Rishikonda Beach: రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ.. సంతోషం వ్యక్తం చేసిన మంత్రి
- రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ..
- సంతోషం వ్యక్తం చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం ఎంతో కీలకమైనదని
- పర్యాటక శాఖ, విశాఖ కలెక్టర్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పోలీస్, అటవీ శాఖల అధికారులకు ప్రత్యేక అభినందనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishikonda Beach: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. రుషికొండ బీచ్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చి, బ్లూఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక శాఖ అధికారులను సమర్థంగా దిశానిర్దేశం చేసి, తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించామని చెప్పారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు విశేష కృషి చేసిన పర్యాటక శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్ హరేంద్రీ ప్రసాద్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పోలీస్, అటవీ శాఖల అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Read Also: Municipal Chairman: అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర.. మున్సిపల్ ఛైర్మన్ శాంత
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ హోదా పునరుద్ధరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం ఎంతో కీలకమైనదని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ ఇద్దరు నేతలకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో మొదటి ఎనిమిది బీచ్‌లలో రుషికొండ బీచ్ ఒకటిగా నిలిచిందని మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ బీచ్‌కు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్లీన్, సేఫ్, ఎకో-ఫ్రెండ్లీ బీచ్ హోదా రావడం విశాఖపట్నం గర్వించదగిన విషయం అని పేర్కొన్నారు. రుషికొండ బీచ్ అభివృద్ధికి మరింత కృషి చేసి, ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?