అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త
అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అందులో అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ల వయస్సును నిర్దేశించారు. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000 అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు పదవి విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు చేయనున్నారు. దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ముందుందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీలకు తెలంగాణలోనే అత్యధిక వేతనాలు ఇస్తుండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడుసార్లు అంగన్‌వాడీల వేతనాల పెంపు చేశారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ కు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంగన్వాడీలకు అరకొరగా జీతాలు ఇస్తున్నారని మంత్రి ఆరోపించారు.
గూడూరు-మనుబోలు మధ్య రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి.. ఆ కష్టాలకు చెక్..
గూడూరు – మనుబోలు మధ్య భారీ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. కింద రెండు బ్రాడ్ గేజ్ లు వెళుతుండగా.. వాటిపై నుంచీ మరొక బ్రాడ్ గేజ్ తో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశారు.. ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో శరవేగంగా ఫ్లైఓవర్ పూర్తి చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. రేణిగుంట – విజయవాడ, చెన్నై – రేణిగుంట మధ్య పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని దీని నిర్మాణం పూర్తి చేశారు.. సౌత్ సెంట్రల్ రైల్వే, సదరన్ రైల్వేల మధ్య పెద్ద జంక్షన్ గూడూరు కావడంతో.. ట్రాఫిక్ కంట్రోల్ కు ఫ్లైఓవర్ తప్పనిసరి అని గుర్తించిన రైల్వే శాఖ.. ప్రజలకు సమయాభావం కాకుండా ఉండేలా ఫ్లైఓవర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసింది.. విజయవాడ-గూడూరు ట్రిప్లింగ్ ప్రాజెక్టులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ మనుబోలు-గూడూరు మధ్య 7.4 కిలోమీటర్ల సెక్షన్‌ను పూర్తి చేసి ప్రారంభించినట్లు వెల్లడించింది.. కీలకమైన ఈ సెక్షన్‌ను ఇప్పుడు మూడింతలు చేయడంతో గూడూరు-సింగరాయకొండ మధ్య నిరంతరాయంగా 127 కిలోమీటర్ల మేర విద్యుదీకరణతో పాటు మూడో రైల్వే ట్రాక్ లైన్ అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే ఉన్న మార్గాల్లో రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రైలు కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ రైలు మార్గం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తుంది” అని అధికారి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
హడలిపోతున్న వైజాగ్ వాసులు.. అది చిరుతా..? అడవి పిల్లా..?
ఆంధ్రప్రదేశ్‌లో చిరుతల సంచారంతో హడలిపోతున్నారు ప్రజలు.. తిరుమలలో చిరుతల సంచారం భక్తులను భయపెడుతుండగా.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తుండడంతో రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ప్రజలు.. చిరుతల సంచారంతో చివరకు అడవి పిల్లులను చూసినా జనం హడలెత్తిపోతున్నారు. తాజాగా, విశాఖ నగరం పరిధిలోని ఎండడాలో చిరుతను చూసినట్టు ఓ భవనం వాచ్ మెన్ చెప్పడం కలకలం రేపింది. ఎంకే గోల్డ్ అపార్ట్ మెంట్స్ వెనుక చిరుత సంచరిస్తున్నట్టు వాచ్ మెన్ గణేష్ చెప్పాడు.. దీంతో, ఆ ప్రాంత వసుల్లో టెన్షన్ మొదలైంది.. అయితే, స్థానికుల సహకారంతో ఫారెస్టు అధికారుల దృష్టికి సమాచారం వెళ్ళింది. దీంతో, కంబలా కొండ అభయారణ్యం పర్యవేక్షణ చూస్తున్న సిబ్బంది.. చిరుత సంచరిస్తున్నట్టు అనుమానిస్తున్న ప్రాంతాన్నీ పరిశీలించారు. చిరుత సంచారంకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదని తేల్చారు. అయితే, అడవి పిల్ల జాతికి చెందిన జంతువు వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు ఫారెస్ట్ అధికారులు.
కేసీఆర్‌తో రాములమ్మ ఢీ..! ఇక అక్కడి నుంచే పోటీ..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది.. ఏకంగా ఒకేసారి 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరింత హీట్ పెంచారు.. అయితే, ఈ సారి ఆయన రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగబోతున్నారు.. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన ఆయన.. తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీకి దిగనున్నట్టు ప్రకటించారు. మరోవైపు కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత షబ్బీర్ అలీ పోటీలో ఉండబోతున్నారు.. ఇదే సమయంలో.. బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు మాజీ ఎంపీ, సీనియర్ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ కూడా సిద్ధం అవుతున్నారట.. బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు తాను సిద్ధమని ఆమె సోషల్ మీడియా వేదికగా సంకేతాలిచ్చారు.. ఆ అవకాశం తనకే కల్పించాలంటూ.. పార్టీ అధిష్టానానికి విజయశాంతి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే, ”కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తది.. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే.. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం.. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత, బహుశా.. జై శ్రీరామ్.. హర హర మహాదేవ.. జై తెలంగాణ” అంటూ ట్వీట్ చేశారు విజయశాంతి. ఈ ట్వీట్‌తో చెప్పకనే కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చారనే చర్చ సాగుతోంది..
