శుభవార్త చెప్పిన హోంమంత్రి.. త్వరలోనే పోలీసు ఉద్యోగాల భర్తీ.
పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తోన్నవారికి శుభవార్త చెప్పారు హోంమంత్రి తానేటి వనిత.. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించాం.. ఒకరిద్దరు కోర్టుకు వెళ్లటం వల్ల ఆ ప్రకియ ఆలస్యం అవుతుందన్నారు.. అయితే, త్వరలోనే మిగతా ప్రాసెస్ పూర్తి చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇక, ఒంగోలులో గిరిజన యువకుడిపై దాడి ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించారని తెలిపారు హోంమంత్రి తానేటి వనిత.. గిరిజన యువకుడిపై అలాంటి ఘటన జరగటం దురుదృష్టకరమన్న ఆమె.. యువకుడిపై దాడి చేసిన ఇతర యువకులు గతంలో కలసి పలు దొంగతనాలకు పాల్పడ్డారని.. ఓ మైనర్ బాలికపై అత్యాచార కేసులో జైలుకు కూడా వెళ్లారని వెల్లడించారు.. చోరీ సొమ్ము పంపకాల విషయంలోనే ఈ దాడి జరిగిందని.. దాడి సమయంలో ఏం జరిగిందో కూడా అర్థం కానీ మద్యం మత్తులో ఆ యువకుడు ఉన్నాడని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురిని ఇవాళ అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు హోంమంత్రి తానేటి వనిత. కాగా, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ గిరిజన యువకుడి పట్ల కొందరు యువకులు పైశాచికత్వగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ, నోట్లో మూత్రం పోసి చావబాదారు.. వదిలేయమని బతిమాలినా వినలేదు. అయితే, ఈ ఘటన మొత్తం ఓ మొబైల్‌లో చిత్రీకరించడంతో.. ఆలస్యంగా వెలుగు చూసిన విషయం విదితమే..
ఆటోను దారి మళ్లించిన డ్రైవర్.. మహిళ ఏం చేసిందంటే..?
ఆడవాళ్లు బయటకు వెళ్తే.. ఇంటికి వచ్చేదాకా గ్యారంటే లేకుండా పోతోంది.. ఎక్కడ ఏ కామాంధుడు కాచుకు కూర్చున్నాడో.. ఎవ్వడు ఎలా ప్రవర్తిస్తాడో.. అని అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.. చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు ఇలా తేడా లేకుండా.. వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. బయటకు వెళ్లారంటే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి.. తాజాగా, తిరుపతిలో ఓ మహిళ ఆటో డ్రైవర్ బారి నుంచి తప్పించుకోవడానికి రన్నింగ్‌లో ఉన్న ఆటో నుంచి దూకేసింది.. తిరుపతిలో.. ఆటో డ్రైవర్ దారి మళ్లించడంతో పాటు, అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో ఓ మహిళ రన్నింగ్ ఆటో నుండి దూకేసింది. గాయాలపాలైన మహిళ దిశ SOS కు కాల్ చేసి జరిగిన సంఘటన గురించి పోలీసులకు వివరించింది. ఈ సంఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూళ్లూరుపేటలో ఓ శుభకార్యానికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. బాలాజీనగర్ కు వెళ్లే దారిలో కాకుండా మరొక రూట్ లో ఆటో ను మళ్లించాడు డ్రైవర్. మహిళకు అనుమానం వచ్చి ఆటో డ్రైవర్ ను అడిగినప్పటికి సమాధానం చెప్పలేదు. డ్రైవర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో మహిళ రన్నింగ్ ఆటో నుండి దూకేసింది. అనంతరం దిశ SOS కు కాల్ చేసి సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు.. తీవ్ర గాయాలైన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ కోసం చుట్టుపక్కల పోలీసులు గాలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ నుండి ఆటో డ్రైవర్ వివరాలను పోలీసులు సేకరించారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ ను కేశవులుగా పోలీసులు గుర్తించారు. తప్పించుకున్న ఆటో డ్రైవర్ కేశవులు పై 366 సెక్షన్ కింద సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేశారు..
R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను నిలిపి వేయాలని.. దాని కోసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఇరు వర్గాల వాదనలు ముగియటంతో తీర్పు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.. ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినట్టు కోర్టుకు తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం.. ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని సుప్రీంకోర్టుకి ఇచ్చిన పిటిషన్ లో పేర్కొన్నట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. ఇక, తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రజా ధనం వృధా అవుతుంది కదా? అని ప్రశ్నించింది ధర్మాసనం.. ఇక, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను ఎక్కడైనా ఇవ్వాల్సిందే అని ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఇక్కడ ఇళ్లను నిర్మించిన భూములకు ప్రత్యామ్నాయంగా వేరే చోట CRDAకి భూములు ఇస్తామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. అయితే, ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ముగియడంతో.. తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు..
తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఈరోజు( శుక్రవారం) బాధ్యతలను స్వీకరించారు. అయితే, నాలుగోసారి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు, భాగ్యలక్ష్మి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్యోతిబా పూలే, శాసనసభ దగ్గర ఉన్న వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. శాసన సభ ఎదురుగా గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపానికి కిషన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మరణించిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, బిజేపీ నేతలు మురళీధర్ రావు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల ప్రభాకర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
హైకమాండ్ కు ఫిర్యాదులు చేయడం ఇకనైనా ఆపండి..
తెలంగాణలో మూర్ఖత్వం, కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడాలి అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి నిన్ననే యుద్ధం ప్రారంభించాడు.. కేసీఆర్.. గత ఎన్నికల సందర్భంగా డబుల్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడు.. దీనిపై ప్రశ్నించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాటసింగారం వెళ్తుంటే అడ్డుకుని అరెస్టు చేశారు.. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని బండి సంజయ్ అన్నారు. గత ఎన్నికల హామీలను కేసీఆర్ నిలబెట్టుకునే వరకు బీజేపీ కార్యకర్తలు విడిచిపెట్టరని ఆయన తెలిపాడు. ముఖ్యమంత్రి ఫాంహౌజ్, ప్రగతిభవన్ లో పడుకున్నాడు.. సచివాలయం నీళ్లలో మునిగిపోతున్నా పట్టించుకోవడం లేదు అని బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నాడని ఫస్ట్ పేజీలో వస్తుందని భావించి దాన్ని డైవర్ట్ చేసేందుకు పీఆర్సీ అంటూ చెబుతున్నాడు.. కేసీఆర్ దరిద్రపు మొఖాన్ని ఫస్ట్ పేజీలో చూపించాలనుకుంటున్నాడు.. ఎన్నికలు సమీపిస్తున్నాయ్ కదా.. అందుకే.. కేసీఆర్ నటించడం కాదు.. ఏకంగా జీవిస్తున్నాడు అని ఆయన తెలిపారు. ఇవాళ కేసీఆర్.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ తో ప్రచారం చేయిస్తున్నాడు.. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి.. ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ కు ఫిర్యాదులు చేయడం ఇకనైనా ఆపేయాలని అన్నాడు.
జ్ఞాన్‌వాపి మసీదు కార్బన్ డేటింగ్‌కు వారణాసి కోర్టు అనుమతి
కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు కార్బన్ డేటింగ్‌ను వారణాసి కోర్టు శుక్రవారం అనుమతించింది. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో వివాదాస్పద ‘శివలింగం’ నిర్మాణాన్ని మినహాయించి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. జ్ఞాన్‌వాపి మసీదు కేసులో హిందువుల తరపున వాదిస్తున్న విష్ణు శంకర్ జైన్.. తన దరఖాస్తు ఆమోదించబడిందని తెలిపారు. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో ఏఎస్‌ఐ సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఈ కేసులో హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదిస్తూ.. మొత్తం జ్ఞాన్‌వాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయాలని ఏఎస్‌ఐకి కోర్టు ఆదేశాలను కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మేలో పిటిషన్‌ను విచారించడానికి కోర్టు అంగీకరించిన తర్వాత, హిందూ పక్షం చేసిన సమర్పణలకు సమాధానం ఇవ్వాల్సిందిగా జ్ఞాన్‌వాపి మసీదు కమిటీని కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈరోజు నిర్ణయం తీసుకుంది.
