*ప్రధానితో భేటీ.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించాం
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రధానితో భేటీపై స్పందించారు. ‘ప్రధానితో అరంగంట సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు రావాల్సిన నిధులపై ఆయనతో చర్చించాం. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా అందేలా చూడాలని ప్రధానిని కోరాం. స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టును వెంటనే అందించాలని కోరాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరాం. హైదరాబాద్‌కు ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని ప్రధానిని కోరాం. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలగకుండా చూడాలని కోరాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్న సమాచారాన్ని ప్రధానికి వివరించాం. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది. నీళ్లు, నిధులు నియామకాల కోసమే తెలంగాణను కొట్టాడి తెచ్చుకున్నాం. కానీ ఆ నీళ్లు, నిధులు, నియామకాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని భట్టి వివరించారు.
*అంగన్వాడీలతో చర్చలు విఫలం
అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి. జీతాల పెంపు సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంగన్వాడీలు సమ్మెను విరమించాలని కోరామని.. అంగన్వాడీలు సమ్మె విరమించుకుంటే మేం ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. “ఇప్పటికే గర్భీణులకు పోషకాహారం అందడం లేదు. అంగన్వాడీల సమ్మె వల్ల పిల్లలకు బాలామృతం అందడం లేదు. పోషకాహారం అందకుంటే గర్భిణులు, పిల్లలు ఏమవుతారు..? సమ్మె విరమించకుంటే మేం ప్రత్యామ్నాయాలకు వెళ్లక తప్పదు. అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్ని డిమాండ్లను మేం ఆమోదించాం. వేతనాల పెంపునకు ఇది సరైన సమయం కాదని వివరించాం. గ్రాట్యుటీ మా పరిధిలోకి రాదని అంగన్వాడీలకు వివరించాం. సంక్రాంతి తర్వాత మళ్లీ చర్చిద్దామని చెప్పాం. పలు డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చాం. గర్భిణులు, బాలింతల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె విరమించాలి.” అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
*హైదరాబాద్‌లో సన్‌బర్న్ ఈవెంట్ రద్దు.. నిర్వాహకుడు సుశాంత్‌పై కేసు
సన్ బర్న్ ఈవెంట్ నిర్వహకులపై మదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మాదాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన సన్‌బర్న్ కార్యక్రమాన్ని రద్ద చేశారు. బుక్‌మై షోలో ఈ ఈవెంట్‌కు సంబంధించి టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈవెంట్ నిరర్వహించాలని చూసిన నిర్వహకుడు సుశాంత్ అలియాస్ సుమంత్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అసలు ఈవెంట్‌కు అనుమతి తీసుకోకుండానే సుశాంత్ బుక్ మై షోలో సన్ బర్న్ ఈవెంట్ పేరుతో టిక్కెట్ల విక్రయించడం ప్రారంభించాడు. అప్పటికే చాలామంది ఈవెంట్ టికెట్లు కొనుగోలు కూడా చేశారు. డబ్బులు వసూలు చేసి ఎలాంటి ఈవెంట్ నిర్వహించకుండా మోసానికి పాల్పడ్డ సుశాంత్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే బుక్‌మై షో, నోడల్ అధికారులకు పోలీసులు నోటీసులిచ్చారు. విశాఖపట్నం వేదికగా జరగబోయే సన్ బర్న్ ఈవెంట్ టికెట్లు మాత్రం విక్రయిస్తున్నారు. అనుమతి తీసుకోకుండానే హైదరాబాద్ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లు విక్రయించడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఈవెంట్ నిర్వాహాకులపై చర్యలకు కూడా ఆదేశించిన విషయం తెలిసిందే.
*అమిత్ షా తెలంగాణ టూర్.. షెడ్యూల్ ప్రకటించిన బీజేపీ
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. డిసెంబర్ 28న ఆయన రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్‌లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కేడర్‌కి లోక్‌సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్, భాగ్యలక్ష్మీ అమ్మవారికి అమిత్ షా ప్రత్యేకపూజలు నిర్వహిస్తారని సమాచారం. అనంతరం రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్‌లో బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. తర్వాత బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు బీజేపీ అమిత్ షా టూర్‌ను షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎల్లుండి 12 గంటలకి ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. ఆ తర్వాత 12 గంటల 20 నిమిషాల నుండి 1: 45 నిమిషాల వరకు శంషాబాద్ నోవాటెల్ హోటల్లో లంచ్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత 5 గంటల నుండి 5.30 వరకు నోవటెల్ హోటల్ నుంచి బయలుదేరి 5.40కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరికి పయనమవ్వనున్నారు.
*సంక్షేమ పథకాలపై చంద్రబాబుతో చర్చకు సిద్ధం..
బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు పెంచేందుకు జగన్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పేదల విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో తీసుకువచ్చారని.. చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు.. వాళ్ళ బంధువులు చదవచ్చు.. కానీ బడుగు వర్గాల పిల్లలు మాత్రం చదువుకోకూడదని న్యాయస్థానాలకు వెళ్ళాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అనారోగ్య కారణాలతో ఎందరో బడుగులు మరణించారని.. దానిని చూసే వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే మొత్తాన్ని రూ.25 లక్షలకు జగన్ పెంచారని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను ఇస్తున్నారని వెల్లడించారు. పేదల కోసం జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తుంటే… టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో కూడా బడుగులకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు.. అఘాయిత్యాలు… అమానుషాలు జరిగాయన్నారు. అప్పట్లో భయంతో బతికేవారని మంత్రి చెప్పుకొచ్చారు. బీసీలు జడ్జిలుగా పనికిరాని చంద్రబాబు అన్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకు వయసై పోయింది.. ఆయన మానసిక స్థితి కూడా బాగాలేదన్నారు. లోకేష్ పాదయాత్ర చేసి రెడ్ బుక్ చూపిస్తున్నాడన్న మంత్రి.. లోకేష్ పాదయాత్ర ప్రారంభించగానే కుటుంబ సభ్యులలో ఒకరు మరణించారని విమర్శించారు. అవినీతిలో చంద్రబాబు జైలుకెళితే… లోకేష్ ఎక్కడికో పారిపోయారన్నారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల చనిపోయారని కొందరికి భువనేశ్వరి చెక్కులు ఇచ్చింది.. బెయిల్ వస్తే అన్నీ ఆపేసిందన్నారు. క్రైస్తవ మిషన్లకు చెందిన ఆస్తులను చంద్రబాబు అనుచరులు కాజేశారని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబుతో చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. అన్ని తరాల భవిష్యత్తు కోసం జగన్ పనిచేస్తున్నారని.. ఆయనను అందరూ ఆశీర్వదించాలని మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు.
*సరికొత్త రికార్డును సృష్టించిన ప్రధాని మోడీ..
పాపులారిటీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న నరేంద్ర మోదీ ఇప్పుడు మరో సరికొత్త రికార్డు సృష్టించారు. యూట్యూబ్ ఛానెల్లో 20 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను చేరుకున్న ప్రపంచంలోనే మొదటి నాయకుడిగా ప్రధాని మోడీ నిలిచారు. మీరు సాధారణ పదాలలో అర్థం చేసుకుంటే 2 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానెల్‌కి కనెక్ట్ అయ్యారు. ఈ ఘనతను సాధించిన తొలినేతగా చరిత్రలో నిలిచారు. ఈ క్రమంలో అందరు ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ యూట్యూబ్ ఛానెల్లో ప్రధాని మోడీ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయబడ్డాయి. అంతేకాకుండా, ఈ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూడవచ్చు. దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నా, ఆయన ప్రసంగాన్ని ఈ ఛానెల్లో చూడవచ్చు. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. ఇది కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రధాని మోడీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రధాని మోదీకి ఎక్స్ (ట్విట్టర్)లో 94 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 82.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్లో ప్రధాని మోదీకి 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ప్రధాని మోడీ ఒకరని మీకు తెలిసిందే. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాలో ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలిచారు. డిసెంబర్ ప్రారంభంలో మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రధాని మోడీ 76శాతం ఆమోదం రేటింగ్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్. మెక్సికో అధ్యక్షుడు ఒబ్రడార్ సర్వేలో రెండవ స్థానంలో నిలిచారు. ఆయన 66 శాతం రేటింగ్ పొందాడు. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ 37 శాతం ఆమోదం రేటింగ్‌తో 8వ స్థానంలో ఉండగా, అదే సర్వేలో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ 41 శాతం రేటింగ్‌తో 6వ స్థానంలో ఉన్నారు.అత్యంత విశ్వసనీయమైన నాయకుల్లో ప్రధాని మోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్నింగ్ కన్సల్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ప్రధాని మోడీని అభివర్ణించడం గమనార్హం. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన ఈ సర్వేలో 76 శాతం మంది ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆమోదించారని తేలింది.
*ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐలకు బాంబు బెదిరింపు
ఆర్బీఐ, హెచ్డీఎఫ్సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కార్యాలయాలపై దాడులు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి సోమవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రాజీనామా చేయాలని బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబైలోని 11 చోట్ల మొత్తం 11 బాంబు దాడులు జరుగుతాయని మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. మెయిల్లో పేర్కొన్న అన్ని ప్రాంతాలకు వెళ్లి విచారించినా ఏమీ కనిపించలేదని ముంబై పోలీసులు తెలిపారు. బెదిరింపును జారీ చేసిన ఇమెయిల్ ID khilafat.india@gmail.com. ముంబయిలోని ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో బెదిరింపుపై విచారణ కోసం కేసు నమోదైంది.
*ప్రధానికి వినేష్ ఫోగట్ బహిరంగ లేఖ
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా తన ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇస్తున్నట్లు ఒలింపియన్ వినేష్ ఫోగట్ మంగళవారం(డిసెంబర్ 26) రోజున తెలిపారు. మల్లయోధులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేసినప్పటికీ మహిళా రెజ్లర్లకు జరిగిన న్యాయంపై వినేష్ ఫోగట్ నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖలో వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు.