రైతులు హలం దున్నుడం కాదు.. కలం పట్టి దేశ చరిత్ర మార్చాలి : కేసీఆర్
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్ పెట్టానన్నారు. దేశంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందని, దేశంలో తాగు, సాగు, నీటి కొరత తీవ్రంగా ఉందన్నారు కేసీఆర్. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా రైతుల అత్మహత్యలు ఉన్నాయని, అన్నదాత ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయని, దారులన్నీ మూసుకుపోయి ఏ ఆసరా లేనప్పుడే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అనేదే బీఆర్ఎస్ తొలి నినాదమని, భారత్ తెలివిగల వాళ్ల దేశమని, ఎమర్జెన్సీ సమయంలో జేపీ పిలుపుతో జనం ఏకమయ్యారన్నారు. రైతులు హలం దున్నుడం కాదు.. కలం పట్టి దేశ చరిత్ర మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. మేం బలవంతులం అని అనుకునే నేతల పతనం తప్పదని, అప్పుడే దేశంలో రైతురాజ్యం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మేకిన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారిపోయిందని, మేకిన్ ఇండియా అంటారు.. కానీ అంతా చైనా బజార్‌గా మారిపోయిందన్నారు కేసీఆర్. మేకిన్ ఇండియా అంటే ఉండాల్సింది ఇండియా బజార్లు అని, 75 ఏళ్లలో 70 ఏళ్లు కాంగ్రెస్, బీజేపీలే పాలించాయన్న కేసీఆర్.. దేశం వెనుకబాటుతనానికి ఈ రెండు పార్టీలే కారణమన్నారు. ఒకరు అంబానీ అంటే.. ఇంకొకరు అదానీ అంటారని ఆయన మండిపడ్డారు.
నగర ప్రజలకు గుడ్ న్యూస్.. తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు
క్యాన్సర్ లో అగ్రగామిగా నిలిచిన ఒమేగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి సదుపాయాలతో,అత్యంత అధునాతన టెక్నాలజీతో 500 లకు పైగా పడకల సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను నేడు గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన వంశీ సిహెచ్ మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు అందించాలనే ఏకైక లక్ష్యంతో గచ్చిబౌలిలో ఒమేగా హాస్పిటల్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చాలా మంది రోగులకు గుండె, ఆర్థోపెడిక్, మూత్రపిండము, పల్మనరీ, న్యూరోలాజికల్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలకు ఇంటర్ డిసిప్లినరీ కేర్ అవసరమని, రోగుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తాము సమగ్ర క్యాన్సర్ సంరక్షణను అందించడానికి, వివిధ సూపర్ స్పెషాలిటీల సేవలను ఐదు అంతస్తులలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.వైద్య రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం ఎంతో అవసరం అన్నారు.
లవ్ ఫెయిల్యూర్.. మత్తుమందు ఇంజెక్షన్ తీసుకుని నర్స్ ఆత్మహత్య..
