Hero Motors: భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజా మోడల్స్ Xpulse 210, Xtreme 250R బైక్‌ల డెలివరీలను ఈ నెల చివరి నాటికి ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ కొత్త మోటార్‌సైకిళ్లు హీరో మోటోకార్ప్‌కు అడ్వెంచర్, స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్‌లలో మరింత ముందుకు తీసుక వెళ్లనున్నాయి. ఈ మోడల్స్ కోసం 2025 ఫిబ్రవరిలోనే బుకింగ్స్ ప్రారంభించాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో మార్చి 20 నుంచి అధికారికంగా బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహన మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది.
Read Also: MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగింది..
హీరో XPulse 210 తన కిందటి వర్షన్‌తో పోలిస్తే మరింత శక్తివంతమైనదిగా కనపుడుతోంది. ఇది అధునాతన ఫీచర్లతో సహా అధిక పవర్‌ను అందించడమే కాకుండా, అడ్వెంచర్ బైక్ ప్రియులకు మరింత ఆకర్షణీయంగా మారనుంది. అదే విధంగా Xtreme 250R శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్‌తో స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది.
ఇక వీటి ధర విషయానికి వస్తే.. XPulse 210 ధర రూ. 1.75 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇక ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 1.86 లక్షలు. ఇది XPulse 200 4V కంటే మెరుగైన అప్‌గ్రేడ్. అయితే ధరలో సుమారు రూ. 24,000 అధికంగా ఉంది. ఇక Xtreme 250R ధర రూ. 1.79 లక్షలుగా నిర్ణయించబడింది. ఇది పవర్‌ఫుల్, స్టైలిష్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ కోసం వెతుకుతున్న వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది. హీరో మోటోకార్ప్ వినియోగదారులకు అధిక విలువనిచ్చే మోటార్‌సైకిళ్లను అందించాలనే లక్ష్యంతో ఈ ధరలను నిర్ణయించింది.
Read Also: Sanju Samson: గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన ఆర్ఆర్ కెప్టెన్..
XPulse 210 పెర్ఫార్మెన్స్, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 210cc, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్.. 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, 24.6 bhp పవర్, 20.7 Nm టార్క్ అందించనున్నారు. మరి Xtreme 250R విషయానికి వస్తే ఇందులో 250cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్, 29.58 bhp పవర్, 25 Nm టార్క్, అధిక వేగం, మెరుగైన డ్రైవింగ్ అనుభవం అందించనున్నది.