మణిపూర్‌లో మరో షాకింగ్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్
ఇప్పటికే హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ తాజాగా వైరల్‌గా మారింది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అయి.. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. దానిని మరువక ముందే ఈ దారుణ సంఘటన జులై 2న బిష్ణుపూర్ జిల్లాలో చోటుచేసుకంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మైతీ వర్గానికి చెందిన వారు దారుణంగా చంపారు. డేవిడ్ థీక్ అనే వ్యక్తి తల నరికి.. ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు అతడి తలను వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
26GB RAM స్టోరేజ్ తో కొత్త స్మార్ట్ లాంచ్..ధర?
ప్రముఖ కంపెనీ ఇన్ఫినిక్స్ కంపెనీ వచ్చే నెలలో ఏకంగా 26GB ర్యామ్‌తో హై-ఎండ్ ఫోన్ తీసుకురావడానికి సిద్ధమైంది. ఇన్ఫినిక్స్ GT 10 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ అప్‌కమింగ్ మొబైల్‌లో 26GB ర్యామ్ ఉంటుందని లేటెస్ట్ టెక్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.. ఇప్పటివరకు ఈ స్టోరేజ్ తో ఒక్క ఫోన్ కూడా మార్కెట్ లోకి రాలేదు.. మొదటి ఫోన్ ఇదే.. ఈ మొబైల్ మల్టీ టాస్కింగ్, మొబైల్ గేమింగ్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్తుందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ సరిగా ఉంటే ఈ ఫోన్ మొబైల్ ఇండస్ట్రీలో ప్రభంజనాన్ని సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు.. ఈ ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్ వేసుకోండి.. నథింగ్ ఫోన్ సిరీస్ మాదిరిగానే ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ఫోన్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో లాంచ్ అవ్వనుందని సమాచారం.. ఇది ఇలా ఉండగా..Nubia కంపెనీ 24 GB తో మార్కెట్ లోకి ఫోన్ ను లాంచ్ చేసింది..కాగా ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని సమాచారం. GT 10 ప్రో సూపర్-ఫాస్ట్ 240W వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందట..టాప్-ఎండ్ వేరియంట్ 26GB RAMతో పాటు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆఫర్ చేస్తుందని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.. అయితే ఈ కంపెనీ ఇప్పటివరకు బడ్జెట్ తో ఉన్న ఫోన్ లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది..GT 10 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌తో రావచ్చని మరికొన్ని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ఇది హై-ఎండ్ చిప్ కాకపోవడం గమనార్హం.. ఇకపోతే Infinix GT 10 Pro ధర ఇండియాలో దాదాపు రూ.30,000గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
డ్రిల్ మెషిన్‌తో తలకు రంధ్రం.. మెదడుకు శస్త్రచికిత్స..!
ఓ డ్రిల్ మిషన్ సాయంతో. వినడానికి భయంకరంగా ఉన్న తానకు తానే డ్రిల్ మిషన్ తో రంధ్రం చేసుకుని సర్జరీ చేసుకున్నాడు. రష్యాకు చెందిన మైఖేల్ రాదుగా అనే శాస్త్రవేత్త తన వింత ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన బ్రెయిన్ సర్జరీని తానే చేయించుకున్నాడు. ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. అతను తన మెదడులో చిప్ ఉంచాడు. ఆ చిప్ సహాయంతో అతను తన కలలను నియంత్రించుకోగలనని పేర్కొన్నాడు. షాకింగ్ విషయం ఏమిటంటే.. మైఖేల్‌కు న్యూరోసర్జరీకి సంబంధించిన ఏబీసీడీ కూడా తెలియదు. అయినప్పటికీ.. అతను తన గదిలోనే సర్జరీ చేసుకున్నట్లు తెలిపాడు. ఆ సర్జరీ చేయడానికి మైఖేల్ కు 10 గంటలు పట్టింది. అంతేకాకుండా ఒక లీటరు రక్తం పోయినట్లు ఆయన చెప్పారు. తనకు న్యూరో సర్జరీకి సంబంధించి ఏమీ తెలియనప్పటికీ.. డ్రిల్ మెషీతో తన తలకు రంధ్రం చేసి చిప్‌ను అమర్చారు.
