NTV Telugu Site icon

Heavy Rain: వడోదరలో దంచికొట్టిన వర్షం.. రోడ్ల మీదకొస్తున్న మొసళ్లు

Vadodara

Vadodara

గుజరాత్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. వడోదరలో 13.5 మి.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం భారీ వరదలతో ముంచెత్తింది. మరోవైపు.. విశ్వామిత్ర నది ప్రమాదకర స్థాయిని దాటింది. విశ్వామిత్ర నది నీటిమట్టం పెరగడంతో మొసళ్లు బయటకు వస్తున్నాయి. ఎగువ నది నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా విశ్వామిత్ర నదికి వరద పోటెత్తింది. నది మట్టం ప్రమాద స్థాయిని దాటి 27.85 అడుగులకు చేరుకుంది. దీంతో నగరంలోకి వరద నీరు రావడం మొదలైంది.

Darshan: యాక్టర్ దర్శన్‌కి కోర్టులో చుక్కెదురు.. అందుకు నో చెప్పిన కోర్టు..

భారీ వర్షం కారణంగా వడోదరలో గురువారం పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. మరోవైపు.. జిఐడిసి అగ్నిమాపక కేంద్రం బృందం అకోటా గ్రామంలోని దేవ్‌నగర్ మురికివాడ నుండి 20 మందిని రక్షించింది. నిజాంపుర ప్రాంతంలోని పటేల్ ఫాడియా, గాంధీ చౌక్‌లో మొత్తం 50 ఇళ్లు నీట మునిగాయి. ఫతేగంజ్ నరహరి ఆసుపత్రి వెలుపల ఒక మొసలి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. రాత్రి 2 గంటల సమయంలో మరో మొసలి రోడ్డుపై నడుస్తూ కనిపించింది. మొసలిని చూడగానే ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మొసలిని రక్షించి తిరిగి నదిలోకి వదిలారు.

Sekhar Master: దేవర సాంగ్… ఇప్పుడు కాసేపు హైప్ ఎక్కించుకుందాం!!

వడోదర డివిజన్‌లోని రైల్వే బ్రిడ్జి కింద నీటిమట్టం పెరగడంతో 11 సుదూర ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆపరేషన్‌ను మార్చగా, నాలుగు లోకల్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. గత 24 గంటల్లో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 8 మంది మరణించారని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ అలోక్ కుమార్ పాండే తెలిపారు. అదే సమయంలో.. 826 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రభావిత జిల్లాల్లో ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 20 బృందాలు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 11 బృందాలను మోహరించారు.