కేసీఆర్ 10ఏళ్లలో కేటీఆర్‌ని సీఎం చేయాలనే ఆలోచనలోనే గడిపేశారు
ఆదిలాబాద్‌లో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ ఓకే ఒకే భూమి ఆంగ్లేయులు, నిజంపై పోరాటం చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారికంలోకి రాగానే 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని, తెలంగాణకి డబల్ ఇంజన్ సర్కార్ కావాలన్నారు అమిత్ షా. కేంద్ర ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యానికి రాష్ట్రం నిధులు కేటాయించక పోవడమే కారణమని, పసుపుబోర్డు ద్వారా ఎగుమతులు పెరగనున్నాయన్నారు. కృష్ణ ట్రిబ్యునల్ ద్వారా మోడీ తెలంగాణ ప్రజల నీటి సమస్యను తీర్చారని, 33శాతం మహిళా రిజర్వేషన్లు చేసిన ఘనత మోడీదన్నారు అమిత్ షా.
బాహుబలి బిజ్జాల దేవా ఇంట తీవ్ర విషాదం
ఇండస్ట్రీలో వరుస మరణాలు ఏమిమానులను విషాదంలోకి నెడుతున్నాయి. గతరాత్రి.. నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ప్రముఖ నటుడు నాజర్ తండ్రి మాబూబ్ బాషా (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్దాప్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్‌మలై వీధిలోని స్వగృహంలో కన్నుమూశారు. దీంతో నాజర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నాజర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా, కమెడియన్ గా.. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా బాహుబలి సినిమాలో రానా తండ్రి బిజ్జాల దేవాగా ఆయన నటన అద్భుతం.
చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, పయ్యావుల కేశవ్ ములాఖత్
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. 40 నిమిషాల పాటు ములాఖత్ సాగింది. ఇదిలా ఉంటే చంద్రబాబు 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. కోర్టు తీర్పులు, లోకేష్ సిఐడి విచారణ, పార్టీ వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో చర్చించారు.
ములాఖత్ అనంతరం జైలు బయటకు వచ్చి అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. జైలులో చంద్రబాబును చూసి బాధ కలిగిందన్నారు. కృష్ణా జలాలపై పార్టీ యంత్రాంగం స్లోగా ఉందని.. మీరందరూ చొరవ చూపకపోతే రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతుందని చెప్పారని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అన్యాయం జరుగుతుందని.. ఈ కేసులను రాజకీయ కుట్రగా ప్రజలు భావిస్తున్నారని పయ్యావుల అన్నారు. ప్రజల కోసమే జైలులో ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల తరుణంలో టీడీపీని ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్నారని.. జగన్ ప్రభుత్వ పతనం ఖాయమని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఇందుకే పెళ్లి చేసుకోవట్లేదట..
5 రాష్ట్రాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చాలా కీలకం కాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని మహారాణి కళాశాల విద్యార్థులతో సమావేశం కావడాన్ని, వారు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ నెటిజన్లతో పంచుకున్నారు. సెప్టెంబర్ 23న జరిగి ఈ ఇంటారక్షన్‌ని రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారంలో షేర్ చేశారు. ఈ సమావేశంలో మహిళా విద్యార్థినులు రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. కులగణన, స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర, ఆర్థిక స్వాతంత్య్రం, రాహుల్ గాంధీ ఇష్టాల గురించి పలు కీలక విషయాలను పంచుకున్నారు.
దొంగలు చాలా సార్లు తప్పించుకుంటారు కానీ.. అన్ని సార్లు తప్పించుకోలేరు
టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు అరెస్ట్ దగ్గర్నుంచి టీడీపీ వాళ్లు.. నేరం చెయ్యలేదని ఎక్కడా చెప్పడం లేదని మంత్రి పేర్కొన్నారు. దొరికిన దొంగలకు మర్యాద చెయ్యలేదు అని వాదిస్తున్నారని.. అన్ని కోర్టుల్లో ఒకే రకమైన వాదనలు వినిపిస్తున్నారని ఆరోపించారు. సిమెన్స్ కంపెనీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు అని చెప్తోందని మంత్రి అన్నారు. చంద్రబాబు జీవితం అంతా స్టేలేనని మంత్రి అంబటి విమర్శించారు. ఆషామాషీగా చంద్రబాబు అరెస్ట్ జరగలేదని.. దొంగలు చాలా సార్లు తప్పించుకుంటారు కానీ అన్ని సార్లు తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.
యుద్ధంలోకి 3 లక్షల మంది రిజర్వ్ సైన్యం.. హమాస్‌ని తడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్..
గాజాపై విరుచుకుపడేందుకు ఇజ్రాయిల్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. శనివారం హమాస్ టెర్రరిస్టులు జరిపిన దాడిలో 900 మంది వరకు ఇజ్రాయిల్ ప్రజలు చనిపోయారు. ఇదిలా ఉంటే భారీ స్థాయిలో యుద్ధం చేసేందుకు ఇజ్రాయిల్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే తాము యుద్ధంలో ఉన్నామని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యహూ ప్రకటించాడు. యుద్ధం మీరు మొదలుపెట్టారు, తాము ముగిస్తామని హమాస్‌కి వార్నింగ్ ఇచ్చారు.
