కొత్త విధానానికి శ్రీకారం.. కళాకారులకు డైరెక్ట్‌గా అవకాశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కళాకారులకు ఐడీ కార్డులు ఇవ్వటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనుమతి ఇచ్చారు అని తెలిపారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టులు ఏజెంట్లకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నాం అని ప్రకటించారు.. ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర కళాకారుల డేటా బేస్ తయారు చేస్తాం.. అవకాశాలు డైరెక్ట్‌గా అంది పుచ్చుకునే అవకాశం వస్తుందని వెల్లడించారు పోసాని కృష్ణమురళి. ఇక, నంది నాటకోత్సవాల కోసం దరఖాస్తులు ఆహ్వానించాం.. నాటకాలకు 115, ఉత్తమ పుస్తకాల క్యాటగిరీలో 3 దరఖాస్తులు వచ్చాయిన తెలిపారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. సెప్టెంబర్ 7-18 వరకు స్క్రూటినీ జరుగుతుందన్న ఆయన.. సెప్టెంబర్ 19వ తేదీ వరకు అవార్డులను ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. అవార్డుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు పోసాని కృష్ణమురళి. రాష్ట్రంలో ఉన్న కళాకారులకు అండగా ఉంటామని.. ఆర్టిస్టులు, టెక్నీషియన్లందరికీ ఐడీ కార్డులు ఇస్తామన్నారు. దానివల్ల బయటవారికి ఆర్టిస్టుల ఎంపిక సులభతరమవుతుంది. సినిమా రంగంలో మా అసోసియేషన్ ఉంది కానీ, మాలో మెంబర్ అవాలంటే డబ్బులివ్వాలన్నారు.. ఇతర అసోసియేషన్‌లోనూ డబ్బులు తీసుకుంటారు.. కానీ, ఇక్కడ ఒక్క రూపాయి కూడా కమీషన్ తీసుకోబమని స్పష్టం చేశారు.
చంద్రబాబు బఫూన్‌కి ఎక్కువ.. జోకర్‌కి తక్కువ.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి సొంత గుర్తింపు లేదు.. ఎన్టీఆర్ పేరు, పార్టీ వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు బఫూన్ కి ఎక్కువ.. జోకర్ కి తక్కువ అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదు అని చంద్రబాబు జోక్ చేస్తున్నారన్న ఆయన.. పవన్ కల్యాణ్, బీజేపీ పొత్తు ఊహాగానాలు లేకుంటే లోకేష్ పాదయాత్రకు క్యాడర్ రారన్నారు. చంద్రబాబుకి దేని మీదా నమ్మకం లేదు.. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు జేపీ నడ్డాతో ఒంగి ఒంగి నంగిగా మాట్లాడారు అని విమర్శించారు. చంద్రబాబు తిట్టి, గంటలో కాళ్లు పట్టుకోగలడని దుయ్యబట్టారు. మోడీ కుటుంబాన్ని కూడా చంద్రబాబు గతంలో తిట్టారని గుర్తుచేశారు సజ్జల.. ప్రత్యేక హోదాకి ప్యాకేజ్ సమానం అని చంద్రబాబు అన్నారు. ఇక, చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో పోటీ పెట్టగలడా? అంటూ సవాల్ చేశారు. పొత్తులు లేని హిస్టరీ చంద్రబాబుకి లేదన్న ఆయన.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఆలోచన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కి లేదని విమర్శించారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయం కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లింది.. ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికి ఘోషిస్తుంది.. చంద్రబాబు ఏజెంట్ గా పురంధరేశ్వరి పని చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ లక్షల మంది ముందు పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీ పార్వతి ని ఎన్టీఆర్ ధర్మపత్నీగా ప్రజలు ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా ఆమెను పిలవకుండా ఎన్టీఆర్ ఆత్మ క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తంత చేశారు సజ్జల.
