Site icon NTV Telugu

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క మొరగదు.. కొడాలి నాని సెటైర్లు
స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు మండిపడ్డ ఆయన… చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420 అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక, జనసేన చీఫ్‌ ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో​, విడిపోతాడో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు తరఫు లాయర్లు 17ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చట్ట విరుద్ధమంటున్నారు.. కానీ, చంద్రబాబు తప్పు చేయలేదు, రాష్ట్ర ఖాజానాను దోచుకోలేదని ఎక్కడా టీడీపీ నేతలను మాట్లాడడం లేదన్నారు.. రాష్ట్ర ఖజానా దోచుకున్న దొంగ చంద్రబాబు. ఈ దొంగను పట్టుకోవడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని లాయర్లు వాదిస్తున్నారని దుయ్యబట్టారు.. ఇక, లోకేష్ ఎంటరయ్యాక దొంగ అకౌంట్లకు ప్రభుత్వ సొమ్ము తరలించి విచ్చలవిడిగా దోచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని.. చంద్రబాబు అవినీతి చేయలేదని కాకుండా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని కేసు కొట్టేయమనడం సిగ్గుచేటన్న ఆయన.. చంద్రబాబు దొరికిపోయిన దొంగగా అభివర్ణించారు.. చంద్రబాబు లోపలుంటే ఏంటి..? బయట ఉంటే ఏంటి..? అని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ ప్రజలు ఎన్ని డ్రామాలు ఆడినా.. గిన్నెలు, గరిటెలు కొట్టినా.. ప్రజలు క్షమించరన్నారు. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు కొడాలి నాని.. ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.. టీడీపీతో కలిసి వెళ్తానని పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నాడు. టీడీపీతో కలిసేదేలేదని బీజేపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. అలాంటప్పుడు పవన్‌ కల్యాణ్‌.. ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టా.. లేనట్టా? అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌.. బీజేపీతో కలిసి ఉన్నా.. వారితో ఎన్నికలకు వెళ్తానని చెప్పడం లేదు.. 151 స్థానాల్లో గెలిచిన వైసీపీకి.. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా భయపడేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని.

రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది.. ఇలా చేస్తే తెలంగాణలో అధికారం పక్కా..!
తెలంగాణలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది.. బలపడుతోంది.. అధికారంలోకి రావడం గ్యారంటీ అంటున్నారు సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి.. శ్రీసత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తెలంగాణలో పెరుగుతుంది. కర్ణాటక మాదిరి తెలంగాణాలో ఆరు గ్యారంటీల కార్డులను ఇంటింటికి తీసుకెళ్తే.. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వంద సార్లు పర్యటించినా.. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్రజల్లో కాంగ్రెస్ రావాలని బలంగా ఉందన్నారు రఘువీరారెడ్డి.. ఇక, ఏపీ రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీ, వైసీపీ దాగుడు మూతలతో పోలవరం ఆలస్యమవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. 2019 నాటికే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. అందుకే.. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ దేశానికి అవసరం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అవలంభించబోయే వ్యూహా‌లను ఈ నెల 9న జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి.

జైలుకెళ్లిన మాజీ సీఎంలు ఎవరూ బతికి బట్ట కట్టలేదు..! మంత్రి అంబటి హాట్‌ కామెంట్స్..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హాట్‌ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసి జైలుకెళ్లిన మాజీ ముఖ్యమంత్రులు ఎవరూ బతికి బట్ట కట్టలేదు, ఒక వేళ బయటకు వచ్చినా మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భాలు లేవు.. ఒకరు ఇద్దరు తప్ప.. అన్నా డీఎంకే చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి చూశారుగా అని గుర్తు చేశారు అంబటి రాంబాబు.. అలాంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మద్దతి ఇస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పడవ.. ఎవరు వెళ్లి లేపినా లేచే పరిస్థితి లేదన్న ఆయన.. అలాంటి టీడీపీనీ తాను లేపుతానంటున్నాడు పవన్‌ కల్యాణ్.. అంటే చంద్రబాబుతో పాటు పవన్‌ కల్యాణ్‌ పార్టీ కూడా మునిగిపోతుందంటూ జోస్యం చెప్పారు. కాగా, ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.. ఇక, ములాకత్‌లో చంద్రబాబును కలిసిన తర్వాత.. టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తాయని జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్ ప్రకటించిన విషయం విదితమే.

