IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌గా ఐపీఎల్ పేరుగాంచింది. ప్రతి ఏడాది ఈ టోర్నమెంట్‌లో ఎన్నో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు, కొత్త రికార్డులు కనిపిస్తాయి. గతంలో చాలా మంది ఆటగాళ్లు తమ అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్ గేల్:
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013 ఏప్రిల్ 23న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున పూణే వారియర్స్ జట్టుపై అతడు 175 పరుగులు చేశాడు. కేవలం 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో 265.15 స్ట్రైక్ రేట్‌తో దూకుడుగా గేల్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ ఇప్పటికీ ఐపీఎల్‌లో ఎవరూ చేరుకోలేని రికార్డు. అలాగే 2016లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఆడిన మ్యాచ్ లో సాధించిన 129 నాటౌట్ ఇన్నింగ్స్ కూడా టాప్ 10 స్కోర్స్ లో ఒకటిగా ఉంది.
Read Also: Hero MotoCorp: Xpulse 210, Xtreme 250R బైక్‌లకు బుకింగ్స్ ఓపెన్
బ్రెండన్ మెకల్లమ్:
2008లో తొలిసారి ఐపీఎల్ ప్రారంభమైన మ్యాచ్‌లోనే బ్రెండన్ మెకల్లమ్ అద్భుత శతకాన్ని సాధించాడు. 18 ఏప్రిల్ 2008న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున RCB జట్టుపై అతను 158 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అలరించాడు. మొదటి ఐపీఎల్ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ మరింత ప్రఖ్యాతిని పొందింది.
క్వింటన్ డికాక్:
2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరఫున క్వింటన్ డికాక్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుపై 140 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 200 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. అతని ఈ ఇన్నింగ్స్ LSGకు విజయాన్ని అందించింది.
ఏబీ డివిలియర్స్:
10 మే 2015న ముంబై ఇండియన్స్ (MI) పై ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేసి 133 పరుగులు చేశాడు. 59 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 225.42 స్ట్రైక్ రేట్‌తో RCB తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే మరుసటి ఏడాది కూడా గుజరాత్ లయన్స్ పై 129 పరుగులు సాధించారు.
Read Also: SC Classification: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్ రియాక్షన్!
కేఎల్ రాహుల్:
2020 ఐపీఎల్ సీజన్‌లో కేఎల్ రాహుల్ కింగ్స్ XI పంజాబ్ తరఫున RCB పై 132 పరుగులు చేశాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 191.30 స్ట్రైక్ రేట్‌తో ఆడిన రాహుల్, అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు.
శుభ్‌మన్ గిల్:
26 మే 2023న ముంబై ఇండియన్స్ (MI) పై శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ తరఫున 129 పరుగులు చేశాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 215.00 స్ట్రైక్ రేట్‌తో గిల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
రిషభ్ పంత్:
2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై రిషభ్ పంత్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున 128 పరుగులు చేశాడు. 63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 203.17 స్ట్రైక్ రేట్‌తో శతకం సాధించాడు.