కౌలు రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లో నగదు జమ
కౌలు రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. గురువారం రోజు అనగా రేపు కౌలు రైతులకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను అందించబోతున్నారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. బటన్ నొక్కి.. కౌలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఆర్థిక సాయాన్ని అందించనుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తూ వస్తుంది సర్కార్.. ఇక, కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు జారీ చేసే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక సీసీఆర్‌సీ మేళాలు నిర్వహిస్తోన్న విషయం విదితమే.. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహించేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. కౌలు రైతులకు వంద శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ప్రభుత్వం ఆర్బీకేలతో లింక్ చేసింది.. ఇప్పటికే వరుగా వివిధ పథకాలకు సంబంధించిన నగదును బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చూస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు కౌలు రైతులకు శుభవార్త వినిపిస్తూ.. వారి ఖాతాల్లో సొమ్మ జమచేయనున్నారు.
మూడు కాదు.. ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు..!
ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం.. అవసరమైతే మరోక సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తామని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ కార్యాలయంలో రాఖీ పూర్ణిమ వేడుకలు జరిగాయి.. చంద్రబాబుకు రాఖీలు కట్టారు వంగలపూడి అనిత, పీతల సుజాత.. బ్రహ్మ కుమారీలు.. టీడీపీ మహిళా నేతలు.. ఇక, ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అక్కలకు, చెళ్లల్లెకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు మహిళలను ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా తీర్చిదిద్దుతాం అన్నారు. బంధాలు భారతీయ సంస్కృతికున్న ప్రత్యేకత.. విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతిని మెచ్చుకుంటున్నారు.. మహిళల అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసి టీడీపీ ఎన్నో కార్టక్రమాలు.. సంస్థలు స్థాపించిందన్నారు. మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి హక్కు కల్పించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు చంద్రబాబు.. పద్మావతి మహిళ కళాశాలను నెలకొల్పింది టీడీపీనే.. బాలికా సంవృద్ధి సంరక్షణా పథకం నేనే ప్రారంభించాను అన్నారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామని ప్రకటించిన ఆయన.. ఒక విధానంతో ఆడబిడ్డల జీవితాలు మారే విధంగా విధాన నిర్ణయాలు చేశాం. మహిళలతో పొదుపు ఉద్యమం చేయించాం.. ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ టీడీపీనే అన్నారు. ఆడబిడ్డ నిధితో మహిళలను ఆదుకుంటాం. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం.. అవసరమైతే మరోక సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తాం అని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
అమితాబ్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ముంబైలోని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న జరిగిన ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి రెండు రోజుల సమావేశానికి హాజరయ్యేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే మమతా బెనర్జీ సబర్బన్ జుహులోని అమితాబ్ బచ్చన్ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మమత సంభాషించారు. వారి విలువైన సమయాన్ని అందించినందుకు ఆమె వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి భవిష్యత్ ప్రయత్నాలన్నిటికీ శుభాకాంక్షలు తెలిపారు.
80 శాతం ప్రధాని మోడీకి సానుకూలం.. ప్యూ సర్వేలో కీలక విషయాలు
10 మంది భారతీయులలో ఏడుగురు తమ దేశం ఇటీవల మరింత ప్రభావవంతంగా మారిందని నమ్ముతున్నారని ఈ సర్వేలో తెలిసింది. జీ20 సమ్మిట్‌కు ముందు విడుదల చేసిన సర్వే ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంపై ప్రజల అభిప్రాయం సాధారణంగా సానుకూలంగా ఉందని, 34 శాతం ప్రతికూల అభిప్రాయాలతో పోలిస్తే 46 శాతం మంది భారతదేశానికి అనుకూలమైన అభిప్రాయాలను నివేదించారని పేర్కొంది. పదహారు శాతం మంది అభిప్రాయాన్ని పంచుకోలేదు. ఇజ్రాయెల్‌లో భారత్ అభిప్రాయాలు అత్యంత సానుకూలంగా ఉన్నాయని, 71 శాతం మంది దేశం పట్ల తమకు అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. ప్రధాని మోదీకి సంబంధించిన గ్లోబల్ వీక్షణలు, భారతదేశం యొక్క ప్రపంచ శక్తి పరిధి, ఇతర దేశాల్లో భారతీయులపై అభిప్రాయాలను పరిశీలించడానికి.. భారత్ నుంచి 2,611 మంది సహా 24 దేశాల్లోని 30,861 మంది పెద్దల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఫిబ్రవరి 20 నుంచి మే 22 వరకు సర్వే నిర్వహించినట్లు ప్యూ తెలిపింది. మంగళవారం విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం, 10 మంది భారతీయులలో ఎనిమిది మంది ప్రధాని మోదీకి అనుకూలమైన అభిప్రాయాలను నివేదించారు. ఇందులో మెజారిటీ (55 శాతం) చాలా అనుకూలమైన అభిప్రాయంతో ఉన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీకి ఇది రెండోసారి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి కూడా అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. 2023లో కేవలం ఐదవ వంతు భారతీయులు మాత్రమే ప్రధాని మోదీపై ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ప్యూ సర్వే వెల్లడించింది.
ఎన్నికల సమయం.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
2024 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై దృష్టి సారించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.. ఇప్పటికే 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది కేంద్రం.. ఏకంగా ఒకేసారి రూ.200 తగ్గించడంతో ఇప్పుడు అందిరి దృష్టి పెట్రో ధరలపై పడిపోయింది.. గ్యాస్ ధర తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగిరావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నమాట.. దీనికి పెట్రోల్, డీజిల్ ధరల్లో కోత కూడా తోడైతే అన్ని నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఇవన్నీ నిజమయ్యే అవకాశం ఉందంటోంది ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ గ్రూప్. సిటిగ్రూప్ ప్రకారం, వంట గ్యాస్ ధరలను తగ్గించడానికి భారతదేశం యొక్క చర్య ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలదు మరియు కొన్ని ప్రధాన పండుగలు మరియు కీలక ఎన్నికలకు ముందు పెట్రోల్ మరియు డీజిల్ ధరల తగ్గింపుపై కూడా దృష్టి సారిస్తారని పేర్కొంది.. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ను తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయం ద్రవ్యోల్బణాన్ని దాదాపు 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగలదని ఆర్థికవేత్తలు సమీరన్ చక్రవర్తి మరియు బకార్ ఎం. జైదీ బుధవారం ఒక నోట్‌లో పేర్కొన్నారు.. తాజా చర్య, టొమాటో ధరల తగ్గుదల, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 6శాతం దిగువకు పడిపోయే అవకాశాన్ని పెంచుతుందని తెలిపారు.
కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తక్కువ అమౌంట్ తో పొదుపు ఖాతా..
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. తాజాగా కొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది.. ఈ పథకంలో చేరాలేనుకొనే కస్టమర్లు రూ.150 రూపాయలు చెల్లిస్తే చాలు.. అంతేకాదు ఖాతా పొందిన తర్వాత అందులో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. అకౌంట్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేకుండా ఇతర ఛార్జీల నుంచి మినహాయింపును పొందవచ్చు.. ఈ పొదుపు ఖాతా గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఈ పొదుపు ఖాతా పేరు ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ ఖాతా’గా నామకరణం చేసింది. దాని కోసం కస్టమర్‌లకు నెలకు రూ.150 లేదా సంవత్సరానికి ఒకేసారి రూ.1,650 చెల్లించిన సరిపోతుందని బ్యాంకు వెల్లడించింది… ఈ అకౌంట్ తీసుకున్న వినియోగదారులు ఎస్‌ఎంఎస్ ఛార్జీలు గానీ, ఇతర ఛార్జీలు ఏమి ఉండవని తెలిపింది. ప్రస్తుతం ఏ బ్యాంకు అకౌంట్ తీసుకున్నా అందులో నెలవారీగా కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సిన పరిస్థితి ఉంది.. ఎక్కువ మంది బ్యాంక్ కస్టమర్లు డిజిటల్ అకౌంట్లను వినియోగించుకుంటున్నారు. అలాంటి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు..
మగవాళ్ళు పెళ్లి విషయంలో ఎందుకు భయపడతారో తెలుసా?
రెండు మనసులను మూడు ముళ్ల బంధంతో ఏకం చేసే పవిత్ర బంధం పెళ్లి.. అందుకే మనిషి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది.. జీవితంలో ఒక్కసారి చేసుకొనే వేడుక అందుకే ఉన్నంతలో ఘనంగా చేసుకుంటారు.. పెళ్లి విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు.. అయితే ఈ మధ్యకాలంలో అబ్బాయిలు పెళ్లి విషయం రాగానే ఏదోకటి చెప్పి తప్పించుకుంటున్నారు.. పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.. అందుకు కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. పెళ్ళి అంటేనే ఓ బాధ్యత. ముందుగా చెప్పుకున్నట్లుగా అందరు కూడా స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారు. అదనపు బాధ్యతలు వారు కోరుకోవడం లేదు. పెళ్ళి చేసుకుంటే వారి భుజాలపై అదనపు వచ్చి బాధ్యతలు వచ్చి పడతాయనే కారణంతోనే చాలా మంది అబ్బాయిలు పెళ్లి వద్దని ఫిక్స్ అవుతున్నారు.. అలాగే భార్య, భర్తలు ఇద్దరు కూడా ఒకరి అనుమతితో ఒకరు మెలగాల్సి ఉంటుంది. కానీ, నేడు చాలా మంది ఇండిపెండెంట్‌గా ఉండడానికి అలవాటు పడ్డారు.. అలాంటివి వద్దు అని భావిస్తుంటారు అందుకే ఇష్టం చూపించడం లేదు..
హావ్వా…. ఫ్యాన్స్ లేక వెలవెలబోయిన పాక్ స్టేడియం
ఇవాళ( ఆగస్ట్ 30 ) ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో పాకిస్థాన్ పోటీ పడుతుంది. అయితే, దాదాపు పదిహేనేళ్ల తరువాత పాక్ గడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో స్టేడియానికి ప్రేక్షకులు భారీగా వస్తారని అందరు అనుకున్నారు. కానీ, మ్యాచ్ స్టార్ట్ అయినా.. కాసేపటికే అదంతా భ్రమ అని తేలిపోయింది. బాంబుల భయంతో ప్రేక్షకులు.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికే మొగ్గుచూపినట్లు మ్యాచ్ ను వీక్షేందుకు క్రికెట్ ఫ్యాన్స్ రాలేదనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దాయాది పాకిస్తాన్ దేశంలో బాంబుల మోత ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. చివరికి చిన్న పిల్లలు చదువుకునే స్కూళ్లు, ప్రార్థనా మందిరాలను కూడా అక్కడి టెర్రరిస్టులు వదిలి పెట్టరు. ఈ క్రమంలో పాకిస్థాన్- నేపాల్ మ్యాచ్ జరుగుతోన్న ముల్తాన్ స్టేడియం ఖాళీగా దర్శనమిచ్చింది. దీంతో పలు ఊహాగానాలకు కారణమవుతోంది. బాంబుల భయంతో ప్రేక్షకులు ముల్తాన్ స్టేడియానికి రాలేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ స్టేడియం సామర్థ్యం 30వేలు కాగా, కేవలం 13వేల మంది హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియంలోని అన్ని స్టాండ్లన్నీ ఖాళీగా కనిపించాయి.