బీఆర్‌ఎస్‌కు రేఖా నాయక్ రాజీనామా.. ఖానాపూర్ లో ఎట్లా గెలుస్తారో చూస్తా..
బీఆర్ఎస్ పార్టీకి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆమె మీడియా ముందుకు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ అని ఇక్కడ టికెట్ ఇచ్చారు.. నేనేమీ తప్పు చేశాను.. స్కాం చేశానా.. నియోజక వర్గం అభివృద్ధి నిధుల కోసం ఎంతో శ్రమించాను.. నా నియోజక వర్గంలో భూమి పూజ కోసం రాలేదు.. నేను ఎమ్మెల్యేగా ఉండగనే నా నిధులు ఆపారు.. కడెం డ్యాం తెగిపోతుంది అంటే అర్థరాత్రి డ్యాం వరకు వెళ్ళాను అని ఆమె పేర్కొన్నారు. మా సమస్య లను పరిష్కరించ లేదు.. ఖానాపూర్ నియోజకవర్గం వెనుక బడ్డది అని ఒప్పుకున్నారు.. నా నియోజక వర్గం 4 వందల ఇండ్లను నిర్మల్, ముదోల్ కి ఇచ్చారు అని రేఖానాయక్ తెలిపారు. మీడియా ముందే రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను అభివృద్ధి చేసారు అని అక్కడక్కడ ఒక్కరిద్దారు ప్రశ్నించిన వారిపై దాడి చేసి కేసులు పెట్టారు అని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. జాన్సన్ నాయక్ ఎట్లా గెలుస్తావో చూస్తా బిడ్డా అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. నా కుటుంబం గురించి మాట్లాడితే ఖబర్ధార్.. నేను పోటీలో ఉంటాను.. పార్టీ గురించి నిర్ణయం తీసుకుంటాను.. రెవెన్యూ డివిజన్ అడిగితే ఇవ్వలేదు.. కాళ్ళు మొక్కినా కనికరించ లేదు. రోడ్లు కాలే బ్రిడ్జిలు కాలేదు.. నన్నే కాదు ఖానాపూర్ ప్రజలను మోసం చేసారు అని రేఖానాయక్ వెల్లడించారు. జాన్సన్ నాయక్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావు.. దమ్ముంటే మంత్రి పదవి తీసుకుని ఉండనుండే అని ఆమె అన్నారు.

రాష్ట్ర విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేం.. బీహార్‌ ప్రభుత్వానికి నోటీసులు
బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణనకు సంబంధించిన నివేదికను బహిరంగపరిచింది. ఇందులో రాష్ట్రంలోని కులాల పరిస్థితి గురించిన సమాచారం అందించారు. కాగా, శుక్రవారం సుప్రీంకోర్టులో కుల గణనపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కుల గణన వివరాలను ప్రచురించకుండా బీహార్ ప్రభుత్వాన్ని అడ్డుకోబోమని, రాష్ట్ర విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది.బీహార్‌లో కులాల సర్వేకు అనుమతినిస్తూ ఆగస్టు 1న పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధానాలను అడ్డుకోలేమని కోర్టు పేర్కొంది. అయితే సర్వే సమయంలో తీసుకున్న వ్యక్తుల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం పబ్లిక్ చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు ఈ విషయం జనవరిలో విచారణకు రానుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నితీష్ ప్రభుత్వం కులాల సర్వే నివేదికను బహిరంగపరిచింది. మరోవైపు కుల సర్వేపై పిటిషన్‌ సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ తేదీని అక్టోబర్ 6వ తేదీకి నిర్ణయించారు. ఇప్పుడు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీహార్‌లోని నితీష్‌ కుమార్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుల గణనలో వ్యక్తుల వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయకూడదని చెప్పబడింది. అలాగే జనవరిలోగా నోటీసుపై స్పందించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

కుల ఆధారిత జనాభా గణన నివేదిక ఏమిటి?
బీహార్‌లో కుల గణన నివేదిక ప్రకారం, అత్యంత వెనుకబడిన తరగతి (EBC) జనాభా 36.01 శాతం, ఇతర వెనుకబడిన తరగతి (OBC) 27 శాతం. షెడ్యూల్డ్ కులాలు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతం. రాష్ట్రంలోని మొత్తం 13 కోట్లకు పైగా జనాభాలో అగ్రవర్ణాల వారు 15.52 శాతం ఉన్నారు. సర్వే ప్రక్రియ లేదా సర్వే ఫలితాల ప్రచురణపై స్టే విధించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు పదేపదే నిరాకరించింది. అయితే, ఇప్పుడు ఎవరి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయకూడదని కోర్టు చెప్పింది.

