కేసీఆర్, మల్లారెడ్డి తొడు దొంగల్లా దోచుకుంటున్నారు..
మేడ్చల్ నియోజకవవర్గంలో కాంగ్రెస్ విజయభేరి జనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లారెడ్డి పేదోళ్ల గుడిసెలు కూల్చి వారికి నిలువ నీడ లేకుండా చేసిండు అని ఆరోపించారు. పేదలపై ప్రతాపం చూపే అధికారులు.. చెరువులను మింగిన మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోరు అని ఆయన ప్రశ్నించారు. చెరువుల పక్కన భూములు కొని.. చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి.. ఇక్కడి ప్రజలకు కేసీఆర్ ఇచ్చిందేం లేదు.. ఒక్క జవహర్ నగర్ డంపింగ్ యార్డు తప్ప.. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టికెట్ అమ్ముకున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, మల్లారెడ్డి తొడు దొంగల్లా దోచుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ కు ఐటీ కంపెనీలు తెస్తామన్న హామీని తుంగలో తొక్కారు.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ఆయన ప్రకటించారు. కేసీఆర్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగింది.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైంది.. తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్ ను పొలిమేరలు దాటే వరకు తరమాలి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
డిసెంబర్ 30 తరవాత బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉండదు..! భట్టి సంచలన వ్యాఖ్యలు
నవంబర్ 30 తర్వాత బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదని మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సొమ్మును దోపిడీ చేసిన బీఆర్‌ఎస్‌ను పారద్రోలేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని భట్టి అన్నారు. ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ కు ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు కోరుకుంటున్న ఆరు హామీలను అమలు చేస్తామని తెలిపారు. అలాంటి హామీలపై సంతకం చేసే ధైర్యం ఉందా? కేసీఆర్‌ను ప్రశ్నించారు. పాలకుడిగా మధిర ఓటర్లను ప్రశ్నించే వారిగా పెంచారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పాటైనా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 30 తరవాత బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాలు రాష్ట్ర సంపదను దోచుకున్నారని తెలిపారు.
రేపు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
తెలంగాణలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇక, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించగా.. రేపు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనుంది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కీలక అంశాలను అమలు చేయనున్నారు.
- కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అంశాలు ఇవే..!
- సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత
- ధరణీ స్థానంలో భూ భారతి పోర్టల్
- పసుపు కుంకుమ పథకం కింద ఒక లక్షతో పాటు తులం బంగారం
- తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ
- అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ
- ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు
- రేషన్ డీలర్లకు గౌరవ వేతనం
- వార్డు సభ్యులు గౌరవ వేతనం
- ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్
- ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యేక సంక్షేమ పథకాలు
- జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం
న్యూయార్క్ లో దీపావళికి సెలవు.. ప్రకటన విడుదల చేసిన గవర్నర్ కేథీ
మన భారత దేశంలో దీపావళి, రంజాన్, గుడ్ ఫ్రైడే ఇలా ప్రతి పండగకు సెలవలు ఇస్తారు. ఎందుకంటే మన దేశంలో అన్ని మతాలను అనుసరించే ప్రజలు నివసిస్తున్నారు. కనుక మన దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తుంది. ఇక తాజాగా హిందువుల పండుగల్లో ఒకటైన దీపావళి వేడుకలు దేశ వ్యాపతంగా జరిగాయి. దీపావళి సందర్భంగా ఆ జోరు పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించారు. అయితే హిందువులు జరుపుకునే పండుగ అయినటువంటి దీపావళికి ఇక పైన అగ్ర రాజ్యం అమెరికాలో కూడా సెలవలు ఇవ్వనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా లోని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు శుభవార్త చెప్పింది. ఇక పైన అమెరికా లోని న్యూయార్క్ లోని ప్రభుత్వ పాఠశాలలకు దీపావళి రోజున సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టం కూడా రూపుదిద్దుకోగా గవర్నర్ కేథీ హోచుల్ తాజాగా చట్టంపై సంతకం చేశారు.
తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్
తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ మైకులు బంద్ అయితాయి అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బండి సంజయ్ మాట్లాడుతూ.. మసీదుకుపోయిన రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుని అల్లాను మొక్కడం లేదని అన్నారు. కనీసం అల్లా గురించి వారికి తెలియదు టోపీ పెట్టుకొని రాముడిని, సీతనే మొక్కుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. మసీదుకు వచ్చి నమాజ్ చేస్తున్నారని ముస్లిం సమాజం వారికి ఓట్లు గుద్దుతున్నారని అన్నారు. తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? మీరే ఆలోచించుకోవాలని అన్నారు. కేసీఆర్ ఒక పాస్పోర్ట్ బ్రోకర్.. అలాంటి వ్యక్తిని అల్లాతో పోలుస్తారా? అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలానే జరుగుతుందా? కేటీఆర్ చెప్పాలని అన్నారు.
పాలకుర్తి సభలో ప్రజలను తన్నిన వ్యక్తి రేవంత్ రెడ్డి..!
పాలకుర్తి సభలో ప్రజలను తన్నిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామచంద్ర పురం,పెద్దతండా, చిప్పరాళ్ల బండ తండ, గ్రామాలలో ప్రచారంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి BRS పార్టీని ఆశీర్వదించాలని అన్నారు. తనను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పరిపాలిత ప్రాంతాలలో ఇవ్వని కరెంటు తెలంగాణ బ్రోకర్ మాటలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి సభలో ప్రజలను తన్నిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రోకర్ మాటలు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలని వినొద్దు అని సూచించారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. పాలకుర్తి లో ఎగిరిది బీఆర్ఎస్ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. రైతుల గోస తీర్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం కరెంట్ కూడా లేదని తెలిపారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అన్నారు.
చంద్రబాబు మెడికల్ రిపోర్టు ఇచ్చింది వైద్యులా, పొలిటికల్ డాక్టర్లా?
చంద్రబాబు మెడికల్ బెయిల్ మీద మరింతకాలం ఉండడానికి వీలుగా మెడికల్ రిపోర్టు ఇచ్చినట్టుందని వైసీపీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చర్మ వ్యాధులను ప్రాణాంతక వ్యాధులన్నట్టు మెసేజ్ వచ్చేలా చేశాడన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. 14 గంటలకు పైగా కారులో ప్రయాణించి విజయవాడ రావడం చూస్తే సహజంగా కామెంట్ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఏఐజీ ఆసుపత్రి రిపోర్టు చూస్తే వైద్యులా, పొలిటికల్ డాక్టర్లా అన్నట్టు కనిపిస్తుందని సజ్జల దుయ్యబట్టారు. పబ్లిక్ లైఫ్‌లో ఉంటారు కనుక ఒక అంబులెన్స్ ఉండాలి అని ఇవ్వడం చూస్తే అర్థం అవుతుందన్నారు. స్టంటు వేయాల్సినంతగా 1600 వస్తే.. చాలా క్యాజువల్‌గా రిపోర్టు ఇచ్చారన్నారు. కేన్సర్ ఉన్నట్టయితే ఇప్పటికే బయటపడలేదా అంటూ ప్రశ్నించారు.
హమాస్ బందీలను విడుదల చేస్తుంది.. థాయ్ రాజకీయ నేత కీలక వ్యాఖ్యలు..
గాజాలో హమాస్ బందీలపై థాయ్‌లాండ్ రాజకీయ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తుల సంధి కుదిరితే, విడుదలయ్యే బందీల్లో థాయ్ దేశానికి చెందిన వారంతా ఉంటారని, ఇలా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ తమకు హమీ ఇచ్చిందని థాయ్-ముస్లిం రాజకీయ నేతలు గురువారం తెలిపారు. ఏదైనా కాల్పుల విరమణ జరిగితే 3-5 రోజుల్లో బందీలను విడుదల చేస్తుందని, అందులో థాయ్ ప్రజలు ఉంటారని థాయ్-ఇరాన్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు లెపాంగ్ సయ్యద్ బ్యాంకాక్ పార్లమెంట్ భవనంలో మీడియాతో వెల్లడించారు.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి ఊచకోతకు పాల్పడ్డారు. 1400 మందిని చంపేశారు. చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా.. అత్యాచారాలు చేయడంతో పాటు తలలు నరికేశారు. ఇదే కాకుండా 240 మందిని బందీలుగా పట్టుకున్నారు. కిడ్నాప్‌కి గురైన వారిలో 25 మంది థాయ్‌లాండ్‌కి చెందిన వారు ఉన్నారు. దాడుల సమయంలో 39 మంది మరణించినట్లు ఆ దేశ విదేశాంగా శాఖ వెల్లడించింది.
పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
తెలంగాణలో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారంలో ఆయా పార్టీలు స్పీడ్ పెంచాయి. ఈ నేపథ్యంలోనే నేడు మేడ్చల్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కేసీఆర్.. మళ్లీ మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని వస్తుండని, పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆరెస్ మేడ్చల్ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. జవహర్ నగర్ ప్రజలకు డంపింగ్ యార్డు బాధ పోలేదని, మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిందే తప్ప బీఆరెస్ చేసిందేం లేదన్నారు రేవంత్ రెడ్డి.
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈ నగరాల్లో మాత్రమే..!
దేశంలోని 4 పెద్ద మెట్రో నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి తగ్గాయి. ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ కొత్త ధరలను నవంబర్ 16 నుంచి అమలులోకి తెచ్చింది. ఇదిలా ఉంటే.. దీపావళికి ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.50కి పైగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.57.50కి తగ్గడంతో.. 19 కిలోల బ్లూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1775.50కి చేరింది. అటు.. కోల్‌కతా, ముంబై, చెన్నై నగరాల్లో కూడా.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. కోల్‌కతాలో రూ.1885.50, ముంబైలో రూ.1728, చెన్నైలో రూ.1942గా ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం 15 రోజుల క్రితమే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.101.50 పెంచింది. అంతకు ముందు అక్టోబర్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1731.50, కోల్‌కతాలో రూ.1839.50, ముంబైలో రూ.1684, చెన్నైలో రూ.1898గా ఉంది. ఇక.. ఆగస్టు నెల నుంచి రెడ్ కలర్ డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇప్పుడు దానిపై ప్రభుత్వం రూ.200 సబ్సిడీ ఇస్తోంది. దీంతో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50గా ఉంది. దేశీయ LPG సిలిండర్ల ధరలలో మార్చిలో మార్పు జరిగింది.
కావాలని కొట్టి.. ఇప్పుడు కవర్ చేసుకోవడానికి కబుర్లు చెప్తున్నావా.. ?
తమ అభిమాన హీరో కానీ, హీరోయిన్ కానీ కనిపిస్తే,.. ఏ ఫ్యాన్ అయినా ఫోటోలు కోసం ఎగబడతారు. అది కామన్. అభిమానులు అంటూ లేకపోతే ఈ హీరోలు, హీరోయిన్లు ఇంత పేరు తెచ్చుకొనేవారే కాదు. తమ కుటుంబానికి కన్నా.. అభిమాన హీరో కోసమే ఎంతోమంది యువత కష్టపడుతున్నారు. ఆలాంటి వారు ఎదురైనప్పుడు ఒక చిన్న ఫోటో ఇవ్వడానికి కూడా చాలామంది సెలబ్రిటీలు ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది అయితే సెల్ఫీల కోసం వచ్చినవారిపై చెయ్యి చేసుకోవడం, బౌన్సర్లతో నెట్టివ్వడం లాంటివి చేస్తున్నారు. ఇక నిన్నటికి నిన్న బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. ఇక ఒక షూటింగ్ స్పాట్ లో నానా పటేకర్.. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన ఒక అభిమాని తలపై గట్టిగా కొట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీంతో నెటిజన్స్ నానా పటేకర్ ను ఏకిపారేస్తున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం సండే మార్కెట్ లో బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా పటాన్ చెరు మైత్రి గ్రౌండ్ నుంచి బండి సంజయ్ కు స్వాగతం పలికారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్, పార్టీ శ్రేణులు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పైసలిచ్చి మహిపాల్ రెడ్డి టికెట్ తెచ్చుకున్నారని, మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు విస్తరణకు కృషి చేస్తామన్నారు బండి సంజయ్. ప్రధాని మోడీ ఇచ్చే పైసలతో డబుల్ బెడ్ రూం కట్టారు. ఆసుపత్రులు కట్టారని, నీళ్లు, నిధులు,నియమకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆయనకు మాత్రమే తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు బండి సంజయ్.