ఇటీవల ప్రేమ వ్యవహారాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసపోయిన యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, వాడుకుని మోసం చేసి వేరే వారిని వివాహం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇదిలా ఉంటే ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి మత్తు మందును ఇంజెక్షన్ చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇండోర్ నగరానికి చెందిన 27 ఏళ్ల నర్సు మత్తుమందును ఎక్కువ మోతాదులో ఇంజెక్ట్ చేసుకుని ప్రాణాలు తీసుకుందని పోలీసులు అదివారం తెలిపారు. పూజా గంజన్ అనే యువతి రెండు రోజుల క్రితం తన ఇంట్లో మత్తు మందు మోతాదుకు మించి శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకున్నట్లు ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. తన మరణానికి కారణాలను రెండు పేజీల వివరిస్తూ సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రిలో పనిచేస్తున్న తన సహోద్యోగితో సంబంధం ఉందని మృతురాలు లేఖలో పేర్కొంది. అయితే అతడు వేరే ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరి మరొక మహిళను వివాహం చేసుకున్నాడని లేఖలో తెలిపింది. మృతురాలి మాజీ ప్రియుడి వాగ్మూలం ప్రకారం..తనకు మహిళతో సంబంధం ఉందని, అయితే తన కుటుంబ సభ్యులు వేరే అమ్మాయితో పెళ్లిని నిశ్చయించడంతో పెళ్లి చేసుకోనని ఆమెకు చెప్పినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
బొమ్మతుపాకీ చూపించాడు.. అడ్డంగా బుక్కై తన్నులు తిన్నాడు
పాపం లేత దొంగ బొమ్మతుపాకీ చూపించి దోచేద్దాం అనుకున్నాడు. ఓ సినిమా స్టైల్లో దొంగతనం చేద్దామని అనుకున్నాడు. అదేనండి అజిత్ సినిమా తునివులో బొమ్మతుపాతీ చూపించి దోచేద్దామని అనుకున్నాడు. కానీ అది సినిమా అని మరిచిపోయాడు. ఆసినిమా స్టైల్లో దోపిడి చేద్దామని ఏకంగా బ్యాంక్‌కే వెళ్లాడు చివరికి స్థానికులు అతనిని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఈఘటన తమిళనాడులోని ఓ బ్యాంకులో చోటుచేసుకుంది. తిరుపూర్ జిల్లా ధర్మాపురం కెనారా బ్యాంకులో రద్దీగా ఉంది. అక్కడకు ఒకడు వచ్చాడు. బ్యాంక్ పరిశరాలను అంతా గమనించాడు. అయితే బ్యాంక్ లో కాస్త రద్దీ తక్కువైంది. ఇదే సమయం అని భావించాడు. ఫేస్ కు మాస్క్ ధరించాడు. బొమ్మతుపాకీతో బ్యాంక్ లో కూర్చున్న వారిని ఆ బొమ్మతుపాకీ చూపించాడు. కొందరిని బెదిరించి ఒకరిపై గురిపెట్టాడు. అంతే సీన్ రివర్స్ అయ్యింది. డ్యూప్లికెట్ తుపాకీ, బాంబుతో బ్యాంక్ లోని కస్టమర్స్ భయపెట్టాడు. బోమ్మ తుపాకీ తిప్పుతున్న సమయంలో తుపాకి చేతినుండి కిందపడిపోవడంతో దొంగను వృద్ధుడు తన వద్దవున్న టవాల్ తో దొంగ చేతులను గట్టిగాపడ్డుకున్నాడు. అక్కడున్న వారందరూ ధైర్యం చేసి దొంగపై విరుచుకుపడ్డారు. దొంగను కిందపడేసి చితకొట్టారు. బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన పోలీసులు బ్యాంక్ దగ్గరకు చేరుకున్నారు. దొంగను అదుపులో తీసుకున్నారు. ఈఘటన సీసీ టీవిలో రికార్డు కావడంతో ఈ సినిమా కథకాస్త వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సురేష్ గా గుర్తించారు పోలీసులు. ఆన్‌లైన్‌లో బొమ్మ తుపాకీని కొనుగోలు చేసి, డమ్మీ బాంబును తయారు చేయడానికి రెడ్ టేప్‌తో చుట్టి, స్విచ్ బాక్స్‌ను ఉపయోగించి కిచెన్ టైమర్‌ను అంటించాడు. అయితే దొంగను పట్టుకోబోయిన ఆపెద్దాయన అతడిని నేలపై పడేయడంతో గాయపడ్డాడు. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి సమగ్ర విచారణ చేపట్టారు పోలీసులు.