రష్యా నుంచి భారత్‌ని దూరం చేసే ప్రయత్నాలు ఫలించవు..
వెస్ట్రన్ దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫైర్ అయ్యారు. భారత్, రష్యా బంధాన్ని పశ్చిమ దేశాలు విడదీయలేవని ఆయన అన్నారు. భారతదేశం తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, దీనివల్ల పాశ్చాత్య దేశాల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. సోచి నగరంలో రష్యాన్ బ్లాక్ సీ రిసార్టులో జరిగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వెస్ట్రన్ దేశాలు తమ గుత్తాధిపత్యాన్ని ఆమోదించని దేశాలను శత్రవుగా చూస్తున్నాయని, భారత్ తో పాటు చాలా దేశాలు ప్రమాదంలో ఉన్నాయని, అయితే భారత్ తన తన ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, అది స్వతంత్ర దేశమని, రష్యాను భారత్‌ నుంచి దూరం చేసే పశ్చిమ దేశాల ప్రయత్నాలు ఫలించవని పుతిన్ అన్నారు. తన స్నేహితులు ఇబ్బందులు పడొద్దనే తాను ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాలకు వెళ్లలేదని ఆయన తెలిపారు. ఆ సదస్సు పొలిటికల్ షోగా మారొద్దనే తాను గైర్హాజరైనట్లు చెప్పారు.

ఇదేందయ్యా ఇదీ.. రాత్రికి రాత్రే బస్టాండ్‌ను ఎత్తుకెళ్లారు!
చోరీకి కాదేది అనర్హం అన్న తీరుగా దేశంలో పరిస్థితి తయారైంది. ఎక్కడ చూసినా దొంగలు అవాక్కయేలా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. దొంగలు ఏకంగా బస్టాండ్‌ను ఎత్తుకెళ్లారు. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. కర్ణాటక రాజధాని బెంగళూరులో బస్టాండ్‌నే దొంగతనం చేసిన ఈ వింతకేసు తాజాగా వెలులగులోకి వచ్చింది. బస్టాండ్‌లో జరిగిన చోరీ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి ప్రకటన కూడా వెలువడింది. బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్‌లో మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ కొత్తగా బస్టాండ్‌ను నిర్మించింది. దాదాపు 10 లక్షల రూపాయల విలువైన సామాగ్రితో స్పెయిన్ లెస్ స్టీల్‌తో, అధునాతన వసతులతో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్టాండ్‌ను నిర్మించింది. అయితే బస్సు షెల్టర్ నిర్మించిన వారం రోజుల్లోనే దొంగలు దానిని మాయం చేశారు. రాత్రికి రాత్రే అదను చూసి బస్టాండ్‌ను విడివిడి భాగాలుగా విడగొట్టి ఎత్తుకెళ్లారు. బస్టాండ్‌ను ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే ఈ చోరీ జరగడంతో స్థానికులు షాక్‌ అయ్యారు. బస్సు సెంటర్‌ నిర్మాణానికి బాధ్యత వహించే బెంగళూ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ బస్టాండ్‌ అదృశ్యమైన నెల రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులెవరిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు.

