పవన్ కల్యాణ్ ఊసరవెల్లి.. ఢిల్లీలో యాక్టింగ్ చేస్తున్నాడు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.. పవన్ కల్యాణ్ ఢిల్లీలో సినిమా యాక్టింగ్ చేస్తున్నాడంటూ ఎద్దేవా చేసిన ఆయన.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పాసిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించిన పవన్.. ఇప్పుడు ఎన్డీఏలో ఎందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీని తిట్టి 2019లో ఒంటరిగా పోటీ చేసి, 2024లో ఎందుకు ఏన్డీఏను కలుపుకొని వెళ్తున్నారో చెప్పాలని నిలదీశారు. పవన్ కల్యాణ్ తాజా కామెంట్లు, ఢిల్లీ పర్యటన, ఎన్డీఏ కూటమికి సమావేశానికి హాజరు కావడంపై ఎన్జీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపివేత, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. ఏమైన సాధించారా..? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇక, పవన్ కల్యాణ్ ఊసరవెల్లి.. రోజుకొక మాట మాట్లాడతారని ఆరోపించారు. ఆంధ్రాలో భోజనం చేసి తెలంగాణలో నిద్రపోయే వ్యక్తులు పవన్ కల్యాణ్, చంద్రబాబు అంటూ విమర్శించారు. ఆంధ్రాలోనే ఉంటూ రాష్టాన్ని అభివృద్థి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
ఉమ్మడి పౌరస్మృతిపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code)పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. దీనిని చాలా పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. ఎన్డీఏ పక్షాలు మద్దతు పలుకుతున్నాయి.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో ఉమ్మడి పౌరస్మృతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ఈ రోజు సమావేశం అయ్యారు సీఎం.. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురి కావాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు. మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. ఉమ్మడి పౌరస్మృతి అంశంమీద డ్రాఫ్ట్ అనేది ఇప్పటివరకూ రాలేదు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ, మీడియాలో, పలుచోట్ల చర్చ విపరీతంగా నడుస్తోంది. వాటిని చూసి ముస్లింలు పెద్దస్థాయిలో తమ మనోభావాలను వ్యక్తంచేస్తున్నారు.. అయితే, కొన్ని అంశాలను మీ అందరి దృష్టికి తీసుకు వస్తున్నాను.. ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటేగనుక ఏం చేసేవారన్నదానిపై మీరు ఆలోచనలు చేసి నాకు సలహాలు ఇవ్వండి. ఇక్కడ ఇంకో విషయాన్నికూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రచారం నడుస్తోంది. ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలని సూచించారు.
తెలంగాణలో మరో 1654 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
తెలంగాణ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. గతంలో కూడా వరుస నోటిఫికేషన్ లను విడుదల చేసింది ప్రభుత్వం.. ఇప్పుడు కూడా వరుస ప్రభుత్వ శాఖలకు సంబందించిన వాటిల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు .. ఈ మేరకు నిరుద్యోగుల పాలిట ఆపన్న హస్తం అవుతుంది.. రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నియామక మార్గదర్శకాలను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం ఒక్కో పీరియడ్ నిమిత్తం రూ.390 చెల్లిస్తుంది. నెలకు 72 పీరియడ్లకు మాత్రమే అనుమతిస్తుంది. దీంతో వారికి రూ.28,080 చొప్పున వేతనం అందుతుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వం లో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా నియామక కమిటీని ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లో కాలేజీల వారీగా ఖాళీలను ఈ నెల 19న వెల్లడిస్తారు. 24వ తేదీ లోగా అన్ని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జులై 26వ తేదీన దరఖాస్తులను పరిశీలించి మెరిట్ అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు.. ఇక వచ్చే నెల 1 నుంచి సెలెక్ట్ అయిన కాలేజీలకు రిపోర్ట్ చెయ్యాల్సి ఉంది.. అప్పటి నుంచే కాలేజీలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇకపోతే తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. TSPSC Group 1 ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.3 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. ఈ వారాంతంలో విడుదలయ్యే అవకాశం ఉంది.. వీటితో పాటు పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే పనిలో ఉంది తెలంగాణ సర్కార్..
పప్పు అన్నారు, ఇప్పుడదే రాహుల్ పప్పా అయ్యాడు.. వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు
ఇన్నాళ్లూ పప్పు అంటూ ఎవరినైతే అవహేళన చేశారో, ఇప్పుడదే రాహుల్ గాంధీ అందరికీ పప్పా అయ్యాడంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు. దేశంలో రాహుల్‌గాంధీ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ OBC నాయకుల సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో చిన్న చిన్న కోపాలు, గొడవలు ఉన్నాయన్న మాట వాస్తవమేనని అన్నారు. సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలున్నాయని పేర్కొన్నారు. సీనియర్‌పై జూనియర్ పెత్తనం చెలాయిస్తానంటే ఊరికే ఉంటారా? తమ పార్టీలోని లొల్లి కూడా అలాంటిదేనని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలను కేసీఆర్ బంగాళాఖాతంలో వేస్తానని అంటున్నారని.. జనం నిన్నే బంగాళాఖాతంలో వేస్తారని వీహెచ్ పేర్కొన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే.. నాంపల్లి దర్గా దగ్గర ‘అల్లాకే బాబా దేదో’ అంటూ అడుక్కునేవాడివి అని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టినోనికి కేసీఆర్ సున్నం పెడతాడని విమర్శించారు. ఈసారి రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతాడని, లేకపోతే తన పేరు హనుమంతరావు కాదని ఛాలెంజ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అదానికి, మోడీకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తే.. రాహుల్‌పై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. నేతలు కాంగ్రెస్‌లో ఉంటే అవినీతిపరులు, బీజేపీలో చేరితే సత్యహరిశ్చంద్రులా? అని నిలదీశారు. త్వరలోనే బీసీ గర్జన పెడతామని.. ఇందుకు థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఒప్పుకున్నారని తెలిపారు.