బేబీ మూవీ వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. చేసి ఉంటేనా.. ?
బేబీ.. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక నిన్ననే ఈ సినిమాను అల్లు అర్జున్.. ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశంసించాడు. ఇక్కడవరకు బాగానే ఉన్నా.. ఈ సినిమా గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా ఒక సినిమాకు ఎంతోమంది నటీనటులను అనుకుంటారు.. కొంతమంది తమకు కథ నచ్చక, ఇంకొంతమంది డేట్స్ అడ్జెస్ట్ అవ్వక.. ఇంకొంతమంది తమ ఇమేజ్ ను కాపాడుకోవడానికి కొన్ని పాత్రలు చేయం అని చెప్పుకొస్తారు. అలా బేబీ సినిమాను కూడా లోక స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు అని డైరెక్టర్ సాయి రాజేష్ మీడియా ముందే చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరో పేరు చెప్పకపోవడంతో అందరు లైట్ తీసుకున్నారు. ఇక నేడు విశ్వక్ సేన్.. వేసిన ట్వీట్ వైరల్ కావడంతో సాయి రాజేష్ మాట్లాడింది విశ్వక్ గురించే అని క్లారిటీ వచ్చేసిందని చెప్పుకొస్తున్నారు. బేబీ సినిమాలోని విరాజ్ పాత్రకు ముందు విశ్వక్ ను అనుకున్నారట. సాయి రాజేష్.. విశ్వక్ ను సంప్రదించడం, ఆయన నో అని చెప్పడంతో అక్కడితో సమస్య ముగిసిపోయింది. కానీ, సినిమా హిట్ అయ్యేసరికి డైరెక్టర్.. ఒక హీరో ఈ సినిమాను వద్దు అన్నాడు.. కథ కూడా వినకుండానే.. వీడితో సినిమా చేసేది ఏంటి అన్నట్లు మాట్లాడాడు అని చెప్పుకొచ్చాడు. ఇక దీనికి రియాక్ట్ అయినా విశ్వక్.. నో అంటే నో .. అరవడం ఎందుకు.. కూల్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అని చెప్పుకొచ్చాడు. దీంతో విరాజ్ పాత్రకు ముందుగా విశ్వక్ ను అనుకున్నట్లు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే.. ఆ పాత్ర కనుక విశ్వక్ చేసి ఉంటే .. అతని ఇమేజ్ డ్యామేక్ అయ్యేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
ఓటీటీలోకి వచ్చేసిన ‘’వీజే సన్నీ’’ అన్ స్టాపబుల్
పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం, ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన ఈ సినిమాలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించారు. జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన తెచ్చుకోగా IMDB లో 7.8 రేటింగ్ , బుక్ మై షో లో 8.2 రేటింగ్ రాబట్టుకుంది. ఇక తాజాగా ఈ ‘అన్ స్టాపబుల్’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీం అవుతోంది. సో ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటిటిలో చూసి ఎంజాయ్ చేయవచ్చన్న మాట. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు నిర్మించిన మొదటి సినిమా అన్ స్టాపబుల్ కాగా త్వరలో మరిన్ని మంచి సినిమాలతో నిర్మాత రంజిత్ రావ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ధమాకా’ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మ్యూజిక్ అందచగా డీవోపీ గా వేణు మురళీధర్, ఎడిటర్ గా ఉద్ధవ్ పని చేశారు.