NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బరువు 25 వేల 1 రూపాయి నాణేలు

కార్మికుల సమావేశంలో పాల్గొనేందుకు బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ దర్భంగా చేరుకున్నారు. ఈ సమయంలో కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ అతనికి మిథిల సంప్రదాయం ప్రకారం తలపాగా, దుప్పటి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడి ఈ సందర్శనను తనకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. తనకు ఒక రూపాయి నాణెలతో త్రాసుపై తూకం వేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై దాడి చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమి జరిగిందో, తేజశ్వికి కూడా అదే జరుగుతుందని అన్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే చదువుకోవాలి.. పరీక్షా పే చర్చలో విద్యార్థులకు మోడీ చిట్కాలు

ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటూనే విద్యార్థులు చదువుకోవాలని ప్రధాని మోడీ విద్యార్థులకు సూచించారు. పరీక్షా పే చర్చ సందర్భంగా మోడీ ఒక వీడియోను ఎక్స్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఢిల్లీలోని సుందరవనంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించారు. వర్చువల్‌గా అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. సుందరవనంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని బదులిచ్చారు. పరీక్షలే సర్వస్వం కాదని విద్యార్థులకు సూచించారు. మనం రోబోలం కాదని, మనషులమని, ఒక దగ్గరే గిరిగీసుకొని ఉండొద్దని సలహా ఇచ్చారు. బయటినుంచి వచ్చే ఒత్తిడి మీద కాకుండా చదువుమీద దృష్టిపెట్టాలని సూచించారు. స్టేడియంలో వీక్షకులు కేకలేస్తూ, కేరింతలు కొడుతూ ఎంతగా శబ్దాలు చేస్తున్నా.. బ్యాటర్‌ దృష్టి మాత్రం బంతిపైనే ఉంటుందన్నారు. అలాగే విద్యార్థులు కూడా నేర్చుకోవడంపైనే దృష్టిపెట్టాలని మోడీ సూచించారు. ప్రాముఖ్యంగా కంటినిండా నిద్ర, సమతుల ఆహారం ముఖ్యమని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని విద్యార్థులకు మోడీ హితవు పలికారు. ఈ సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను ప్రధాని ఉదహరించారు. సచిన్‌కు చదువు కంటే ఆటల మీదే ఆసక్తి ఎక్కువ ఉండేదని.. దాన్ని గుర్తించిన అతడి తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారని ప్రధాని గుర్తుచేశారు.

పునరాలోచన చేయండి.. ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ ఫిర్యాదు

అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటి స్థలంపై వేసిన మార్కు గురించి పునరాలోచన చేయాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు. రోడ్డు విస్తరణలో భాగంగా చంద్రశేఖర్ రెడ్డి ప్లాట్కు అధికారులు మార్క్ చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, ముగ్ధ జంక్షన్ల పరిధిలో ఏడు స్టీల్ బ్రిడ్జీలు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇలా చేస్తే కనుక కేబీఆర్ పార్క్ చుట్టూ, సమీపంలో జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ చిక్కులతోపాటు యూటర్న్ లకు అవకాశం లేకుండా సాఫీగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

చిలుకూరు బాలాజీ టెంపుల్‌ అర్చకుడిపై దాడి.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపింది.. రంగరాజన్‌ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.. నాపై 20 మంది దాడి చేశారు.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని పేర్కొన్నారు రంగరాజన్‌.. అయితే, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఘటనపై స్పందించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ దాడి దురదృష్టకరమన్న ఆయన.. ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు.. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

జ్వరం నుంచి కోలుకున్న పవన్‌ కల్యాణ్‌.. ఆలయాల పర్యటన ఖరారు

హైందవ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు.. తొలి విడతలో ఈ నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నారు.. అయితే, చివరి నిమిషంలో ఆయన పర్యటన వాయిదా పడింది.. పవన్ కల్యాణ్ కు అస్వస్థతకు గురయ్యారు.. వైరల్ ఫీరత్‌తో ఇబ్బంది పడుతున్నారని ఆయన టీమ్‌ తెలిపింది. పవన్ కళ్యాణ్ ను జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధ పెడుతోందని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారని అన్నారు. అంతే కాదు.. ఆ తర్వాత జరిగిన కేబినెట్‌ భేటీకి కూడా దూరంగా ఉన్నారు పవన్‌.. అయితే, ఇప్పుడు జ్వరం నుంచి కోలుకోవడంతో.. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన ఖరారు అయ్యింది..

