చంద్రబాబు, ఆయన కొడుకు శిక్ష అనుభవించక తప్పదు..
చంద్రబాబును ప్రజా కోర్టులోకి ఈడుస్తాం.. అక్కడ సమాధానం చెప్పాలి.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ శిక్ష అనుభవించక తప్పదు అని హెచ్చరించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక బ్యాక్ డోర్ పొలిటీషియన్ అని దుయ్యబట్టారు. నారావారిపల్లి నుంచి జూబ్లీహిల్స్ భవంతి వరకు అవినీతి పునాదులు మీద నిర్మించారని సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. రూ.118 కోట్లు లంచం తీసుకున్నారని ఆదాయపన్ను శాఖ చెబుతుంటే చంద్రబాబు ఎందుకు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. అన్నా హజారే అనుచరుడు.. గాంధీజీ తమ్ముణ్ణి అని చెప్పుకునే చంద్రబాబు.. తనపై లంచగొండి ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇక, ఆదాయపన్నుశాఖ తీగ లాగితే చంద్రబాబు డొంక కదలడం ఖాయం అన్నారు మంత్రి అమర్నాథ్.. రాష్ట్రం ఆస్తులు, ప్రజాధనం ఎలా దోపిడీకి గురైందో మొత్తం లెక్కలు బయటకు రానున్నాయన్న ఆయన.. ఐటీ శాఖ 46 పేజీలు షోకాజ్ నోటీసు ఇస్తే.. తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించాడు.. నోటీసులు వచ్చిన ప్రతీసారీ పొంతన లేని లేఖలు రాసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎలా..? అని ఫైర్ అయ్యారు. అమరావతిలో దొంగతనం చేసి.. జ్యురిడిక్షన్ కాదని ఐటీ శాఖతో వితండ వాదన చేస్తున్నారని విమర్శించారు. మనోజ్ వాస్ దేవ్ పార్ధసాని అనే వ్యక్తి ద్వారా సబ్ కాంట్రాక్టు ద్వారా లంచాలు ఎలా తీసుకున్నారో ఐటీ అధికారులు రాబట్టారు.. 2016 నుంచి ఎంవీపీకి చంద్రబాబు కార్యాలయంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. CRDA, హైకోర్టు, టిడ్కో ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల దగ్గర నుంచి ముడుపులు అందాయని.. కోట్లు అంటే అందరికీ తెలుస్తామని టన్నులు అనే కోడ్ లాంగ్వేజ్ వాడారని.. చంద్రబాబే కాదు ఆయన కొడుకు పేరు ఐటీ జాబితాలో ఉందన్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను నేను అలా అనలేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి రోజా
రజనీకాంత్ వాఖ్యలపై తాను విమర్శలు చేయలేదు.. ఖండించాను అని వివరణ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. రజనీకాంత్ ఎవరినో ఉద్దేశించి చేసిన వాఖ్యలను మాకు అపాదిస్తూ సోషయల్ మీడియాలో ట్రోల్ చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ఇక, లోకేష్ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో మోరుగుతున్నాడు.. పవన్ కల్యాణ్ షూటింగ్ గ్యాప్ లో చంద్రబాబు ఫ్యాకేజిని తీసుకోని విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అని నిలదీశారు. మరోవైపు.. అమరావతిలో అక్రమాలకు పాల్పడిన డబ్బులను బ్రహ్మిణి, భువనేశ్వరి లెక్కల్లో పెట్టారు.. చంద్రబాబు, లోకేష్ ని విచారించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. టీడీపీ కొత్త పాలకమండలిపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. కేసులు పెట్టగానే నేరచరిత్రులు కారు.. వారిని పాలకమండలిలో నియమిస్తే టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా.
ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోండి.. కౌంటర్ ఓపెన్ చేసిన బీజేపీ
తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది.. ఓవైపు జమిలి ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్నా.. మరోవైపు.. ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చు అనే ఉత్కంఠ నెలకొంది.. ఇక, ఒకే సారి 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన మరింత హీట్ పెంచారు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది.. దరఖాస్తుల స్వీకరించింది.. పోటీపడుతున్న ఆశావహుల పరిస్థితులను బేరీజు వేసి ఓ లిస్ట్ అధిష్టానికి పంపింది.. ఇక, ఎప్పుడైనా.. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తుందనే చర్చ సాగుతోంది. మరోవైపు.. బీజేపీకి కూడా అభ్యర్థుల ఎంపికకు సిద్ధమవుతోంది.. దీని కోసం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరిస్తోంది బీజేపీ.. ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.. ఇవాళ్టి నుంచి అంటే సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అయితే, ముఖ్యనేతలు దరఖాస్తు చేసుకుంటారా..? చేసుకుంటే ఏ నియోజక వర్గం నుండి అనేది ఆసక్తికరంగా మారగా.. మూడు పేజీల్లో అప్లికేషన్ ఫార్మ్ ట్ రూపొందించారు. పార్ట్ 1లో అభ్యర్థికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు.. పార్టీలో ఎప్పుడు చేరారు లాంటి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పార్ట్ 2లో గతంలో పోటీ చేస్తే ఆ వివరాలు పొందుపర్చాలి.. పార్ట్ 3లో ప్రస్తుతం పార్టీలో ఉన్న బాధ్యతలు.. పార్ట్ 4లో ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే.. ఆ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. మొత్తం మూడు పేజీలతో కూడా ఫారమ్ నింపి.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణలో కౌంటర్ ఇంఛార్జిలుగా మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, మల్లేష్ తదితరులను నియమించింది బీజేపీ.
“ఇండియా గెలవాలి”.. లేదంటే మణిపూర్, హర్యానా గతే..
ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ అనే పోడ్‌కాస్ట సిరీస్ తొలి ఎపిసోడ్ లో బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందూ భాషల్లో విడుదలైన ఈ సిరీస్ లో స్టాలిన్ మాట్లాడుతూ.. గత 9 ఏళ్లలో బీజేపీ ఏ హామీని నెరవేర్చలేదని అన్నారు. ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు జమచేస్తానని చెప్పడం, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందనే హామీ ఇవ్వడం, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవేవీ జరగలేదని స్టాలిన్ విరుచుకుపడ్డారు. భారతదేశం మొత్తం మణిపూర్, హర్యానాల కాకూండా నిరోధించాలంటే ‘ఇండియా కూటమి’ తప్పక గెలవాలని అన్నారు. మణిపూర్ జాతుల మధ్య ఘర్షణ, హర్యానా నూహ్ లో మతకలహాలను గురించి ప్రస్తావించారు. ప్రజలు ‘బహుళ సాంస్కృతిక, వైవిధ్యభరితమైన భారతదేశాన్ని రూపొందించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థల్ని స్నేహితులకు కట్టబెట్టడం, ఎయిర్ ఇండియాను అమ్మడాన్ని కప్పిపుచ్చుకునేందుకు మోడీ సర్కార్ మతవాదాన్ని ఆశ్రయించిందని ఆరోపించారు. పోర్టులు, విమానాశ్రయాలు తమకు దగ్గరగా ఉన్న కార్పొరేట్లకు మోడీ సర్కార్ కట్టబెట్టిందని విమర్శించారు.
విక్రమ్ ల్యాండర్ మరో ఘనత.. రెండోసారి చందమామపై ల్యాండింగ్.. ఇస్రో కొత్త వీడియో..
చంద్రయాన్-3 విజయవంతమైన చాలా రోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్ మరో ఘనత సాధించింది. చంద్రుడి ఉపరితలంపై నుంచి పైకి ఎగిరి రెండోసారి సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది. ఇటీవల ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిన దక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్ అయింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండైన ప్రదేశానికి ‘శివశక్తి’ పాయింట్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఆ సమయంలో ల్యాండ్ అయిన ప్రదేశం నుంచి 40 సెంటీమీటర్ల మేర పైకి లేకి, 30-40 సెంటీమీటర్ల దూరంలో మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఇస్రో వెల్లడించింది. బెంగళూర్ లోని కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాలు అందుకున్న విక్రమ్ తన ఇంజన్లను మండించి సురక్షితంగా పైకి ఎగిరి సేఫ్ ప్లేస్ లో ల్యాండ్ అయింది.