ఎవరు ఎన్ని ట్రిక్స్ చేసిన.. కేసీఆర్దే హ్యాట్రిక్
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో తెలంగాణ IMA ప్రెసిడెంట్ డాక్టర్ బీఎన్ రావు, పలువురు డాక్టర్లు BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలా.. లేదా రాంగ్(wrong) లీడర్ కావాలా ప్రజలు ఆలోచన చేయాలని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాంగ్ లీడర్ల చేతిలోకి పోతే రాష్ట్రం వెనక్కి పోతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఎలాంటి కర్ఫ్యూలు, అల్లర్లు లేవని హరీష్ రావు అన్నారు. మరోవైపు MBBS కోసం పక్క దేశాలు, రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు తెలంగాణాలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇక రాష్ట్రంలో ఎవరు ఎన్ని ట్రిక్స్ చేసిన.. సీఎం కేసీఆర్ దే హ్యాట్రిక్ అని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. పేపర్ లీడర్ కావాలా…ప్రాపర్ లీడర్ కావాలా అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రాపర్ లీడర్ అని.. హైదరాబాద్ హెల్త్ హబ్ గా మారుతుందని పేర్కొన్నారు. మొన్న చంద్రబాబు ఒక మంచి మాట అన్నారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఏపీలో వంద ఎకరాలు కొనవచ్చు అని.. సీఎం కేసీఆర్ కృషి వల్లే.. రాష్ట్రంలో భూముల ధరలు మంచి డిమాండ్ ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ దగ్గర లబ్ధి పొందని మనిషి ఎవరు లేరని.. తెలంగాణతో పోటీ పడే రాష్ట్రం దేశంలో ఒక్కటి లేదని మంత్రి హరీష్ రావు తెలిపారు.
గన్నవరంపై వైసీపీ హైకమాండ్ ఫోకస్.. వారిని బుజ్జగించే ప్రయత్నం..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గన్నవరం అసెంబ్లీపై మరోసారి ఫోకస్ పెట్టింది.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు.. దీంతో.. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు, అప్పటికే ఉన్న దుట్టా రామచంద్ర రావు. ఇలా వైసీపీలో అంతర్గత విభేదాలు కొన్నిసార్లు బహిర్గతం అయ్యాయి.. అలా గన్నవరం పాలిటిక్స్ ఎప్పటికప్పుడు గరంగరంగానే మారిపోయాయి.. ఇక, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. వైసీపీ టికెట్ ఆశించిన యార్లగడ్డ.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. దీంతో.. గన్నవరంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది వైసీపీ హైకమాండ్. గన్నవరం సెగ్మెంట్ పై ఫోకస్‌పెట్టిన వైసీపీ.. నష్ట నివారణ కసరత్తు ప్రారంభించింది.. అందులో భాగంగా.. ఎంపీ బాలశౌరిని రంగంలోకి దించింది.. ఆయన రేపు గన్నవరం వైసీపీ నేత దుట్టా రామచంద్ర రావుతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు.. గన్నవరం టికెట్ ఆశించిన యార్లగడ్డ వెంకట్రావ్ టీడీపీలో చేరటంతో.. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపై దృష్టిసారించిన పార్టీ హైకమాండ్.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో విబేధిస్తున్న దుట్టా వర్గాన్ని ఆయనకు దగ్గర చేసే విధంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో దుట్టా రామచంద్రరావుతో ఎంపీ బాలశౌరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ ముందుకు సాగుతోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వివిధ నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించిన పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మనమంతా కలిసి పనిచేస్తే అది పెద్ద సమస్యే కాదని తెలిపిన విషయం విదితమే.
