నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాలోత్ కవిత
పార్టీ మారడం లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత క్లారిటీ ఇచ్చారు. తనపైన రాజకీయ అత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారను… పోటీలోనే ఉంటానని స్పష్టం చేశారు మాలోతు కవిత. పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి అని.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఆమె అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తగా కార్యాచరణతో ముందుకు సాగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ కార్మికులను ఆదుకునే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోతుందన్నారు. తాగు, సాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలని సూచించారు.
చంద్రబాబుపై మండిపడ్డ బీజేపీ అసమ్మతి నేత.. ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారు..!
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ అసమ్మతి నేత పనతల సురేష్.. కడప ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేసిన కుట్రలో బీజేపీ పడిందన్నారు.. ఆ కుట్రలో భాగంగానే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందని.. ఈ పొత్తులో పలువురు బీజేపీ సీనియర్ నేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. విశాఖపట్నంలో చంద్రబాబు టీడీపీ, బీజేపీ నేతలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎవరి నోట్లో మట్టి కొట్టడానికి బద్వేలులో రోశన్నకు టికెట్ కేటాయించారని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకను టీడీపీ అధినేత నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
టీడీపీ జెండాను ఆవిష్కరించిన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆవిష్కరించారు. ఉత్తేజం ఉట్టిపడుతూ తెలుగుదేశం జెండా రెపరెపలాడింది.. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆనందంతో తెలుగుదేశం జిందాబాద్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువ నేత నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి ఉదయగిరి ముద్దుబిడ్డ కాకర్ల సురేష్ అంటూ నినాదాలు చేశారు.
టీడీపీ ఫైనల్ లిస్ట్.. 4 లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు.. పొత్తుల్లో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్‌సభ స్థానాల నుంచి టీడీపీ బరిలోకి దిగనున్న విషయం విదితమే కాగా.. ఈ రోజు నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది.. అయితే, ఆది నుంచి టికెట్ కోసం ఎదురుచూస్తోన్న కొందరు సీనియర్లకు ఈ జాబితాలో చోటు కల్పించింది.. అయితే, కదిరి అభ్యర్థిని టీడీపీ మార్చేసింది.. కందికుంట ప్రసాద్ భార్య యశోదకు బదులుగా ప్రసాద్‌కే సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం..
బీఆర్ఎస్ దుకాణం బంద్.. 8 మంది బీజేపీ నుంచి వస్తారు..!
బీజేపీ పార్టీలోని 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎంపీ ఎన్నికల్లో మాకు.. బీజేపీ కె పోటీ అన్నారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయిందన్నారు. భువనగిరి టికెట్ గురించి నేను అడగలేదు.. రాజగోపాల్ రెడ్డి అడగలేదని క్లారిటీ ఇచ్చారు. మా అన్న వాళ్ళ అబ్బాయి కూడా మాకు చెప్పకుండా దరకస్తూ చేశాడని అన్నారు. ఇప్పటికే మన ఇంట్లో మంత్రి.. ఎమ్మెల్యేలు ఉన్నామన్నారు. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలి కదా! అన్నారు. ప్రభుత్వాన్ని బీజేపీ కులగొడతాం అంటే ప్రజలు ఊరుకుంటారా? ఇదేమైనా.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటు చేస్తారు జనమన్నారు. అవసరం అయితే బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారన్నారు.
ఇది ఆకులు రాలే కాలం…కొత్త చిగురు మళ్లీ పార్టీలోకి వస్తుంది..
బీఆర్‌ఎస్ నేతలు పార్టీని వీడుతుండటంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారే వారు పవర్ బ్రోకర్లని హరీష్ వ్యాఖ్యానించారు. కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపోతున్నారని అన్నారు. ఇదేం పార్టీకి కొత్తకాదు.. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పట్టుమని 10 మంది కూడా పార్టీలో లేరని.. అయినా తెలంగాణ తెచ్చి కేసీఆర్ చూపెట్టారన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని ఆయన విమర్శించారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తలను కొనలేరన్నారు.
నేను 55 ఏళ్ళు కాంగ్రెస్‌లో ఉన్నా.. నన్ను cwc మెంబర్‌గా చేసింది కాంగ్రెస్
లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుస పెట్టి నేతలు పార్టీని వీడుతున్నారు. అయితే.. కీలక నేతలు పార్టీ వీడడం ఆ పార్టీని మరింత బలహీనపరుస్తుంది. బీఆర్ఎస్ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ముఖ్యనేతలు రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కె. కేశవరావు మాట్లాడుతూ.. నేను 55 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నానని, నాలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ నుంచి ఇంఛార్జి గా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. నన్ను cwc మెంబర్ గా చేసింది కాంగ్రెస్ అని, మొదట 1998 లో 40 మంది ఎమ్మెల్యే లతో సోనియాగాంధీ కి తెలంగాణ కోసం లెటర్ ఇచ్చామన్నారు కె.కేశవరావు. కాంగ్రెస్ ఎంపీలుగా తెలంగాణ కోసం ఎంతగానో కొట్లాడినమని, పబ్లిక్ లో తెలంగాణ ఉద్యమం ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌లో జాయిన్ అవ్వాలి అనే ప్రతిపాదన వచ్చిందన్నారు కె.కేశవ రావు. 55 ఏళ్ల తర్వాత trs లో జాయిన్ అయ్యానని, పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ కావాలంటే ఎక్కువ ఎంపీ లు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటంతో టర్ల5బిల్ పాస్ అయిందని, నేను కొన్ని కారణాల వల్ల ఆరోజు బీఆర్‌ఎస్ కు వెళ్ళానని ఆయన తెలిపారు.
రేపు పిఠాపురానికి పవన్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. మార్చి 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 12 రోజులపాటు 10 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది. తొలి విడతలో ఐదు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు పిఠాపురంలో పర్యటించనున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పవన్ పిఠాపురానికి రానున్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం
నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవడం ఖాయమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.