12 సిక్స్‌లతో వీరవిహారం.. 48 బంతుల్లో ‘బహుబలి’ సెంచరీ!
క్రికెట్‌లో అత్యంత భారీ కాయుడు, విండీస్ బహుబలి రకీం కార్న్‌వాల్ భారీ శతకంతో చెలరేగాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2023లో భాగంగా ఆదివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్‌రౌండర్ కార్న్‌వాల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసిన విండీస్ బహుబలి 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కార్న్‌వాల్ ఇన్నింగ్స్‌లో 12 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బార్బడోస్ రాయల్స్ బ్యాటర్ రకీం కార్న్‌వాల్ మొత్తంగా 48 బంతులు ఎదుర్కొని 102 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. టీ20 క్రికెట్‌లో కార్న్‌వాల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక సీపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన మూడో ఆటగాడిగా బహుబలి రికార్డుల్లోకెక్కాడు. కార్న్‌వాల్ కొట్టిన ఓ సిక్స్ ఏకంగా స్టేడియం బయట పడింది. 101 మీటర్లు వెళ్లిన ఆ సిక్స్ కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం బయట పడింది.
మీ దగ్గర చిరిగిన నోట్లు ఉన్నాయా? ఇలా సింపుల్ గా మార్చుకోవచ్చు..
ఆర్బీఐ ప్రకారం.. చిరిగిన నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారమ్ ఫిల్ చేయకుండానే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి 20 చిరిగిన నోట్లను మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా రూ. 5000 మించి ఉండకూడదు.. తక్కువ డ్యామేజ్ అయిన నోట్లకు అదే అమౌంట్ ను ఇస్తారు.. అలా కానీ పక్షంలో డ్యామేజ్ ఎక్కువగా అయితే మాత్రం పర్సంటెజ్ ప్రకారం డబ్బులను ఇస్తారు.. ఒకవేళా మీ దగ్గర చిరిగిన నోట్లు ఎక్కువగా ఉంటే బ్యాంకు వెంటనే మార్పిడి చేయదు, మొదట ఆ నోట్లను స్వీకరించి.. తరువాత మీ ఖాతాలో జమ చేస్తుంది… ఇకపోతే ఈ చిరిగిన నోట్లపై సీరియల్ నెంబర్, మహాత్మా గాంధీ మార్క్, గవర్నర్ సంతకం వంటి గుర్తులు ఉంటే వాటిని బ్యాంకులు మార్చడానికి అంగీకరిస్తాయి. ఎక్కడైతే మీ దగ్గరున్న చిరిగిన నోట్లను మార్చాలనుకుంటారో అక్కడ ఖచ్చితంగా అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు.. బాగా చిరిగిన నోట్లకు ఎక్కువగా అమౌంట్ రాదు.. దానికి సగం మాత్రమే చెల్లిస్తారు.. ఉదాహరణకు ఒక నోటు 78 శాతం బాగుంటే దానికి ఫుల్ అమౌంట్ ఇస్తారు. అదే నోటు 39 శాతం ఉంటే దానికి కేవలం సగం డబ్బులను మాత్రమే ఇస్తారు.. ఇది ఆర్బీఐ బ్యాంకు రూల్.. కావాలని చించేసిన నోట్లను అస్సలు తీసుకోదు.. ఇది గుర్తుంచుకోండి..
నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? దానికిదే సాక్ష్యమా?
