లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం.. సందిగ్ధంలో బీజేపీ
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే, సూత్రపాత్రయంగా మజ్లిస్ పార్టీకి హస్తం పార్టీ మద్దతు ఇస్తుంది. కాగా, మరోవైపు, గ్రేటర్ హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై భారతీయ జనతా పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న ఓట్లు 25 లోపే.. ఎంఐఎం పార్టీకి ఉన్న దాంట్లో సగం ఓట్లు కూడా కమలం పార్టీకి లేవు.. దీంతో కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వచ్చాక నిర్ణయం తీసుకోనుంది. బీజేపీకి ఉన్నా సంఖ్య బలం దృష్ట్యా పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం మొత్తం ఓట్లు 110 ఉండగా.. తుది జాబితాలో మారే అవకాశం ఉంది. కార్పొరేటర్లు 81 ఉండగా, ఎక్స్ అఫిషియో సభ్యులు 29 ఉన్నాయి.
కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని మోడీ అబద్ధాలు..!
కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మెట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్‌లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన అన్నారు. ఎన్. పి. ఎ. కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు రెండున్నర లక్షల కోట్లు ఉంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల కోట్లకు అవి చేరుకున్నాయని నారాయణ ధ్వజమెత్తారు..
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో వైసీపీ పోరాటం చేస్తుంది..
వక్ఫ్ సవరణ బిల్లు 2024కి వ్యతిరేకంగా ముస్లీం వర్గాలు చేస్తున్న మహా ధర్నాకి వైసీపి మద్దతు ఇచ్చింది. ఈ ధర్నాకు హాజరైన మాజీ మంత్రి పేర్నినాని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైసీపీ నేతలు షేక్ ఆసిఫ్, నూరి ఫాతిమా, నారాయణమూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నాం.. పార్లమెంట్ లో కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. ఇక, ముస్లిం వ్యక్తుల సంప్రదాయాలు, వ్యవహారాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నాం.. ముస్లింలకు రంజాన్ తోఫా ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ.. రంజాన్ సమయంలో జరుగుతున్న దాడిని ఖండించడం లేదు అని మాజీమంత్రి పేర్నినాని పేర్కొన్నారు.
మయన్మార్ అధికారులకు మోడీ ఫోన్.. విపత్తుపై ఆరా
మయన్మార్ అధికారులకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సంభవించిన శక్తివంతమైన భూకంపంపై ఆరా తీశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న సహాయ చర్యలపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భారత్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని మోడీ భరోసా ఇచ్చారు. ఇప్పటికే మయన్మార్‌కు అండగా ఉంటామని ప్రధాని మోడీ ‘ఎక్స్’ వేదికగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా శుక్రవారం 15 టన్నుల సహాయ సామగ్రిని మయన్మార్‌కు విదేశాంగ శాఖ పంపించింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’లో భాగంగా విపత్తు సహాయక సామగ్రి, దళాలను పంపిస్తున్నట్లు మోడీ తెలిపారు. మరింత సాయం పంపేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గుడిమల్కాపూర్‌లో గాలిలో కాల్పుల కలకలం
హైదరాబాద్, గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్పోలో కాల్పుల కలకం చోటుచేసుకుంది. ఎక్స్పోలో ఇద్దరు షాప్ కీపర్‌ల మధ్య వాగ్వాదం తలెత్తి తీవ్ర స్థాయికి చేరుకుంది. తీవ్ర వాగ్వాదం అనంతరం, వారిలో ఒకరు గాలిలో కాల్పులు జరపడంతో అక్కడున్న వారిలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కాల్పుల శబ్దంతో సందడి నెలకొనగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఎక్స్పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనతో ఎక్స్పోకు వచ్చిన ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, పోలీసులు వెంటనే స్పందించడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చిందని అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
పాపవినాశనం ఘటనపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదు..
