ఈ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా టెన్త్ చదవాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను పొందాలంటే తప్పనిసరిగా టెన్త్ చదవాల్సిందేనని స్పష్టం చేశారు.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీం కింద గర్భవతులు, బాలింతలకు టేక్ హోం రేషన్, తదితర పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు.. అతే విధంగా.. అంగన్‌వాడీ సెంటర్లలో నాడు – నేడు పనులపై కూడా ఆరా తీశారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రతి నెల మొదటి, మూడవ శుక్రవారాలు గ్రామ ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పౌష్టికాహార రోజుగా నిర్వహించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో దీన్ని అనుసంధానం చేయాలన్న ఆయన.. పిల్లల ఎదుగుదల, టీకాలు, పౌష్టికాహారం వంటివి ఈ కార్యక్రమం ద్వారా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఇక, పీపీ–1, పీపీ–2 తరగతుల విద్యార్థులకు ఇచ్చే పాఠ్య ప్రణాళికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. పదాలు పలికే తీరు, ఫొనిటెక్స్ తదితర అంశాలపై శ్రద్ధ పెట్టాలన్న ఆయన.. బాల్య వివాహాల నిరోధంలో కళ్యాణమస్తు, షాదీతోఫా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెనలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.. అయితే, ఈ పథకాలు పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా టెన్త్ చదవాల్సిందేనని తేల్చేశారు.. చిల్డ్రన్ హోమ్స్‌లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు.. ఈ హోమ్స్ నిర్వహణలో సిబ్బందికి తర్పీదు ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
నేను కూడా టీడీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. ఆ పార్టీలోనే మహిళలకు భద్రత లేదు
తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత.. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు, లోకేష్ కు లేదన్న ఆమె.. ఎన్టీఆర్ కుమార్తెగా నారా భువనేశ్వరి అంటే మాకు గౌరవం ఉంది.. ఆమెను కించపరిచే వ్యాఖ్యలు వైసీపీ నేతలు ఎవరూ చేయలేదన్నారు. అనని విషయాలను మా ఎమ్మెల్యేలు అన్నట్లు లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డ ఆమె.. తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనే నీచమైన ఆలోచన లోకేష్‌ది అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపి మహిళల జీవితాలతో ఆడుకున్నది టీడీపీ నేతలు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ మహిళా పక్షపాతి.. మహిళలను రాజకీయంగా, ఆర్ధికంగా నిలబడేటట్లు పథకాలు అమలు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటూ కొనియాడారు పోతుల సునీత.. మీ పార్టీ ఆఫీసులో పని చేసే మహిళను లోకేష్ పీఏ వేధింపులకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందేనంటూ విమర్శలు గుప్పించిన ఆమె.. అయినా లోకేష్ ఎందుకు పీఏపై చర్యలు తీసుకోలేదు అని నిలదీశారు. టీడీపీ పార్టీలోనే మహిళలకు భద్రత లేదు అని ఆరోపించారు. జయప్రద, దివ్యవాణి వంటి చాలా మంది మహిళలు వేధింపులకు గురి అయ్యారు.. నేను కూడా టీడీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, పవన్ కల్యాణ్ టూరిస్ట్ నాయకుడు, ప్యాకేజీ స్టార్ అని మండిపడ్డారు. అయితే, పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకుల ఆలోచనా విధానాన్ని ఆచరణలో చూపిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు పోతుల సునీత.