జాబిల్లిపై 8 మీటర్లు ప్రయాణించిన రోవర్.. ఇస్రో కీలక ప్రకటన
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ కదలికలన్నింటినీ ధ్రువీకరించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది. చంద్రయాన్-3 రోవర్ ‘ప్రజ్ఞాన్’ ఎనిమిది మీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణించిందని, దాని పేలోడ్‌లను ఆన్ చేసినట్లు ఇస్రో శుక్రవారం వెల్లడించింది. అన్ని ప్రణాళికాబద్ధమైన రోవర్ కదలికలు ధృవీకరించబడ్డాయని, రోవర్ దాదాపు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా అధిగమించిందని, రోవర్ పేలోడ్‌లు LIBS, APXSలు ఆన్ చేయబడ్డాయని ఇస్రో ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్‌లు పని చేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) చంద్రుని ఉపరితలం రసాయన కూర్పు, ఖనిజ సంబంధమైన కూర్పును ఊహించడం లక్ష్యంగా పెట్టుకుంది. లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) చంద్రుని ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న చంద్రుని నేల, రాళ్ల మూలక కూర్పు (Mg, Al, Si, K, Ca, Ti, Fe)ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ల్యాండర్ పేలోడ్‌లు ILSA, RAMBHA, ChaSTEలను ఆన్ చేసినట్లు ఇస్రో గురువారం తెలిపింది. ILSA పేలోడ్ ల్యాండింగ్ సైట్ చుట్టూ భూకంప కార్యకలాపాలను కొలుస్తుంది. RAMBHA చంద్రుని చుట్టూ ఉన్న ప్లాస్మా వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ChaSTE పేలోడ్ చంద్రుని ఉపరితల ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది.
రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద తీసుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
చెస్ వరల్డ్ కప్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన ఇండియన్ చెస్ సెన్సేషన్ ప్రజ్ఞానంద నిన్న జరిగిన ఆటలో ఓటమి పాలైయ్యారు.. అందరు విన్నర్ అవుతాడని అనుకున్నారు.. కానీ చివరి నిమిషంలో తడబడటంతో విన్నర్ స్థానాన్ని అందుకోలేక పోయాడు.. ప్రస్తుతం ఇతను రన్నర్ గా నిలిచాడు.. చెస్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ పై ఆసక్తి నెలకొంది.. విన్నర్ కు ఎంత ప్రైజ్ మని ఇస్తారు.. రన్నర్ కు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారని జనాలు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. భారత ఆటగాడు ఆర్.ప్రజ్ఞానంద్, కార్ల్‌సన్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో మంగళ, బుధవారాల్లో వరుసగా రెండు రోజులు డ్రాగా ముగిశాయి. విజేత కోసం గురువారం స్వల్పకాలిక టై బ్రేక్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 1 చెస్ స్టార్ పోటీని అన్ని విధాలుగా అందించడంలో ప్రజ్ఞానంద సఫలమయ్యాడు. అయితే టైబ్రేక్‌లో విజయం సాధించి కార్ల్‌సన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.. ప్రపంచకప్ గెలిచిన నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్ సెన్ విన్నర్ గా నిలిచాడు.. నిజానికి ఈ చెస్ వరల్డ్ కప్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ రూపంలో భారీ మొత్తం అందనుంది. విజేతకు 1.1 లక్షల డాలర్లు (సుమారు రూ.90.93 లక్షలు), రన్నరప్ కు 80 వేల డాలర్లు (సుమారు రూ.66.13 లక్షలు) అందుతాయి. చెస్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.15.13 కోట్లు. ఈ వరల్డ్ కప్ టైటిల్ కోసం 32 ఏళ్ల కార్ల్‌సన్, 18 ఏళ్ల ప్రజ్ఞానంద తలపడ్డారు.. ప్రజ్ఞానంద రన్నారుగా నిలిచాడు.. అంటే అతను 80 వేల డాలర్లు (సుమారు రూ.66.13 లక్షలు)అందుకోనున్నాడు.. అతి చిన్న వయస్సులో ఆ స్థానాన్ని అందుకోవడం పై అతనిపై దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.. అన్నీ దేశాలను వెనక్కి నెట్టి ఫైనల్ వరకు రావడం గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు..
తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపించిన దిశా పటాని.. వైరల్ అవుతున్న పిక్స్..
దిశా పటాని.. ఈ హాట్ భామ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె తన ఘాటైనా అందాలతో రెచ్చగొట్టింది.ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ లోఫర్ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.దిశా పటాని బాలీవుడ్ లో హాట్ గ్లామర్ క్వీన్ గా మారింది.. తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా లో ఆమె సృష్టించే అలజడి అంతా ఇంతా కాదు.దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పిక్ పోస్ట్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది..ఈ భామ క్రేజ్ అంతలా పెరిగిపోయింది. టాలీవుడ్ లో దిశా పటాని కేవలం ఒక్క చిత్రంతోనే అలరించింది..బాలీవుడ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. స్పెషల్ సాంగ్స్ లో ఈ భామ తన హాట్ అందాలతో మతి పోగొడుతుంది.. అయితే, దిశా పటానీ హీరో టైగర్ ష్రాఫ్ తో ఎంతో క్లోజ్ గా ఉండేది., నిరంతరం వారి రిలేషన్ గురించే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉండేవి.అయితే ఈ మధ్యనే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు.వారి బ్రేకప్ తర్వాత ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ గా ఫిట్ నెస్ ట్రైనర్ అలెక్సాండర్ అలెక్స్ పేరు వినిపించింది. ప్రస్తుతం అతనితోనే డేటింగ్ లో ఉన్నట్టు బీట్ టౌన్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది.క్రమంలోనే తాజాగా ముంబై కేఫ్ లో అలెక్స్ తో కలిసి దిశా పటానీ కనిపించింది. హోటల్ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఇద్దరూ కూడా ఒకే కారులో వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. ఇద్దరూ క్యాజువల్ వేర్స్ లో అట్రాక్టివ్ లుక్ లో కనిపించారు.మరోవైపు దిశా పటానీ వైట్ క్రాప్డ్ టాప్ ధరించి హాట్ గా కనిపించింది.డెనీమ్ లూజ్ ఫిట్ ట్రౌజర్ లో ట్రెండీ లుక్ లో మెరిసింది.. ఇక అలెక్స్ వైట్ కట్ బనియన్, జీన్స్ లో కనిపించాడు. ప్రస్తుతం వీరి ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..
