Rishikonda Beach: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. రుషికొండ బీచ్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చి, బ్లూఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక శాఖ అధికారులను సమర్థంగా దిశానిర్దేశం చేసి,…