లోకేష్, పవన్ కల్యాణ్‌పై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. సినిమా టైటిల్.. ట్యాగ్‌లైన్ కూడా..!
నారా లోకేష్, పవన్ కల్యాణ్‌తో పాటు నందమూరి బాలకృష్ణపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంతే కాకుండా.. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర జరిగిన ఎపిసోడ్‌కు ఆయన ఓ సినిమా టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు.. ట్యాగ్‌లైన్ కూడా చెప్పుకొచ్చారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇద్దరు మెంటల్ కేసులు.. ఆ ఇద్దరి మధ్య పిచ్చి పీకే అంటూ.. లోకేష్, బాలయ్య, పవన్‌పై సెటైర్లు వేశారు.. ”ఇద్దరు మెంటలోళ్ల మధ్య పిచ్చి పీకే’ అనేది సినిమా టైటిల్.. బొక్కలో బాబు 7691 అనేది ట్యాగ్ లైన్ అని పేర్కొన్నారు. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించటానికి పవన్ కల్యాణ్ వెళ్లాడు.. బీజేపీతో సంసారం చేస్తూనే జైల్లోకి వెళ్లి చంద్రబాబుతో తాళి కట్టించుకున్నాడు.. బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తాను అంటున్నాడంటూ మండిపడ్డారు.
చంద్రబాబు స్కామ్‌లలో పవన్ కల్యాణ్ పాత్ర.. వైసీపీ ఎంపీ అనుమానాలు..
చంద్రబాబు స్కామ్‌లలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్రపైనా పలు అనుమానాలు ప్రజల్లో ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే ప్రజలకే కాదు.. తమ పార్టీ్కి కూడా నిజమేనేమో అనిపిస్తోందన్నారు. రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన దొందు దొందేనని, వారి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని మొదట నుంచి తాము చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. ఈ రోజు చంద్రబాబు ఆర్థిక నేరాల కారణంగా సెంట్రల్ జైలులో ఉండటం వల్ల పవన్ ఆవేశంతో చెప్పినట్లు నటిస్తున్నా.. సమయం వచ్చింది కాబట్టి ముసుగుతీశారన్నారు. బీజేపీతో తమకు సయోధ్య కుదుర్చమని పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు టాస్క్ ఇచ్చారని, అలాగే టీడీపీ ఎంపీలు నలుగురికి కూడా టాస్క్ ఇచ్చినా.. ఫెయిల్ కావడంతో .. పొత్తు డ్రామా ప్రారంభించారని ఎద్దేవా చేశారు.
ఈసీకి వైసీపీ ఫిర్యాదు.. గణాంకాలు బయటపెట్టి విచారణకు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు చేసిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది వైసీపీ.. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని.. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గణాంకాలతో సహా ఫిర్యాదు లేఖ అందజేశారు పేర్ని నాని.. 2014-19 మధ్య భారీగా ఓటర్లు పెరిగాయని.. ఐదేళ్ల టీడీపీ పాలన హయాంలో ఏకంగా 8.1 శాతం ఓటర్ల సంఖ్య పెరిగిందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. 2014-23 మధ్య ఏపీలో జనాభా పెరుగుదల రేటు 1.1 శాతం ఉందని పేర్కొన్నారు.. మరోవైపు.. 2019-23 మధ్య ఓటర్ల సంఖ్య తగ్గిందని.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 0.09 శాతం ఓటర్ల సంఖ్య తగ్గిందని ఎన్నికల కమిషన్‌కు వివరించారు.. గణాంకాల్లో స్పష్టం అవుతున్న ఓటర్ల జాబితాలోని అవకతవకలపై విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ నేతలు.
నా పెళ్లి ఆపండి.. ఫేస్‌బుక్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాలిక..