ఆనం ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. వైసీపీలో చేరిన రాంనారాయణరెడ్డి సోదరుడు
నెల్లూరు రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది.. అయితే, సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ గూటికి చేరగా.. ఇప్పుడు ఆనం ఫ్యామిలీలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆనం రాంనారాయణ రెడ్డి సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి.. గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు జయకుమార్ రెడ్డి.. అయితే, తన మరో సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు.. జయకుమార్ రెడ్డి.. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి.. వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.. కాగా, ప్రస్తుతం నెల్లూరు జడ్పీ చైర్మన్ గా ఉన్నారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి సతీమణి ఆనం అరుణమ్మ.. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీకి ఆనం రాంనారాయణ రెడ్డి దగ్గర కావడంతో.. ఇప్పుడు జయకుమార్ రెడ్డి వైసీపీ చేరడం నెల్లూరు జిల్లా రాయకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
సీఎం జగన్‌తో శ్రీలంక ప్రతినిధుల భేటీ.. విషయం ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి వెంకటేశ్వరన్, ఇతర అధికారులు.. ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చి.. సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. శ్రీలంకలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని కోరారు శ్రీలంక ప్రతినిధులు.. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.. శ్రీలంక నుంచి భారత దేశానికి వచ్చే భక్తుల్లో 50శాతం మంది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వస్తారని, వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి విన్నామని ఈ సందర్భంగా ఏపీ సీఎంకు తెలిపారు శ్రీలంక ప్రతినిధులు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి విన్న తర్వాత సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలన్న తమ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిని కలిసినట్లు శ్రీలంక ప్రతినిధులు తెలిపారు.. వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ వెంకటేశ్వరన్‌లు వెల్లడించారు.. ఆక్వారంగం, వాటి ఎగుమతుల్లో ఏపీ గణనీయ ప్రగతి సాధించిన నేపథ్యంలో… శ్రీలంకలో కూడా ఆక్వారంగ ప్రగతికి సహకారం అందించాలని కోరారు శ్రీలంక ప్రతినిధులు. కోవిడ్, దిగుమతులు కారణంగా దెబ్బతిన్న శ్రీలంక ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతోందని, ఖనిజవనరులు, పర్యాటకరంగంలో పెట్టుబడులుకు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానిస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తెలిపారు ప్రతినిధులు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల DNA ఒకటే.. రెండూ కలిసి సంసారం చేశాయి
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏ ఒకటేనని.. ఆ రెండు పార్టీలు కలిసి సంసారం చేశాయని ఎంపీ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయని.. అధికారమూ పంచుకున్నాయని అన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ఆ రెండూ కుటుంబ పార్టీలేనన్న ఆయన.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ రెండూ కలిసి పని చేశాయని చెప్పారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే, అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ వల్లే అత్యంత ప్రమాదకరమని గతంలో వాజ్‌పేయు చెప్పారని గుర్తు చేశారు. కులాలు, భాషలు, మతాల పేరుతో పబ్బం గడుపుకునే పార్టీ కాంగ్రెస్ అని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి కుర్చీని నిలుపుకోవడం కోసం.. ప్రజాస్వామ్యాన్ని మంటకలిపిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. కుటుంబాలకు అధికారం కట్టబెట్టడం కోసం పాకులాడే పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. తాము బీఆర్ఎస్‌కు బీ-టీమ్‌గా ఎప్పుడూ ఉండమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఘోరవైఫల్యం చెందారని అన్నారు. ఈ నెల 8న వరంగల్‌లో పలు అభివృధ్ది కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని వెల్లడించారు. రోజుకు మూడు వ్యాగన్లు చొప్పున ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల ఉత్పత్తి కేంద్రానికి ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారన్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారన్నారు.
51 ఏళ్ల తర్వాత మహారాష్ట్రలో అద్భుతం.. సర్కారుకు 200 మంది ఎమ్మెల్యేల మద్దతు!
రాష్ట్ర మంత్రివర్గంలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య ప్రాథమికంగా 200కి చేరుకోవడంతో గత 51 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒక ప్రత్యేక దృశ్యం ఆవిష్కృతమైంది. 1972లో చివరిసారిగా 200 మందికి పైగా ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉండగా, ఆ సమయంలో మొత్తం 222 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందినవారే. అలాగే ఆ సమయంలో సభ బలం 270 అని రాష్ట్ర శాసనసభ మాజీ అధికారి సోమవారం తెలిపారు. ఆదివారం ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల ఖచ్చితమైన సంఖ్య ఇంకా తెలియరాలేదు. అయితే, అజిత్ పవార్ విధేయుడు, ఎమ్మెల్సీ అమోల్ మిత్కారీ 36 (53 మందిలో) ఎమ్మెల్యేల మద్దతును ప్రకటించారు. “ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌కు మద్దతు ఇస్తున్నారు. మేము ఇప్పటికీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో భాగమే. మేము ఫిరాయించలేదు” అని మిత్కారీ పేర్కొన్నారు. 36 మంది శాసనసభ్యుల మద్దతుపై మిత్కారీ వాదనను ముఖవిలువగా తీసుకుంటే, శివసేన, బీజేపీతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 181కి చేరుకుంది. 288 మంది సభ్యుల సభలో, బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 40 మంది ఉన్నారు. షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి బహుజన్ వికాస్ అఘాడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన ఇద్దరు, 13 మంది స్వతంత్రులు కూడా మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రీయ సమాజ్ పార్టీ, జన్ సురాజ్య శక్రి పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 201కి చేరింది.