బీఆర్‌ఎస్ అధికారంలో వస్తే.. దేశమంతా దళితబంధు
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం ఏర్పడితేనే నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రైతులది జీవన్మరణ సమస్య అని, చాలా దేశాల్లో 5వేల టీఎంసీల ప్రాజెక్టులు ఉన్నాయని, మన దేశంలో ఆ స్థాయిలో ప్రాజెక్టులు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. మోటర్లకు మీటర్లు పెడతామంటే ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని, తెలంగాణలో రైతు సహజ మరణం పొందినా 8 రోజుల్లో రూ.5లక్షలు ఇంటికి చేరుతాయన్నారు కేసీఆర్. రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటోందిని,
ప్రతి ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కావని ఆయన ప్రశ్నించారు. రైతు ప్రభుత్వాలు లేవు కాబట్టే ఆ రాష్ట్రాల్లో ఇవన్నీ అమలు కావడం లేదన్నారు. దేశంలో బొగ్గును సద్వినియోగం చేసుకుంటే 125 ఏళ్లు కరెంటు సమస్య ఉండదని, ప్రభుత్వాలు మారుతున్నాయి, నేతలు మారుతున్నారు.. కానీ, రైతుల దుస్థితి ఎందుకు మారడం లేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం ఇస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వలేరని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో గులాబీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మహారాష్ట్ర స్వరూపాన్ని మార్చండి. తెలంగాణలో ఇది చేసి చూపించామని కేసీఆర్ అన్నారు.
ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు
ఏపీలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 95, 208 మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల సంఖ్య 4, 59, 182గా ఉంది. 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 22వ తేదీన ఈ పరీక్ష నిర్వహించారు. ఇందుకు గాను 997 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే రోజు పరీక్షా కీ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ బోర్డు.. 25వ తేదీ వరకూ కీపై అభ్యంతరాలకు సమయం ఇచ్చింది. ఇవాళ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్ని విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు రెండో దశకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండో దశ అప్లికేషన్లను ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రారంభించనున్నట్లు రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. క్వాలిఫై అయిన వారికి ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అందులోనూ అర్హత సాధిస్తే మెయిన్స్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు.
ఇది అసలు ఊహించని సినిమా అవుతుంది : ఎన్టీఆర్
ఎన్టీఆర్-వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అనే వార్త గత రెండు మూడేళ్ళుగా వినిపిస్తూనే ఉంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని వెట్రిమారన్ తోనే చేస్తాడు అని ఇప్పటికే చాలా న్యూస్ ఆర్టికల్స్ బయటకి వచ్చేసాయి. ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్, వెట్రి లాంటి కమర్షియల్ డైరెక్టర్ కలిస్తే అది ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సొసైటీలో జరిగే విషయాలని ఆడియన్స్ కి హై ఇచ్చే రేంజులో చెప్పడంలో వెట్రిమారన్ దిట్ట, అతని మేకింగ్ కి నేషనల్ అవార్డ్ కూడా ఫిదా అయ్యింది. వెట్రిమారన్ సినిమా నేషనల్ అవార్డ్ రేసులో ఉంది అంటే అది ఆ మూవీకే వెళ్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరికీ ఉంది అంటే అది వెట్రిమారన్ క్రెడిబిలిటీ. వసారనై లాంటి చిన్న సినిమాని ఆస్కార్ వరకూ తీసుకోని వెళ్లాడు అంటే వెట్రిమారన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు.
వెట్రిమారన్ లాంటి డైరెక్టర్ కి ఎన్టీఆర్ లాంటి యాక్టర్ కలిస్తే అద్భుతమైన ప్రాజెక్ట్ ఆడియన్స్ ముందుకి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నిజంగానే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ లు కలిసి ‘ఎన్టీఆర్ 32’ సినిమా చేస్తున్నారా? అనే ప్రశ్నకి సమాధానం తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి ఆస్కార్ నామినేషన్ వస్తుంది అని ప్రతి ఒక్కరూ హాప్ పెట్టుకున్నారు, అదే ఎన్టీఆర్-వెట్రిమారన్ సినిమా సెట్ అయితే ఎన్టీఆర్ పక్క ఆస్కార్ ని నామినేట్ అవుతాడు అని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్టీఆర్ కి వెట్రిమారన్ మూడు కథలు చెప్పాడని, అందులో రెండు భాగాలుగా తెరకెక్కాల్సిన అవసరం ఉన్న ఒక కథ ఎన్టీఆర్ కి నచ్చిందని సమాచారం. మరి నిజంగానే ఎన్టీఆర్-వెట్రిమారన్ ప్రాజెక్ట్ సెట్ అయితే దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తారు లాంటి విషయాల గురించి అఫీషియల్ అప్డేట్ ఎవరు, ఎప్పుడు ఇస్తారు అనేది చూడాలి.