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన వివాహాన్ని అడ్డుకుని, చదువుకునే అవకాశాన్ని కల్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది ఓ బాలిక.. ఫేస్‌బుక్ ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు పంపించింది ఏలూరు చెంచుల కాలనీకి చెందిన బాలిక.. దీంతో.. వెంటనే స్పందించి, బాలిక చదువుకునేందుకు చర్యలు చేపట్టారు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్.. తల్లిదండ్రులు లేని ఆ బాలికకు వివాహాం చేసేందుకు నిశ్చియించిన నానమ్మతాతయ్యలకు కౌన్సిలింగ్ ఇచ్చారు అధికారులు.. ఆ చిన్నారికి కావాల్సిన పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, స్కూల్‌కి వెళ్లడానికి ఓ సైకిల్‌ను కూడా అధికారులు సమకూర్చినట్టు తెలుస్తోంది. అమ్మానాన్న లేని ఆ చిన్నారికి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని నానమ్మతాతయ్య ప్రయత్నం చేశారు.. కానీ, ఆ చిన్నారి జీవితం ప్రమాదంలో పడుతుంది గ్రహించలేకపోయారు.
భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరణ.. అసలు విషయం ఇదేనా..?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకోవడం.. భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించడం చర్చగా మారింది.. అయితే.. వారానికి మూడుసార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రిలోనే ఉంటున్న నారా భువనేశ్వరి.. ములాఖత్ విషయంలో ఏపీ ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరిస్తోందని భువనేశ్వరి అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా.. కాదన్నారంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఈ ఘటనపై కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ క్లారిటీ ఇచ్చారు.. చంద్రబాబుతో ములాఖత్ కోసం భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు.. రిమాండ్ ముద్దాయికి వారంలో రెండు సార్లు మాత్రమే ములాఖత్ అవకాశం ఉంటుందన్నారు.. ముగ్గురు సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుందని.. అత్యవసరమైతే దానికి గల కారణం వాస్తవం నిర్ధారణ జరిపి మూడో ములాఖత్‌ను మంజూరు చేసే అధికారం జైలు సూపరింటెండెంట్‌కు ఉంటుందిని తెలిపారు. అయితే, అత్యవసర కారణాలను నారా భువనేశ్వరి ప్రస్తావించనందున మూడో ములాఖత్ మంజూరు చేయలేదని క్లారిటీ ఇచ్చారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా ఉన్నారు డీఐజీ రవి కిరణ్.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా
ప్రభుత్వం పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా నుండి తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందజేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్… అక్టోబర్ 24 న దసరా రోజు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు.. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ( 1 నుంచి 10 వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ‘‘ ముఖ్యమంత్రి అల్పాహార పథకం ( Chief Minister’s Breakfast Scheme) అందించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. తద్వారా విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పోషకాహారం అందిచే దిశగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఉదయాన్నే వ్యవసాయం పనులు కూలీపనులు చేసుకోవడానికి వెల్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సిఎం కేసీఆర్ మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహారం పథకాన్నిరాష్ట్ర ప్రభుత్వం దసరానుంచి అమలు చేయనున్నది.