ఢిల్లీ మెట్రోలో యువతి విన్యాసాలు.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..
ఢిల్లీ మెట్రో అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాపులారిటీ కోసం కొందరు యువత ఇలాంటి ఆకతాయి పనులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇదే కోవలో ఢిల్లీ మెట్రోలో ఓ యువతి చేసిన పనిపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఆ వీడియోలో. రన్నింగ్‌లో ఉన్న మెట్రోలో యువతి ఇంట్లో చేసినట్లు ఎక్సర్‌సైజులు చేయడం మనం చూడొచ్చు. ట్రైన్‌లో ఉన్న మిగతా ప్రయాణికులు ఆమెను చూస్తున్న కూడా తన విన్యాసాలు ఆపలేదు. ఆ సమయంలో తీసిన వీడియోను ‘కాలిస్టెనిక్స్ ఇన్ పబ్లిక్’ క్యాప్షన్‌తో ఒకరు సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో మెట్రోలో యువతి చేసిన విన్యాసాల తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇలాంటివి ఇంట్లో చేసుకోవాలి. పబ్లిక్‌లో ఏంటీ న్యూసెన్స్’ అంటూ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.. ఇక మెట్రో అధికారులు కూడా ఆ యువతి పై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
సినిమా ప్రమోషన్స్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా..?
విజయ్ దేవరకొండ, సమంత జంట గా నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి అయింది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.గత ఏడాది విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తీవ్రం గా నిరాశ పరిచింది..విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలవడం తో ప్రస్తుతం చేస్తున్న ఖుషి సినిమా పైనే విజయ్ దేవరకొండ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. ఖుషి సినిమా ను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే విడుదల అయిన పాటలు.మరియు పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు చాలా ఉన్నాయనీ తెలుస్తుంది.. అందుకే ఖుషి సినిమా ను భారీ ఎత్తున ప్రమోట్ చేయాలని విజయ్ దేవరకొండ అభిమానులు కూడా కోరుతున్నారు.కానీ సమంత మయోసైటీస్ డిసీజ్ కు మరోసారి ట్రీట్మెంట్ తీసుకోవడానికి విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం.దాంతో ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఆమె హాజరు అవ్వదని తేలిపోయింది. అంతే కాకుండా ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమాకు కాస్త ముందు గానే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నట్లు సమాచారం.చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఆగస్టు 15 నుండి షురూ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.. సినిమా కు సంబంధించిన మొదటి ప్రమోషనల్ మీడియా మీట్ ను ఆగస్టు 15 సందర్భంగా ఏర్పాటు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. అదే సమయం లో సినిమా కి సంబంధించిన ఒక కీలకమైన ఒక వీడియోను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 1వ తేదీన ఖుషి సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ నేపథ్యం లో ప్రమోషన్ కార్యక్రమాలు కేవలం రెండు వారాలు మాత్రమే చేస్తే ఎలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
చరణ్ కూతురుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ముందు నుంచే చాలా క్లోజ్‌గా ఉండేవారు. కాకపోతే ట్రిపుల్ ఆర్ సినిమాతో వీళ్ల ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసింది. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన సమయంలో ఈ ఇద్దరు చేసిన రచ్చ మామూలుగా లేదు. స్టేజీ పైనే రాజమౌళితో కలిసి ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. అలాగే ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందో చెప్పి ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఈ ఇద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఇద్దరు కూడా ఒకేసారి పాన్ ఇండియా మరియు గ్లోబల్ ఈమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. శంకర్‌తో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తుండగా.. కొరటాల శివతో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఎంత బిజీగా ఉన్నా సమయం వచ్చినప్పుడల్లా చరణ్, తారక్ కలుస్తునే ఉంటారు. అయితే ఇటీవల రామ్ చరణ్‌కి కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 10ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మెగా ప్రిన్సెస్‌కి క్లింకారా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్, ఉపాసనల గారాల పట్టికి ఎన్టీఆర్ ప్రత్యేకమైన కానుకను పంపించారట. చరణ్, ఉపాసన, క్లీంకార… ముగ్గురి పేరుతో ఉన్న గోల్డ్ డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి గిఫ్ట్‌గా పంపించారని తెలుస్తోంది. ఆ గిఫ్ట్‌ను తారక్ పిల్లలు అభయ్, భార్గవ్ రామ్‌లు ఎంతో ఇష్టంగా క్లింకారకు అందించినట్లు సమాచారం.