దేశాలు తమ విభేదాలను సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ, సమాచార మార్పిడి మరియు సహకారాన్ని పెంచుకోవాలని బీజింగ్ పిలుపునిచ్చింది.
Also Read
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
- Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
ప్రస్తుతం 11 సభ్య దేశాలతో విస్తరించిన బ్రిక్య్స్ కూటమికి భారత్ 2026లో అధ్యక్షత వహిస్తోంది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో ఆర్థిక సహకారం, వాణిజ్యం-పెట్టుబడులు, సాంకేతికత, ఇంధన, ఆహార భద్రతతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు, అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వంటి అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య ఈ సమావేశం జరుగుతోంది. ఒకవైపు గ్లోబల్ సూపర్ పవర్స్‌తో వ్యూహాత్మక బంధాన్ని కాపాడుకుంటూనే, మరోవైపు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ ఈ సదస్సును వేదికగా మలుచుకుంటోంది.
తాజావార్తలు
-
IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
-
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
-
LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!