హిమాచల్‌ను వదలని వర్షాలు.. 6 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
గత కొన్ని వారాలుగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వారి కష్టాలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. మండి సహా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా సిర్మౌర్‌లో వరద హెచ్చరిక జారీ చేశారు. మండి, బిలాస్‌పూర్, చంబా, కాంగ్రా, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి నుండి వాయువ్య భారతదేశాన్ని తాజా పశ్చిమ భంగం ప్రభావితం చేయవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 21 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దిగువ, మధ్య కొండలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.. ఎత్తైన ప్రాంతాలలో మోస్తరు వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల దృష్ట్యా.. రైతులు పంటలు, పండ్లకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
బీహార్లో పెరుగుతున్న క్రైమ్.. 24 గంటల్లో 10 మంది హత్య
బీహార్‌లో హత్యల పరంపర ఆగడం లేదు. హత్య కేసులు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. బీహార్‌లో గత 24 గంటల్లో 10 మంది హత్యకు గురవ్వడం సంచలనం రేపుతుంది. పాట్నా, బక్సర్, వైశాలి, భోజ్‌పూర్‌లలో ఏడుగురి హత్య తర్వాత.. ఇప్పుడు బీహార్‌లోని బంకాలో జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మోతిహారిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. బంకాలోని పొదల మధ్య ఉన్న బావిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరినీ గొంతు నులిమి హత్య చేసి మృతదేహాలను బావిలో పడేసినట్లు సమాచారం. ఈ సంఘటన అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్లికిట్ట చౌక్ సమీపంలో జరిగింది. యువకులు ధనియా చక్ గ్రామానికి చెందిన సూరజ్ యాదవ్ (30), సియురి గ్రామానికి చెందిన రాజా రామ్ మండలం (25)గా గుర్తించారు. యువకులిద్దరూ ఒకరికొకరు స్నేహంగా ఉండేవారని చెబుతున్నారు. గుజరాత్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటూ ఉండేవారు. అయితే వారిద్దరూ పదిహేను రోజుల క్రితమే ఇంటికి రాగా.. మంగళవారం నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. అయితే ఈ మర్డరీ మిస్టరీపై ఇంకా విషయాలు వెల్లడి కాలేదు.
రోహిత్ శర్మ డకౌట్.. టీమిండియా సారథి ఖాతాలో చెత్త రికార్డ్
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్-4 రౌండ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న కనిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 28 ఇన్నింగ్స్‌లు డబుల్ డీజిట్ స్కోర్లు చేస్తూ వచ్చిన రోహిత్ శర్మ, ఇవాళ్టి మ్యాచ్‌లో దాన్ని అందుకోలేకపోయాడు. ఆసియా కప్ చరిత్రలో మూడుసార్లు డకౌట్ అయిన మొట్టమొదటి టీమిండియా ప్లేయర్‌గా చెత్త రికార్డును రోహిత్ శర్మ మూటకట్టుకున్నాడు. ఇంతకుముందు భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా రెండేసి సార్లు డకౌట్ కాగా.. ఆసియా కప్ చరిత్రలో డకౌట్ అయిన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇంతకు ముందు 1988 ఆసియా కప్ ఎడిషన్‌లో అప్పటి భారత కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ డకౌట్ అయ్యాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 29వ డకౌట్ అయ్యాడు. టాపార్డర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచాడు.
వన్డే వరల్డ్ కప్ కోసం స్పెషల్ ఎడిషన్ కారు.. అతి తక్కువ ధరకే మీ సొంతం..!
ఐసీసీ వన్డే క్రికెట్ వరల్ద్ కప్ 2023 అఫీషియల్ పార్ట్నర్ నిస్సాన్ తాజాగా స్పెషల్ ఎడిషన్ కారు లోగోను విడుదల చేసింది. నిస్సాన్ కంపెనీ అత్యంత డిమాండ్ ఉన్న మాగ్నెట్ కారు స్పెషల్ ఎడిషన్ గ్లిఫ్స్ ను మనం చూడొచ్చు. నిస్సార్ మోటార్ ఇండియా ఈ ప్రత్యేక ఫీచర్స్ కలిగిన కారు బుకింగ్ లను కూడా స్టార్ట్ చేసింది. జపనీస్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన కూరో అనే పేరు ప్రత్యేక ఎడిషన్ ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. నిస్సాన్ మాగ్నైట్ కూరో ప్రత్యేక ఎడిషన్ కారు జోష్ కనిపిస్తుంది. ఈ కార్ ను వచ్చే నెలలో అధికారికంగా నిస్సాన్ ప్రారంభించబోతుంది. ఈ సందర్భంగా దాని ధరను కూడా వెల్లడించనున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. అలాగే మాగ్నెట్ XV MT, మాగ్నెట్ టర్బో XV MT అండ్ మాగ్నెట్ టర్బో XV CVTతో సహా అన్ని టాప్-ఎండ్ కార్లను రూ.11,000 చెల్లించి ఫ్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నిస్సాన్ మాగ్నైట్ కూరో స్పెషల్ ఎడిషన్ ఆకర్షణీయమైన ఆల్-బ్లాక్ ఎక్స్‌టీరియర్ అండ్ ఇంటీరియర్‌తో రాబోతుంది. ఇది.. కస్టమర్ కు ఫేవరెట్‌గా మారనుంది. ఈ కార్ ప్రీమియం లుక్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది.
