మోడీ, కేసీఆర్, రాహుల్ గాంధీని ఢీ కొట్టేది నేనే..
సంగారెడ్డిలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ నెల 20న సంగారెడ్డి అభివృద్ధిపై చర్చ పెడుతానని కామెంట్స్ చేశారు. సదాశివపేటలో 1200 ఎకరాలలో చారిటీ సిటీ కట్టాను.. సంగారెడ్డిలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు.. చారిటీ సిటీని చూసి దేశ విదేశ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారు.. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేసి నా చారిటీ మూయించారు అని కేఏ పాల్ తెలిపారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ తొత్తు.. తొమ్మిది ఏళ్లలో ఏనాడు జగ్గారెడ్డిని నేను శపించలేదు అని కేఏ పాల్ అన్నారు. జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నా.. సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా పార్టీలో చేరు అని ఆయన చెప్పారు. అయితే, ఇప్పటి వరకు జగ్గారెడ్డిని క్షమించాను.. ఇక నుంచి క్షమించను.. వెయ్యి కోట్లు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీలో చేరుతావా.. అభివృద్ధి చేసే నా పార్టీలో చేరుతావా తేల్చుకో అని పాల్ తెలిపాడు. ఎన్ని సీట్లు వచ్చిన వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అని కేఏ పాల్ అన్నారు. పొత్తులు పెటుకోవడానికి ఇతర పార్టీలు నా దగ్గరికి వస్తున్నాయి.. కానీ నాకు ఇప్పుడు పొత్తుల ఆలోచన లేదు.. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా నిలబడమని చెబితే పోటీ చేస్తా.. నన్ను గెలిపించి సీఎం చేస్తే అభివృద్ధి చేస్తా.. కేసీఆర్, గద్దర్ బతికి ఉన్నప్పుడు ఏనాడు పట్టించుకోలేదు..గద్దర్ చచ్చిపోతే అన్ని పార్టీల నాయకులు కుక్కల్లాగా వాలిపోయారు కేఏ పాల్ కామెంట్స్ చేశాడు.
ఫైబర్ గ్రిడ్‌లో ప్రభుత్వం నూతన విధానం.. టార్గెట్ అదే..
ఫైబర్ గ్రిడ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చిందన్నారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి.. ఫైబర్ గ్రిడ్‌లో నూతన విధానంతో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం అందించడం ప్రధాన ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. గ్రామ స్ధాయిలో సైతం ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సేవలకు విఘాతం కలగకుండా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 900 సబ్ స్టేషన్లలో రాష్ట్ర వ్యాప్తంగా APSFL షల్టర్లు ఏర్పాటు చేస్తామని.. ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.. ఇక, ఎంఎస్‌వోలకు అధిక లాభం చేకూరేలా చేస్తున్నాం.. ఇప్పటికే ఎంఎస్‌వోలు, డిస్ట్రిబ్యూషన్‌లతో సమావేశం నిర్వహించినట్టు వెల్లడించారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి.
నువ్వేం నిజాం సర్కార్ వు కాదు.. డిసెంబర్ వరకే మీకు అధికారం
నిర్మల్ పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, జీఓ 220ని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష కార్యక్రమానికి బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. అయితే, ఈ సభను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ వచ్చాక కొత్తరూపం ఎత్తారు.. భూములు అమ్ముకొని బ్రోకర్ గా మారారని ప్రజలు అనుకుంటున్నారు.. జోన్ కన్వర్ట్ చెయ్యడం.. అసైన్డ్ భూములు లాక్కోవడం.. పరిశ్రమల పేరుతో భూములు సేకరించడం పేరుతో కేసీఆర్ భూములు పేదవారి చేతిలో లేకుండా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువచ్చేది ప్రతిపక్షాలు అని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలకు విశ్వాసం కలిగించేది మేము.. కానీ, కేసీఆర్ మాత్రం చక్రవర్తిలాగా, నిజాం సర్కార్ లాగా వ్యవహరిస్తూ.. నేను యజమానినీ ప్రజలు జీతగాళ్లు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ 5,800 ఎకరాలు పేదలకు ఇచ్చిన భూములు కేసీఆర్ లాక్కొన్నాడు. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిందని రోజు వార్తలు వస్తున్నాయి.. బడంగ్‌పేట్లో ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన భూములలో 24 ఎకరాల భూమి గుంజుకున్నారు. ఒక్కో ఎకరం 20 కోట్ల విలువ చేస్తుంది అని ఆయన ఆరోపించారు.
