Delhi AQI: ఢిల్లీలో విషపూరితంగా మారుతున్న గాలి నాణ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో గాలి నాణ్యత విషపూరితంగా మారుతుంది. దీపావళికి ముందు దేశ రాజధానిలోని ఏ ప్రాంతం కూడా పీల్చడానికి సరిపోవడం లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (గురువారం) ఉదయం గాలి నాణ్యత స్థాయి 504 దాటింది అని ఢిల్లీలోని NCR తెలిపింది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 504గా నమోదు అవుతుంది. ఇక, జహంగీర్‌పురిలో 437, నోయిడాలో 415, ఫరీదాబాద్‌లో 324గా నమోదు అయింది. అయితే, ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 432, ఆర్‌కె పురంలో 453, పంజాబీ బాగ్‌లో 444 తో పాటు ITOలో 441గా నమోదు అయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆ తర్వాత వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.
Read Also: Viral Video: ఆహా రాళ్ల మధ్యలో ఏం చక్కగా నిద్రపోతుందో ఈ కోతి
Also Read
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
ఢిల్లీ ఏక్యూఐ నిన్న (బుధవారం) వరుసగా ఆరో రోజు కూడా గాలిలో నాణ్యత కోల్పోవడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400 కంటే ఎక్కువ నమోదైంది అని చెప్పుకొచ్చారు. వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా ఇందులో చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపించడం లేదు.. గాలి వేగం స్వల్పంగా పెరగడం, దిశ మారడం వల్ల మంగళవారం కాలుష్య స్థాయిలు స్వల్పంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెప్పింది. అయితే బుధవారం మళ్లీ పెరిగింది. ఢిల్లీ ఏక్యూఐ బుధవారం 426గా ఉంది.
Read Also: Supreme Court Collegium: సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు.. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదం
ఇక, మంగళవారం 395గా నమోదు అయింది. 24 గంటల్లోనే 31 పాయింట్లు పెరిగింది. ఢిల్లీలోని నాలుగు ప్రాంతాలలో మాత్రమే ఇండెక్స్ 400 కంటే తక్కువగా ఉంది. కానీ ఇక్కడ గాలి కూడా ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రూపొందించిన ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం.. వచ్చే రెండు రోజుల్లో గాలి సాధారణ పరిస్థితికి చేరుకుంటుందని చెప్పారు. గాలి వీస్తున్నప్పుడు దాని వేగం సాధారణంగా గంటకు పది కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుందన్నారు. దీని కారణంగా ఇవాళ కూడా గాలిలో నాణ్యత ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. రాబోయే ఆరు రోజులలో గాలి నాణ్యతలో హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. ఢిల్లీలో గాలి కాలుష్యంపై నాసా
ఢిల్లీలో గాలి న్యాణ్యత ప్రమాణాలు:
ఐటీఓ-459
పంజాబీ బాగ్-464
నెహ్రూ నగర్-456
సోనియా విహార్-444
జహంగీర్‌పురి-453
NCR నగరాల- AQI
ఫరీదాబాద్ – 425
ఘజియాబాద్ – 384
గ్రేటర్ నోయిడా – 478
నోయిడా – 405
గురుగ్రామ్ – 385
#WATCH | Delhi air quality continues to remain in the 'severe' category as per the Central Pollution Control Board
(Visuals from Kartavya Path, shot at 6:30 a.m. today) pic.twitter.com/sV7bjRlUlv
— ANI (@ANI) November 9, 2023
తాజావార్తలు
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!