పోరాడితే పోయేదేం లేదురా.. ఎదవ బానిస సంకెళ్లు తప్ప..
అభిమానం.. ఆపితే ఆగేది కాదు. ముఖ్యంగా సినిమా హీరోల మీద అభిమానులకు ఉన్న అభిమానం మాములుగా ఉండదు. తమ్ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుంది అంటే .. వారికి పండుగ మొదలైనట్లే. ఇక అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే.. అభిమానులు కాదు భక్తులే.. పండుగ కాదు ఏకంగా జాతరనే చేస్తారు.ఇప్పటికే ఆ జాతర మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే కార్నివాల్ అంటూ సోషల్ మీడియా ట్రెండ్ సృష్టిస్తున్నారు. పాలాభిషేకాలు.. పూలాభిషేకాలు.. అన్నదానాలు.. రక్తదానాలు.. ఇలా ప్లాన్ చేసేస్తున్నారు. ఇక ఇంకోపక్క అభిమానులు.. పవన్ కొత్త సినిమాల అప్డేట్స్ వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సీడీపీ ప్రోమోను రిలీజ్ చేశారు. సీడీపీ అంటే.. కామన్ డిస్ప్లే పిక్. పవన్ పుట్టినరోజున అందరూ ఈ ఫోటోనే షేర్ చేస్తారు. ఎప్పుడు పవన్ ఫొటోతోనే ఉండే సీడీపీకి ఈసారి కొద్దిగా పొలిటికల్ టచ్ ఇచ్చారు. సీడీపీ ప్రోమో వీడియోలో.. జనసేనాని పవన్ నినాదాన్ని వినిపించారు. ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో అంటూ రాసి ఉంది. ఇక చివరిలో పోరాడితే పోయేదేం లేదురా ఎదవ బానిస సంకెళ్లు తప్ప అనే పవన్ బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. ఇక బర్త్ డే సీడీపీ ని ఆగస్టు 27 న పవన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి సెప్టెంబర్ 2 ఏ రేంజ్ లో ఉండనుండో చూడాలి.
అల్లు అర్జున్ జాతకం.. ఇకముందు జరగబోయేది అదే.. ?
ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలను చెప్తూ.. యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ ఉంటాడు. ఇక సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు అని ముందుగానే చెప్పి బాగా ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పినట్లుగానే నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండానే వారు విడిపోయారు. ఈ విషయం జరిగిన తరువాత చాలామంది ఆయనను నమ్మడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ గురించి వేణుస్వామి ఏమన్నాడంటే.. ” తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన పాన్ ఇండియా స్టార్.. అల్లు అర్జున్ మాత్రమే. ఒక్కో సినిమాకు ఆయన 100 కోట్లు తీసుకుంటాడు. కళ్ళుమూసుకుంటే 300 కోట్లు వచ్చేస్తాయి. నిర్మాతల గుండె ఆగిపోవడాలు, స్టంట్ వేయడాలు ఇలాంటి టెన్షన్స్ ఏం ఉండవు. అల్లు అర్జున్ కు రిస్క్ లేదు.. నిర్మాతలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. అల్లు అర్జున్ జాతకం .. సూపర్ స్టార్ జాతకం. ఇంకో పదేళ్లు తిరుగులేదు.. ఆయన ఈ పదేళ్లు కూడా పాన్ ఇండియా స్టార్ గానే ఉంటాడు. ఆయన ఏ సినిమా తీసినా కూడా మినిమమ్ 200 కోట్లు వసూలు అవుతాయి. అల్లు అర్జున్ కు తిరుగు లేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ లెక్కన.. మరో పదేళ్లు పుష్పగాడి రూలే నడుస్తుంది అని అభిమానులు కాలర్ ఎత్తి చెప్పుకొస్తున్నారు.