భారీగా బాకీ పడిన ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు… నోటీసులు జారీ చేయనున్న కేంద్రం
ఆన్‌లైన్ గేమింగ్ కు సంబంధించి జీఎస్టీని మార్చడంతో ఆ సంస్థలు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆ సంస్థలు భారీగా బకాయి పడ్డాయి. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు చెల్లించాల్సిన పన్ను బాకీలు దాదాపు 45,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నెల 11న ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, క్యాసినోలలో బెట్టింగ్‌ల పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017 మరియు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017కి సవరణలు కోరుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా 2017 నుంచి పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐటీ) ఆన్‌లైన్ గేమింగ్ సంస్థల పన్నుల మదింపు చేసింది. దీని ద్వారా 28 శాతం జీఎస్టీ చెల్లించకుండా కొన్ని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు తమ సేవలు నైపుణ్యం ఆధారిత కార్యకలాపాలకు సంబందించినవని వాదించగా నైపుణ్యం ఆధారిత గేమింగ్స్‌కు 18 శాతం జీఎస్టీని వసూలు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ విషయంలో పన్నును అవకాశం ఆధారితంగానా లేక నైపుణ్యం ఆధారితంగా వర్గీకరించాలా అన్నదానిపై చాలా కాలం చర్చ జరిగింది. పైన పేర్కొన్న విధంగా కొన్ని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు తమ సేవలు నైపుణ్యం ఆధారిత కార్యకలాపాలకు సంబందించి వాదించి కేవలం 18 శాతం జీఎస్టీని మాత్రమే చెల్లించాయి. అయితే ఈ మధ్యే పార్లమెంట్ ఈ బిల్లును సవరించడంతో అవి కూడా మొత్తం 28 శాతం జీఎస్టీని చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన చూస్తే న్‌లైన్ గేమింగ్ సంస్థలు దాదాపు రూ. 45,000 కోట్లు బకాయి పడినట్లు కేంద్రం తెలిపింది.
గాల్లో ఉన్న విమానంలో పైలట్ మృతి.. తర్వాత ఏం జరిగింది..?
ప్రమాదవశాత్తు గాల్లో ఉన్న విమానంలో పైలట్ మృతిచెందాడు. బాత్రుమ్ కు అని వెళ్లిని ఆ పైలట్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కో పైలట్ అలర్ట్ అయి ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అయినప్పటికీ పైలట్ చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళ్తున్న లాటామ్ ఎయిర్ లైన్స్ లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానంలో టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత పైలట్ ఇవాన్ అందౌర్(56) అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి బాత్రూమ్ కు వెళ్లాస్తానని కో పైలట్ తో చెప్పి వెళ్లాడు. అయితే అతను ఎంతకూ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా.. బాత్రూంలో కుప్పకూలిపోయి ఉన్నాడు. విమానంలో సిబ్బంది అతనికి అత్యవసర చికిత్స అందించారు.. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. అయితే పైలట్ ఆరోగ్య పరిస్థితిని గమనించిన కో పైలట్ టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జె్న్సీ ల్యాండింగ్ చేశాడు. వెంటనే పైలట్ ఇవాన్ ను వైద్య బృందం పరిశీలించగా.. అప్పటికీ అతను చనిపోయినట్లు గుర్తించారు. మరోవైపు ఆ విమానంలోని ప్రయాణికులను ఓ హోటల్ లో ఉంచి వసతి కల్పించిన అధికారులు.. మంగళవారం తిరిగి విమాన కార్యకలాపాలను ప్రారంభించారు.
ఉద్యోగాల జాతర.. ఈ ఏడాది 50 వేల కొత్త కొలువులు..!
ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాదు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం పాకులాడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు.. చవువును పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం వేట మొదలుపెడుతున్నారు.. అయితే, నిరుద్యోగులకు శుభవార్త.. పూర్తి స్థాయి ఉద్యోగాలు కాకపోయినా.. ఈ ఏడాది ద్వితీయార్థంలో 50 వేలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.. పండుగల సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.. ఇక, ఈ తరుణంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ , క్రెడిట్-కార్డ్ అమ్మకాలు, పర్సనల్ ఫైనాన్స్ వంటి రంగాల్లో ఉద్యోగాల పెరుగుదలను ఆశిస్తున్నాయి. వీటి వల్ల కొత్త ఉద్యోగాలు భారీ సంఖ్యలు సృష్టిస్తారని.. నివేదికలు చెబుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. ఈ ఏడాది ద్వితీయార్థంలో దాదాపు 50వేల తాత్కాలిక ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు అంచనాలున్నాయి.. ఆయా సంస్థలు కూడా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడాయికి ఆసక్తి చూపుతున్నాయని.. గత ఏడాదికంటే ఈ సంవత్సరం ఆయా రంగాల్లో ఉద్యోగాలు 15 శాతం పెరుగుతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. స్టాఫింగ్ కంపెనీ టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, ఈ క్యాలెండర్ ఇయర్ రెండవ సగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో దాదాపు 50,000 తాత్కాలిక ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. BFSI రంగం ఇప్పటికే క్రెడిట్ కార్డ్ అమ్మకాలు, వ్యక్తిగత ఫైనాన్స్, రిటైల్ భీమా, పెరిగిన వినియోగదారుల వ్యయం మరియు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం కారణంగా గణనీయమైన పెరుగుదలను చూస్తోంది.