ధనం మూలం ఇదం జగత్.. డబ్బే అన్నీ చేయిస్తోందంటున్న విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఇప్పటికే పలు రకాల ప్రమోషన్స్ నిర్వహించిన సినిమా యూనిట్ తాజాగా విజయ్ దేవరకొండ తో ఒక లైవ్ ఇంటరాక్షన్ సెక్షన్ నిర్వహించింది. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా వస్తున్న ప్రశ్నలకు విజయ్ దేవరకొండ లైవ్ లో సమాధానాలు ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు విజయ్ దేవరకొండ చెప్పిన సమాధానం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే తనకు ఎవరూ ఇన్స్పిరేషన్ లేరని నాకు కొన్ని విషయాలు కావాలని అదే తనకు అసలైన ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు. మా అమ్మానాన్నని కంఫర్టబుల్గా చూడాలని కోరిక ఉంది, ఇంటి అద్దులు, గ్యాస్ సిలిండర్ వస్తే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? నెలాఖరు వస్తుంది, రెంట్ కట్టాలి, అకౌంట్ లో డబ్బులు లేవు. పిల్లలకు ఫీజులు కట్టాలంటే డబ్బులు లేవు లాంటి టెన్షన్లు చూసి చూసి విరక్తి పుట్టేసింది. ఇకమీదట ఇలా ఉండొద్దు అని నేను ఫిక్స్ అయ్యాను, అలాగే నేను నా తల్లిదండ్రులను హ్యాపీగా ఉంచాలి అనుకున్నాను. నేను హ్యాపీగా ఉండి కంఫర్టబుల్గా ఉండాలని అనుకున్నాను. అలాగే నాకు ముఖ్యంగా రెస్పెక్ట్ కావాలి నన్ను నా ఫ్యామిలీ, నా చుట్టాలు, సొసైటీ అందరూ గౌరవించాలని అనుకున్నాను. అలా గౌరవించాలంటే నువ్వు ఏదో ఒకటి చేయాలి, ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు రెస్పెక్ట్ మాత్రమే నాకు ఇన్స్పిరేషన్ అని విజయ్ దేవరకొండ తేల్చి చెప్పాడు. తాను ఏదైనా రెండు విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చానంటే అది డబ్బు, రెస్పెక్ట్ కి మాత్రమేనని తనను ఎవరైనా అగౌరవపరిస్తే వాళ్లని క్షమించలేనని ఈ సందర్భంగా విజయ్ చెప్పుకొచ్చాడు. డబ్బు, రెస్పెక్ట్ కోసమే తాను పని చేశానని ఈ క్రమంలో విజయ్ చెప్పుకొచ్చాడు. నిజానికి అందరి ఫైనల్ టార్గెట్ డబ్బే అయినా డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ విజయ్ దేవరకొండ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం గమనార్హం.
కాంతార బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ‘తమ్ముడు’ తోనే..?
ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరూ హిట్ ను అందుకుంటారు.. ఎవరు ప్లాపుని అందుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. ఎన్నో ఏళ్ళు కష్టపడి స్టార్ట్ అయినవారు కొంతమంది అయితే.. ఓవర్ నైట్ లో ఒక్క సినిమాతో స్టార్లుగా మారిన వారు మరి కొంతమంది. ఓవర్ నైట్ లో అని చెప్పడం కన్నా చాలా ఏళ్ల తర్వాత, ఎంతో కష్టం తర్వాత సక్సెస్ ను అందుకున్నారు అని చెప్పడం సబబుగా ఉంటుంది. ఇక కాంతార సినిమాతో ఒక్కసారిగా స్టార్ట్ డమ్ ను అందుకున్న హీరోయిన్ సప్తమి గౌడ. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటించి మెప్పించింది. ఒక గ్రామీణ యువతీగా, కానిస్టేబుల్ గా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత సప్తమి ఎక్కడా కనిపించింది లేదు. ఇకపోతే ఆమె ఎప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా అని చాలామంది అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకి ఇప్పుడు సమాధానం దొరికిందని సమాచారం అందుతుంది. తాజాగా ఒక స్టార్ హీరో సినిమాలో సప్తమి హీరోయిన్ గా ఎంపిక అయిందని టాప్ నడుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు యంగ్ హీరో నితిన్. వేణు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం తమ్ముడు. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన సప్తమి గౌడను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం అందుతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఆమెకు మంచి అవకాశం. మంచి ప్రొడక్షన్, స్టార్ హీరో కాబట్టి సప్తమికి మంచి గుర్తింపు వస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మేకర్స్ సప్తమిని అధికారికంగా సినిమాలోకి ఆహ్వానించనున్నారట. మరి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ భామ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటుందా..? లేదా..? అనేది చూడాలి.