ప్రపంచంలోనే ఖరీదైన వెడ్డింగ్ డ్రెస్స్.. ధర తెలిస్తే ఫ్యూజులు అవుటే..
మాములుగా అంబానీ కుటుంబంలోని వాళ్లు ఏ ఈవెంట్ అయిన ఖరీదైన డ్రెస్సులను ధరిస్తారు..ముఖ్యంగా వెడ్డింగ్ డ్రెస్సులు గురించి ఇక చెప్పనక్కర్లేదు ఎంత కాస్ట్ ఉంటాయో అంతకు మించి వార్తలు వినిపిస్తుంటాయి.. అంబానీ వారసురాలు ఇషా అంబానీ పెళ్లి డ్రెస్‌ కోసం రూ.90 కోట్లు వెచ్చించినట్టుగా వచ్చాయి. పెళ్లి సందర్భంగా ఆమె ధరించిన లెహంగా ప్రపంచంలోనే ఖరీదైనదిగా తెలిసింది. అంతేకాదు.. ఇషా అంబానీ పెళ్లి ఖర్చు 700 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు దానికంటే మించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ లెహంగా కూడా ఉందని తెలిస్తే మీరు తెలిస్తే మీరు షాక్ అయిపోతారు.. ఇషా అంబానీ గోల్డెన్ లెహంగా ధరించింది.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెహంగా మాత్రం డైమండ్స్ తో తయారు చేశారు..గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, బ్రైడల్ డిజైనర్ రెనీ, ప్రఖ్యాత జ్యువెలర్ మార్టిన్ కాట్జ్ రూపొందించిన డైమండ్ వెడ్డింగ్ డ్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ దుస్తులు.. చాలా అందమైన డ్రెస్సు కూడా.. డైమండ్ వెడ్డింగ్ డ్రెస్‌ను 2006లో మార్టిన్, రెనీ డిజైన్ చేశారు. గౌను ఐవరీ రంగులో ఉంటుంది. దీన్ని అత్యంత నాణ్యమైన విలాసవంతమైన పట్టుతో తయారు చేశారు.. ఈ లెహంగా ఖరీదు 12 మిలియన్లు. ఇది భారతీయ కరెన్సీలో రూ. 99.85 కోట్లు. ఇది ఇషా అంబానీ వివాహ లెహంగా కంటే ఖరీదైనది. కాలిఫోర్నియాలోని విలాసవంతమైన రిట్జ్ కార్ల్టన్ హోటల్‌లో వెడ్డింగ్ గౌన్‌ను డిజైనర్ డ్రెస్సును తయారు చేశారు..ఇషా అంబానీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లెహంగా ధరించిన రికార్డును కలిగి ఉన్నారు.. అద్భుతమైన బంగారు, ఎరుపు రంగులో ఉన్న లెహంగ ధర 90 కోట్లు. లెహంగా ప్రస్తుతం నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు.. మరి వంద కోట్లు పెట్టి ఎవరు ఈ ఖరీదైన డ్రెస్సును సొంతం చేసుకుంటారో చూడాలి..

సెన్సార్ లేదని.. నగ్నంగా చూపించేస్తారా.. ?
సెన్సార్.. ప్రతి సినిమాకు ఇది ఏంటో ముఖ్యం. ఒకప్పుడు.. హీరోయిన్ చీర పక్కకు తొలగించినా కూడా సెన్సార్ దానికి అడ్డుకట్ట వేసింది. కానీ, ఉన్నకొద్దీ సినిమా తీరుతెన్నులు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు రొమాన్స్ అంటే ఛీ అనుకునేవారు.. ఇప్పుడు సినిమాల్లోనే రొమాన్స్ కన్నా ఎక్కువ చూపిస్తున్నారు. కొన్ని కొన్ని సీన్స్ కు సెన్సార్ కూడా అడ్డుకట్ట వేయలేకపోతుంది. కథను బట్టే ఆ సీన్స్ వచ్చాయని డైరెక్టర్స్ చెప్తుంటారు.. డైరెక్టర్ చెప్పిందే తాము చేశామని నటీనటులు చెప్తారు. ఏదిఏమైనా ఈ సెన్సార్ కొన్ని సీన్స్ కు అడ్డుకట్ట వేయకపోవడం వలన కుటుంబాలతో కలిసి చూడలేకపోతున్నారు. కనీసం థియేటర్ లో అయినా కొన్నింటికి సెన్సార్ ఉంటుంది. కానీ, ఓటిటీకి సెన్సార్ లేకపోవడంతో మేకర్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య వస్తున్న కంటెంట్ మొత్తం అడల్ట్ కంటెంట్ తో కూడుకున్నది. మాటలకూ అయితే మ్యూట్ ఇస్తున్నారు కానీ, కొన్ని సీన్స్ కు మాత్రం సెన్సార్ చేయడం లేదు. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో కూఫియా అనే ఒక సిరీస్ స్ట్రీమింగ్అవుతున్న విషయం తెల్సిందే. టబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అందుకు కారణం వామిక గబ్బి. ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నారు కదా. తెలుగులో సుధీర్ బాబు సరసన భలే మంచి రోజు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమ ఆశించిన ఫలితం అనుకోలేకపోయేసరికి అమ్మడు మళ్లీ తిరిగి టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ భమేం కనిపిస్తోంది. ఇక కూఫియా గురించి వస్తే ఇందులో వామిక బోల్డ్ సీన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో సెమీ న్యూడ్ సీన్స్ తో కనిపించింది. బికినీ వేసుకొని అద్దం ముందు అమ్మడు అందాల ఆరబోత అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన కొంతమంది .. సెన్సార్ లేదని మరి ఇంత నగ్నంగా చూపిస్తారా.. ? అంటూ చెప్పుకొస్తారు.

Exit mobile version