వెస్పా’ కొత్త మోడల్… ధర వింటే దిమ్మ తిరగాల్సిందే
వెస్పా.. స్కూటీలలో దీనికి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. దీనికి ఉండే లుక్ ఇది ఇచ్చే కంఫర్ట్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. అందుకే అమ్మాయిలు ఇదంటే పడి చచ్చిపోతుంటారు. అబ్బాయిలకు బులెట్ బండి అంటే ఎలా పిచ్చి ఉంటుందో అమ్మాయిలకు కూడా వెస్పా అంటే కూడా అలానే ఉంటుంది. దీని స్మూత్ డ్రైవింగ్ అందరికి భలే నచ్చుతుంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో సంస్థ వీటిని తయారు చేస్తుంది. ఇది ఇటలీకి చెందిన అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ. అయితే ఈ కంపెనీ తాజాగా కొత్త మోడల్ ను ఇండియన్ మార్కెట్ లోకి తెచ్చింది. ‘జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్’ పేరుతో దీన్ని లాంచ్ చేసింది పియాజియో సంస్థ . దీని ధర తెలిస్తే సామాన్యులు మాత్రమే కచ్ఛితంగా అవక్కవుతారు. ఆ ధరతో ఓ చిన్నసైజ్ కారు కూడా కొనుక్కోవచ్చు. ఇంతకీ ‘జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్’ ధర ఎంతా అనుకుంటున్నారా? దాని ధర ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ. 6.45 లక్షలు అంట. అయితే దీనికి ఇంత ధర ఉండటానికి కారణంగా దీనికి ఉండే స్పెషల్ ఫీచర్స్ అంట. దీనిని కెనడా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఆలోచనలకు అనుగుణంగా డిజైన్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. బీబర్ అంటే తెలియని వారుండరు, అతని పాటలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే దీని కోసం బీబర్ తో పియాజియో సంస్థ అగ్రిమెంట్ చేసుకుందని సమాచారం. ఇది పరిమిత ఎడిషన్ అని లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే ఈ స్కూటీలను విక్రయిస్తామని సంస్థ తెలిపింది. అందుకే వీటికి ఇంత ధరను నిర్ణయించింది.
అలా చేయద్దు అనడానికి నువ్వెవరు?.. రేణు దేశాయ్ మరో సంచలనం
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ అభిమానుల మధ్య వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తన సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటున్న రేణు దేశాయ్ మీద ఎవరు కామెంట్ చేసినా వెంటనే వాటికి ఆమె కౌంటర్లు ఇస్తోంది. తాజాగా ఒక పవన అభిమాని ప్లీజ్ అమ్మ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండి అంటూ కామెంట్ పెట్టినందుకు ఆమె అతనికి వరుసగా కౌంటర్లు ఇచ్చింది.. అసలు నేను సోషల్ మీడియా నుంచి ఎందుకు దూరంగా ఉండాలి? నేనేమైనా క్రిమినల్ పనులు, తప్పుడు పనులు చేస్తున్నానా? సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండడానికి.. లేదా భావ ప్రకటన స్వేచ్ఛ మీకు మాత్రమే ఉందా నాకు లేదా? నేను ఈ డెమోక్రటిక్ దేశానికి చెందిన దాన్ని కాదా? అంటూ ఆమె వరుస ప్రశ్నలు సంధించింది. ఈ ఇంస్టాగ్రామ్ నా పర్సనల్ అకౌంట్, మీరు నా పర్సనల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కింద కామెంట్ పెట్టి నన్ను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండమంటారా? నేను ఇకమీదట సైలెంట్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నానని ఆమె అన్నారు. నా మాజీ భర్త గురించి నిజమే మాట్లాడాను అలాగే ఆయన్ని సపోర్ట్ చేసే నిర్ణయం కూడా నాదే, ఈ విషయంలో ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా వినేది లేదు అని అర్థం వచ్చేలా ఆమె కామెంట్ చేశారు. అలాగే ఇంస్టాగ్రామ్ సెట్టింగ్స్ జనాలు కామెంట్ చేయడానికి అనుమతి ఇచ్చేలా ఉన్నాయి కానీ ఇది నా పర్సనల్ స్పేస్. పాలిటిక్స్ గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ ఎలాంటి సంబంధం లేని నా మీద ఎందుకు వారి పర్సనల్ ఒపీనియన్స్ తెచ్చి రుద్దుతున్నారు. నిజానికి చాలా మంది సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోమని నాకు సలహా ఇచ్చారు. ఇప్పటికే నేను ట్విట్టర్ డిలీట్ చేశాను, ఫేస్బుక్ వాడడం లేదు. ఇప్పుడు ఈ ఇంస్టాగ్రామ్ కూడా డిలీట్ చేయాలా? అసలు ఇందులో నా తప్పేంటి అంటూ ఆమె ప్రశ్నించారు.
కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రెజీనా..
కాస్టింగ్ కౌచ్ గురించిషాకింగ్ వ్యాఖ్యలు చేసింది రెజీనా.. తాను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం నేను కొంత మందిని అప్రోచ్ అయ్యాను. వారిలో ఒకరు ఫోన్ చేసి నాకు సినిమా ఛాన్స్ ఇస్తామనని చెప్పారు. కానీ అడ్జస్ట్ మెంట్ కు ఓకే అంటేనే తర్వాత షూటింగ్ పని చూసుకోవచ్చని వారు అన్నారు. ముందు నాకు అతని అంటున్న మాటలు అస్సలు అర్థం కాలేదు.అప్పటికీ నాకు అడ్జస్ట్ మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఏదో రెమ్యునరేషన్ విషయం మాట్లాడుతున్నారేమో అని, నా మేనేజర్ మీతో మాట్లాడుతారు అని నేను ఫోన్ కట్ చేశాను. ఇది దాదాపు పది సంవత్సరాల ముందు జరిగింది.. అప్పుడు నాకు 20 ఏళ్ల వయస్సు ఉంటుంది.’ అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెజీనా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
లావణ్యతో సీక్రెట్ లవ్ స్టోరీ.. ఎట్టకేలకు బయటపెట్టిన మెగా ప్రిన్స్
గాండీవధారి అర్జున ప్రమోషన్స్ లో వరుణ్ తన లవ్ స్టోరీని బయటపెట్టాడు. ” లావణ్య నాకు ఐదేళ్లుగా పరిచయం. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు.. అందులో లావణ్య ఒకరు. చాలాకాలం ఫ్రెండ్స్ గానే ఉన్నాం. ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నాం.. ఇక ఈ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయించుకున్నాం. ముందు నేనే.. లావణ్యకు ప్రపోజ్ చేశా. ఆ తరువాత ఇంట్లో చెప్పాము. వారు ఒప్పుకోవడంతో నిశ్చితార్థం వరకు వెళ్లిపోయాం. ఇక లావణ్య చాలా కేరింగ్ పర్సన్. నాకు ఎన్నో గిఫ్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ కూడా ఆ గిఫ్ట్స్ లో ఒకటి. నాకు ఏది ఇష్టం అనేది ఆమెకు తెలుసు.. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. నాకు సోషల్ మీడియాలో అన్ని పంచుకోవాలని ఉండదు. అందుకే చాలా రేర్ గా కనిపిస్తా.. నా నిశ్చితార్థం లానే పెళ్లి కూడా చాలా సింపుల్ గా చేసుకుంటాం” అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా వరుణ్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.
మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క మృతి చెందింది. ఈ మధ్యకాలంలో కుక్కలను కూడా యజమానులు ఇంట్లో మనుషులుగా భావిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ కుక్కలను మరింత ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్లినా వాటిని కూడా తీసుకెళ్తుంటారు. ఒకవేళ అవి కనుక మృతి చెందింతే.. తమ కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు బాధపడతారు. తాజాగా సితార కూడా అలాంటి భాదనే అనుభవిస్తుంది. సితార పుట్టిన తరువాత మహేష్ ఇంట్లోకి ప్లూటో అనే కుక్కపిల్ల ఎంటర్ అయ్యింది. ఇక సితార పెరిగేకొద్దీ దానితోనే ఆటలు ఆడుతూ కనిపించేది. సీతూ పాప ఎక్కడికి వెళ్లినా ప్లూటో పక్కన ఉండాల్సిందే. ఇక ఏడేళ్లు ఎంతో ఆరోగ్యంగా జీవించిన ప్లూటో తాజాగా మృతి చెందిందని సితార చెప్పుకొచ్చింది. ప్లూటో ఫోటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ అయ్యింది. ” మేమందరం నిన్ను మిస్ అవుతున్నాం.. 7 ఏళ్లు మాతో ఉన్నావు.. నువ్వు బెస్ట్” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ పై నమ్రత రిప్లై ఇస్తూ.. ” అతను ఎప్పుడు మన గుండెల్లో, ప్రార్థనలో ఉంటాడు” అంటూ సీతారాను ఓదార్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక డాగ్ లవర్స్.. రిప్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.