తిరుమల పాపవినాశనం ఘటనపై మాజీ టీటీడీ బోర్డు చైర్మన్.. భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. “తిరుమల పాపవినాశనం జలాశయంలో బోటింగ్ చేస్తామని మళ్ళీ వెనక్కి తగ్గారు.. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చిన్న సమస్యను కూడా పెద్దగా చూపించారు.. పవిత్రమైన ప్రాంతాన్ని విహార యాత్రకు అడ్డాగా మార్చాలని చూశారు.. పవిత్రమైన పాపవినాశనం జలాలను అపవిత్రం చేశారు.. సనాతన ధర్మం కోసం నడుము బిగించినప్పటి నుండి పవన్ కల్యాణ్ కు నడుము నొప్పి వచ్చింది.. పాపవినాశనం ఘటనపై ఎందుకు పవన్ కల్యాణ్ స్పందించలేదని ప్రశ్నించారు.
హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. భార్యభర్తలు అరెస్టు
హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు. ఫేక్ కంపెనీల పేరిట బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న భార్యభర్తలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మాడిశెట్టి అజయ్, అతని భార్య సంధ్య కలిసి మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించబడింది. పోలీసులు వీరి అకౌంట్లను పరిశీలించగా, ఏకంగా 40 లక్షల రూపాయల విలువైన బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. పోలీసులు బెట్టింగ్ ముఠాను పట్టుకునే క్రమంలో నిందితుల నుంచి రూ. 55,000 నగదు, బ్యాంక్ ఖాతాల్లో రూ.22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.. అంతేకాకుండా.. మొత్తం 7 అకౌంట్లను గుర్తించారు. అజయ్ గతంలోనే నాలుగు సార్లు క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో పట్టుబడ్డాడు. అయినప్పటికీ, మరోసారి బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయాడు.
మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.7గా తీవ్రత నమోదు..
భారీ భూకంపంతో మయన్మార్, థాయ్‌లాండ్‌లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 1000ని దాటింది. భవనాల శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, శనివారం మధ్యాహ్నం మరోసారి మయన్మార్‌ని భూకంపం వణించింది. 4.7 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. భూకంప లోతు 10 కి.మీగా ఉంది. దీనికి ముందు శనివారం మధ్యాహ్నం 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం నుంచి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి.
పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్.. దర్యాప్తులో పురోగతి
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్ కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కీలక ప్రకటన చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఈనెల 24వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి, రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఐజీ అశోక్ మాట్లాడుతూ, “పాస్టర్ ప్రవీణ్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటుప్పల్ టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. విజయవాడలో 3 నుండి 4 గంటల పాటు గడిపారు. ఆయన అక్కడ ఎవరిని కలిశారు? ఏం చేశారు? అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది” అని వెల్లడించారు.
పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ, ఉన్నతాధికారుల సూచనల మేరకు దర్యాప్తును వేగవంతం చేసింది. పోలీసులు హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించిన మొత్తం 15 గంటల సీసీ కెమెరా ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. ప్రయాణ సమయంలో ఆయన ఎవరితో ఉన్నారు? ఎవరిని కలిశారు? వంటి అంశాలపై వివరంగా దర్యాప్తు చేపట్టారు.
చంద్రబాబుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ సందర్భంగా మాజీమంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి మాట్లాడుతూ.. “నిజమైన తెలుదేశం కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ తెలుగు ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవటానికి పుట్టిన పార్టీ అని చెప్పారు.. ఆయన చెప్పిన చరిత్ర మామూలు చరిత్ర కాదు.. టీడీపీ ఆవిర్భవించిన రోజు చంద్రబాబు కాంగ్రెస్ జెండా మోస్తున్నారు.. ఇందిరా గాంధీ ఆజ్ఞాపిస్తే ఆయన మామ చంద్రబాబు మీదే పోటీ చేస్తా అన్నాడు.. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ జెండా పక్కన భారతదేశంలో ఉన్న అన్నీ పార్టీల జెండాలు పెట్టారు..