రాజస్థాన్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం.. నలుగురి రోగుల కాళ్లను కొరికేసిన ఎలుకలు..!
రాజస్థాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం ఉదంతం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి మధురదాస్ మాథుర్ ఆసుపత్రి ఏర్పాట్ల రహస్యాలు మరోసారి బట్టబయలయ్యాయి. మానసిక వ్యాధి విభాగంలోని వార్డులో నలుగురు రోగుల కాళ్లను ఎలుకలు కొరికేశాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈసారి కూడా విషయం గుట్టుచప్పుడు కాకుండా చూసినప్పటికీ.. విషయం బయటపడింది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వగ్రామంలోని ఆస్పత్రి కావడం విశేషం. జోధ్‌పూర్ జిల్లాలోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రిలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. అయితే ఆ ఆస్పత్రిలో కొత్త అంతస్తులు నిర్మిస్తున్నా.. మానసిక వ్యాధుల విభాగం భవనం పరిస్థితి అధ్వానంగా ఉంది. దీంతో ఎలుకలు రోగులపైనే ఏం చక్కా ఫుట్ బాల్ ఆడేస్తున్నాయి. ఈ విషయమై రోగులకు వైద్యులకు ఫిర్యాదు చేయగా.. శుభ్రం చేయిస్తానని చెప్పారు. ఈ ఆసుపత్రిలోని వార్డుల్లో పురుగులు, ఎలుకలను నివారించడానికి ఆసుపత్రి పరిపాలన ప్రతి నెలా 27 వేల రూపాయలు ఏజెన్సీకి చెల్లిస్తుంది. వారు సరైన పనులు చేయకపోవడంతో.. నిర్లక్ష్య కారణంగా రోగులు ఎలుకల బారిన పడుతున్నారు. మరోవైపు ఎలుకల ద్వారా ప్లేగు వంటి వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనపై ప్రస్తుతం ఆసుపత్రి పాలకవర్గం సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ 750సీసీ బైక్.. త్వరలో విడుదలకు సన్నాహాలు..!
దేశంలోని ప్రముఖ పెర్ఫార్మెన్స్ బైక్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త శక్తివంతమైన ఇంజన్‌తో తన వాహన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క 350, 450 మరియు 650 సిసి ఇంజిన్ బైక్‌లను ఆస్వాదించారు. ఇప్పుడు ఆ కంపెనీ 750 సిసి సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. 2025 నాటికి కంపెనీ 750సీసీ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. ఆటోకార్‌లోని నివేదిక ప్రకారం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్‌పై పని చేయడం ప్రారంభించింది. అన్నీ సవ్యంగా జరిగితే.. కంపెనీ 2025 నాటికి 750 సిసి విభాగంలోకి ప్రవేశిస్తుంది. దీని కోసం కంపెనీ కొత్త ప్లాట్‌ఫారమ్‌ను సిద్ధం చేసిందని.. దీనికి ‘R2G’ అనే సంకేతనామం ఉందని చెప్పబడింది. ఈ ఇంజన్ ఆధారంగా కంపెనీ వివిధ మోడళ్లను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఈ కొత్త బైక్ ప్రాజెక్ట్ UKలోని లీసెస్టర్‌లోని కంపెనీ టెక్నాలజీ సెంటర్ నేతృత్వంలో నడుస్తోంది. వారు ఇండియా, ఉత్తర అమెరికా, యూరప్ మరియు UKతో సహా ప్రపంచ మార్కెట్ల నుండి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. R2G దశాబ్దాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలో అతిపెద్ద మోటార్‌సైకిల్‌గా మరియు ఉత్పత్తి చేయబడే అగ్రస్థానంలో ఉంటుందని భావిస్తున్నారు.
₹999కే 4G ఫోన్.. అదిరిపోయే ఫీచర్లివే!