ఉపేంద్ర భార్య నటవిశ్వరూపం.. డిటెక్టివ్ గా అదరగొట్టింది
కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగువారికి కూడా సుపరిచితమే. కానీ, ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర గురించి మాత్రం తెలుగువారికి తెలియదు. కానీ, ఆమె కూడా కన్నడలో స్టార్ హీరోయిన్. పెళ్లి తరువాత కూడా ప్రియాంక సినిమాలు కొనసాగిస్తుంది. ఇక ప్రియాంక నటించిన 50 వ సినిమా డిటెక్టివ్ తీక్షణ. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈవెంట్ లింక్క్స్ ఎంటర్‌టైన్‌మెంట్ & SDC సినీ క్రియేషన్స్ బ్యానర్ పై గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట్ చరణ్ మరియు పురుషోత్తం బి కొయ్యూరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో డిటెక్టివ్ తీక్షణగా ప్రియాంక ఉపేంద్ర కనిపించింది. ట్రైలర్ ను మొత్తం యాక్షన్ తో నింపేశారు. ఒక సాల్వ్ చేయలేని కేసు కోసం డిటెక్టివ్ తీక్షణను ప్రభుత్వం రంగంలోకి దింపుతారు. ఒక మాఫియా గ్యాంగ్ .. వారిని ఎదిరించిన ఒక వ్యక్తిని చంపేస్తుంది. వారిపై అతని భార్య కేసు పెట్టినా కూడా కోర్ట్ లో తీర్పు ఆమెకు అనుకూలంగా రాకపోయేసరికి ఆమె కోర్టు ముందే సూసైడ్ చేసుకుంటుంది. ఇక ఆమెకు న్యాయం చేయడానికి తీక్షణ ఏం చేసింది.. ? అసలు ఆ మాఫియా ను తీక్షణ ఎలా అంతం చేసింది.. ?
రతిక మా వాడిని వాడుకుంది.. బయటకు రాగానే పెళ్లి చేస్తాం.. పల్లవి ప్రశాంత్ తల్లి షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచే పల్లవి ప్రశాంత్ పేరు బాగా వినిపిస్తోంది. రైతుబిడ్డగా కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాడు. హౌస్ లో మొదటి వారం రతికతో లవ్ ట్రాక్ వల్ల ప్రశాంత్ పేరు బాగా వినిపించగా మనోడి ఓవర్ యాక్షన్ తో హౌస్ మేట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేశారు. అయితే అలా చేయడంతో ఆడియన్స్ అంతా ప్రశాంత్ పై ఇప్పుడు సింపతి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖలు చేస్తున్నారు. ప్రశాంత్ తల్లి మాట్లాడుతూ ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చాక పెళ్లి చేస్తామని వెల్లడించారు. తన కొడుకు బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఎంతోమంది సపోర్ట్ చేశారని, అందరూ సపోర్ట్ చేయడం వల్ల తన కొడుకు ఇప్పుడు హౌస్ లో ఉన్నాడని ప్రశాంత్ తల్లి చెప్పుకొచ్చారు. నాకు ఆరోగ్యం మంచిగా లేదు పెళ్లి చేసుకో బిడ్డ, కోడలైన ఇంట్లో పని చేస్తది, నాకు అసలు చేతకావడం లేదని చెబితే, అమ్మ నేను ఇంత కష్టపడ్డా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటా, అప్పటివరకు నువ్వు పెళ్లి ముచ్చట మాట్లాడకని అన్నాడని ఆమె అన్నారు.