హమాస్ ఇప్పటికే దాడులు చేస్తుండగా.. మరోవైపు లెబనాన్ నుంచి మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా కూడా దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ మరింత శక్తివంతంగా తయారువుతోంది. 3 లక్షల రిజర్వ్ ఆర్మీని సమీకరించింది. ఇతర దేశాల్లో ఉంటే ఇజ్రాయిల్ పౌరులు మాతృభూమి రక్షణ కోసం ఇజ్రాయిల్ వెళ్తున్నారు. చాలా మంది ఇప్పటికే సైన్యంలో చేరారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 3,00,000 మంది రిజర్వ్ ఆర్మీ యాక్టీవ్ కావడంతో రాబోయే కాలంలో భారీ ఎత్తున యుద్ధం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమిత్ షా పర్యటనలో సీసీఐ పునరుద్దరణ ఊసే లేదు
ఆదిలాబాద్ సభలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణల పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వానిది ‘డబుల్ ఇంజిన్’’ కాదు… మీది ‘ట్రబుల్ ఇంజిన్ సర్కార్’ అని ఎద్దేవా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. కారు స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో పదిలంగా ఉందని, మీజేపీ స్టీరింగ్ మాత్రం ఆదానీ లాంటి కార్పోరేట్ల అదానీ చేతుల్లో ఉందన్నారు.
బీజేపోళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. అమిత్ షా తెలంగాణకు ఎప్పుడొచ్చినా అడ్డగోలుగా మాట్లాడుతాడు. నోటికొచ్చిన ఆరోపణలు చేసి పోతడు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు కొంచమైన అవగాహన ఉందా?. ఇక్కడ ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ఆయనకు తెలుసా..?’’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలను అడిగితే తెలుస్తుందని ఆయన హితవు పలికారు. రైతు ఆత్మహత్యలు డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆదివాసీల సంక్షేమంపై మాట్లాడే అర్హత అమిత్ షాకు లేదని తెలిపారు. బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, బీజేపోళ్లా మాకు నీతులు చెప్పేది అని ప్రశ్నించారు.
వీధుల్లో కనిపించిన భారీ మొసలి.. భయం జనం పరుగులు..
ఇటీవల కాలంలో ఎక్కువగా పారిన్ కంట్రీలలో భారీ కొండచిలువలు, మొసళ్ళు కనిపిస్తున్న సంగతి తెలిసిందే..తాజాగా వెస్ట్ బెంగాల్ లో కూడా భారీ మొసలి ఒకటి వీధుల్లో కనిపించింది.. దాన్ని చూసిన జనాలు పరుగులు తీశారు..ఆ మొసలికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లా కల్నా ప్రాంతంలో మంగళవారం ఉదయం 9.5 అడుగుల పొడవున్న మొసలి కనిపించింది. అనంతరం అటవీశాఖ అధికారులు నివాస ప్రాంతం నుంచి సరీసృపాన్ని రక్షించి భౌతిక పరీక్షకు తరలించారు.. అటవీ అధికారులు కల్నాలోని నివాస ప్రాంతం నుండి సరీసృపాన్ని రక్షించి భౌతిక పరీక్ష కోసం తీసుకెళ్లారు. భాగీరథి నది నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తున్న భారీ మొసలి మొదట రద్దీగా ఉండే ప్రాంతంలో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నివాస ప్రాంతాలకు వెళ్లడంతో కాల్నా మున్సిపాలిటీలోని 10వ వార్డులోని పాల్పర వాసులు భయాందోళనకు గురయ్యారు.
అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర.. అత్యంత ముఖ్యమైన కార్యక్రమమన్న జగన్
అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారు. అంతేకాకుండా.. బస్సు యాత్ర మీటింగుల ఏర్పాట్లను సమన్వయ పరచడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకులను సీఎం జగన్ నియమించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.
ముగిసిన హీరో నవదీప్ ఈడీ విచారణ..
మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు నవదీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతన్ని ప్రశ్నించడం కోసం విచారణకు పిలిచింది. ఇక ఎట్టకేలకు హీరో నవదీప్ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయానికి చేరుకోగా రాత్రి 7 గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దాదాపు 8 గంటల పాటు నవదీప్ ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు అయింది. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న డ్రగ్స్ పెడ్లర్లతో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానం ఉండడంతో నవదీప్ బ్యాంకు ఖాతాల వివరాలు, అందులో జరిపిన లావాదేవీలపై లోతుగా ఈడీ విచారించినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు, పవన్కు అదే కావాలి.. కొడాలి నాని విమర్శలు
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాపం పండిందని ఆరోపించారు. టెక్నికల్ నాలెడ్జ్ తో గతంలో 18 కేసుల్లో స్టే లు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని తెలిపారు. చంద్రబాబు 18 సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే పవన్ కల్యాణ్ సపోర్ట్ కావాలన్నారు. పవన్ కల్యాణ్ కు అసెంబ్లీకొచ్చి మైకు పట్టుకోవాలని ఆశ.. కానీ, ఒంటరిగా వస్తే మైకు కదా అసెంబ్లీ గేటు కూడా దాటడని కొడాలి నాని అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్షానికి 18 సీట్లు, పవన్ కళ్యాణ్ కి 1 సీటు మాత్రమే కావాలన్నారు.