ఇప్పటికే భారతదేశంలో అనేక సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు దేశంలో చౌకైన 4G ఫోన్ ‘జియో భారత్ V2’ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ‘జియో భారత్ V2’ ధర కేవలం రూ.999 మాత్రమే. ‘జియో భారత్ V2’ను రిలీజ్ చేయడం ద్వారా ఈ కంపెనీ 10 కోట్లకు పైగా కస్టమర్లను చేర్చుకోనుందని కంపెనీ భావిస్తోంది. 999 రూపాయల ఈ ఫోన్ నెలవారీ ప్లాన్ కూడా చాలా తక్కువకే అందిస్తున్నారు. 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ కోసం కస్టమర్లు కేవలం రూ.123 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ప్లాన్‌లో, కస్టమర్‌లు మొత్తం 14GB డేటా మరియు అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు. ఒకవేళ ఏడాదికి రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు దాని ధర రూ.1234గా ఉంటుంది. 250 మిలియన్ల 2G కస్టమర్లను 4Gకి తీసుకురావడానికి ‘జియో భారత్’ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇతర కంపెనీలు కూడా 4G ఫోన్‌లను తయారు చేయడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. దేశంలో2జీ ఫీచర్ ఫోన్ల స్థానంలో త్వరలో 4జీ భారత్ సిరీస్ మొబైల్‌లు రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2018లో కూడా కంపెనీ JioPhoneని తీసుకువచ్చిన క్రమంలో ఏకంగా 13 కోట్ల మంది కస్టమర్లను సంపాదించింది.
వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి..ఎందుకంటే?
వర్షాకాలం వచ్చిందంటే చాలు కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. అయితే ఈ కాలం వచ్చే వ్యాధుల నుంచి బయట పడాలంటే మాత్రం ఆల్ బుకరా కాయలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అసలు ఈ కాయలను తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆల్ బుకరా పండ్ల ల్లో మన శరీరాని కి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల ఆల్ బుకరా పండ్లల్లో 87 గ్రాముల నీటిశాతం ఉంటుంది. 11 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 44 క్యాలరీల శక్తి , ఒకటిన్నర గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి. ఈ పండ్లల్లో తక్కువ శక్తి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వర్షాకాలం లో ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. వర్షాకాలం లో చాలా మంది జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అంటువ్యాధులు, జబ్బులు రాకుండా ఉంటాయి.. వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జ్వరం కూడా త్వరగా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.. ఎముకల కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ రెండు పూటలా వీటిని తీసుకోవడం మంచిది.. ఇక శరీరం లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పండ్ల ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.. మల బద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.. అదే విధంగా జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఊ అంటావా మావ కన్నా ఊగిపోయేలా ఉందే
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా మొదటి సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సినిమాలు భారీ హిట్ అందుకున్నాయి. ఇక మ్యూజిక్ పరంగా జైలర్ హిట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలోని మొదటి సింగిల్ .. నువ్వు కావాలయ్యా సాంగ్ రిలీజ్ ప్రోమోను కొద్దిగా డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. మ్యూజిక్ అయ్యిందా లేదా అని నెల్సన్.. అనిరుధ్ దగ్గరకు వెల్ళడం, ఆయన ఇంకా అవ్వలేదు అందం.. దీంతో అసహనంగా నెలాసం వెనుతిరగడం చూపించారు. ఇక చివరిలో నెల్సన్.. ఏదో అనుకుంటూ వెళ్తుండగా.. యా నువ్వు కావాలయ్యా అనే సాంగ్ ను వినిపించారు. ఈ సాంగ్ లో తమన్నా డ్యాన్స్ తో అదరగొట్టనుందని తెలుస్తోంది. సాంగ్ షూటింగ్ లో ఉన్న ఫోటోను షేర్ చేసిన తమన్నా.. గెట్ రెడీ అంటూ పోస్ట్ చేసింది. ఇక బీట్ ను చూస్తుంటే .. మంచి మాస్ బీట్ అని అర్ధమవుతుంది. ఈ మాస్ బీట్ విన్న అభిమానులు.. ఊ అంటావా మావ కన్నా ఈ సాంగ్ మరింత ఊగిపోయేలా ఉందే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సాంగ్ ను జూలై 6 న రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.