అతిషి రాజీనామా ఆమోదించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం అతిషి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాను కలిసి రాజీనామాను సమర్పించారు. సోమవారం ఆమె రాజీనామాను ఎల్జీ ఆమోదించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అతిషి.. కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మాత్రం ఘోర పరాజయాన్ని ముటకట్టుకున్నారు. పర్వేష్ శర్మ చేతిలో కేజ్రీవాల్ ఓడిపోయారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలిచింది. ఇదిలా ఉంటే బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ప్రధాని మోడీ ప్రస్తుతం 2 దేశాల పర్యటన కోసం ఫ్రాన్స్, అమెరికా వెళ్లారు. 4 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సీఎం రేసులో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందో మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలు అవుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఓటాన్ అకౌండ్ బడ్జెట్ ను గత ఏడాది జూలైలో చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టింది. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 – 26కి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అసెంబ్లీ సమావేశాల గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు స్టార్ట్ కానున్నాయని తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్స్ మొదలవుతాయి. ఇక, ఈ నెల 28న ఏపీ సర్కార్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. జూన్ లో ప్రభుత్వం ఏర్పడిన తరువాత సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ పథ కం అమల్లోకి తీసుకొచ్చారు. మిగిలిన పథకాలను వచ్చే ఆర్థిక ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.

బండ్లగూడలో ఫుట్‌పాత్‌పై వెలసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేత

రంగారెడ్డిలోని బండ్లగూడలో మునిసిపల్ అధికారులు ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై కొరడా ఝుళిపించారు. ఫుట్ పాత్‌పై వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పాదచారులు నడిచే పుట్ పాత్ ను ఆక్రమించుకొని వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు వ్యాపారస్తులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదేశాల మేరకు బండ్లగూడ జాగీర్ మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫుట్ పాత్ కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఫుట్ పాత్ కబ్జా చేయడంతో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రోడ్డుపై అడ్డంగా వాహనాలు నిలపడంతో తరుచూ భారీ గా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఫుట్ పాత్ కబ్జా చేయడంతో పాదచారుల పైకి వాహనాలు దూసుకొని వెళ్లిన ఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదం లో పలువురు మృతి చెందిన ఘటనలూ ఉన్నాయి. దీని పై సీరియస్ అయిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. అక్రమంగా వెలసిన నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేతలు చేపట్టారు.

బీజేపీ మతతత్వ ఎజెండాతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది

కరీంనగర్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు… మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు మతోన్మాదులు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ ఎజెండాతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ కి తగిన గుణపాఠం చెప్పాలని అభ్యర్థిస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరుతున్నాని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరంర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని, గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందన్నారు. నాలుగు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, నాటి ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి గడగడలాడించారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరి బ్రతుకులు రోడ్డున పడ్డాయి

హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంపీ, పీఎంపీల మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు భారీగా ఆర్ఎంపీ, పీఎంపీలు తరలివచ్చారు. అయితే.. వారి ధర్నాకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భయబ్రాంతులకు గురిచేసి , అక్రమ కేసులు పెడుతున్నారని, మేనిఫెస్టోలో ట్రైనింగ్ ఇచ్చి , సర్టిఫికెట్ ఇస్తామన్నారన్నారు హరీష్‌ రావు. ఇప్పుడు రోడ్లపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై ఆరోగ్యశాఖ అధికారుల వేధింపులను ఆపాలని ఆయన అన్నారు.