దెయ్యాలు ఉన్నాయంటే అది భ్రమ అలాంటివి ఏవి ఉండవని చాలా మంది కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే ఇంకొద్ది మంది మాత్రం తాము దెయ్యాలని చూశామని, వాటితో మాట్లాడామని చెబుతూ ఉంటారు. అయితే వాటికి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాటిని నిరూపించలేకపోతున్నారు. ఇదిలా వుంటే మనం చాలా సినిమాల్లో ఆత్మలు వాటి దగ్గరలో ఉన్న బొమ్మలోకో, వస్తువుల్లోకో ప్రవేశించడం చూస్తూ ఉంటాం. అమ్మో బొమ్మ, టెడ్డీ లాంటి కొన్ని సినిమాలు ఇలాగే తెరకెక్కాయి. అయితే నిజంగా అలా జరిగే అది మనం చూస్తే తట్టుకోగలమా? ఖచ్ఛితంగా అక్కడి నుంచి అయితే పరుగులు తీస్తాం. ప్రస్తుతం నెట్టింట్లో అలాంటి ఓ వీడియోనే చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతున్న వీడియో పోస్ట్ మార్టం రూంలో ఉన్న ఓ కర్రల నిచ్చెన నడుచుకుంటూ వెళుతుంది. అది అచ్చం మనిషి నడిచినట్టుగా నడుస్తుంది.ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. ఇది ఎస్‌ఆర్‌ఎంఎస్ మెడికల్ కాలేజీ పోస్ట్‌మార్టం గదిలో జరిగింది. ఆ గదిలో వెదురు కర్రలతో తయారు చేసిన ఒక నిచ్చెన ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ నిచ్చెన నడుస్తూ ముందుకు కదిలింది. నిచ్చెనకు ఉన్న నాలుగు కర్రలు మనుషుల మాదిరిగా అడుగులు వేస్తూ నడిచాయి. మొదట ఈ వీడియోను కింద నుంచి షూట్ చేస్తే చూసే వారు దానిని పై నుంచి కదుపుతున్నారేమో దెయ్యం లేదు ఏం లేదు అనుకుంటారు. అయితే ఆ వీడియో తీసిన వారు కింద నుంచి క్రమంగా నిచ్చెన పై వరకు తీసుకువెళతారు. అయితే అక్కడ ఎవరు దానిని పట్టుకొని అలాగే దానికి ఎలాంటి తాళ్లు కట్టి నడింపించలేదు. అది దానంతట అదే నడుచుకుంటూ వెళుతుంది. ఒక్కసారిగా ఈ వీడియో చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొద్ది సేపట్లోనే ఈ వీడియోను చాలా మంది చూసి ఇతరులకు షేర్ చేస్తున్నారు.
మహేష్ కు వాయిస్ ఓవర్ అందించనున్న పవన్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”గుంటూరు కారం”.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పక్కా మాస్ అండ్ యాక్షన్ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు..కాగా ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం..దీనితో పవన్ కళ్యాణ్ అయితే కథ పరంగా ఇంట్రెస్టింగ్ వాయిస్ అందిస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్ళగలడు అని దీనితో సినిమాకు ఎంతో ప్లస్ అవుతుంది అని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం . ఇలా చేస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కూడా గుంటూరు కారం సినిమాపై ఎంతో ఇంట్రస్ట్ పెరుగుతుంది. దీంతో పవన్ తో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పించారని సమాచారం.. గతంలో జల్సా సినిమా కోసం పవన్ కళ్యాణ్ కు మహేష్ వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. మహేష్ వాయిస్ జల్సా సినిమా కు ఎంతో ప్లస్ అయింది.మరి ఇప్పుడు పవన్ వాయిస్ ఓవర్ గుంటూరు కారం సినిమాకు హైప్ తీసుకువస్తుందో లేదో చూడాలి.
పాప అలా చీర జారిస్తే ఎలా?
హీరోయిన్ లంటే… అవసరం, అవకాశాన్ని బట్టి గ్లామర్ షో చేయాల్సిందే కానీ కొందరు ముద్దుగుమ్మలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. అదే మిగిలిన హీరోయిన్ ల నుంచి వీళ్లని సెపరేట్ చేస్తుంది. మంచి క్యారెక్టర్స్ పైన మాత్రమే ఫోకస్ చేసే వారిలో కీర్తి సురేష్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ బొద్దుగుమ్మను హోమ్లీ బ్యూటీగానే చూశారు ఆడియెన్స్. మిగతా వాళ్లకంటే నేనేం తక్కువ అనుకుందో ఏమో గానీ మెల్లిమెల్లిగా గ్లామర్ డోస్ పెంచడం స్టార్ట్ చేసింది కీర్తి సురేష్. మహానటి సినిమా తర్వాత ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోని, కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్న ఈ హీరోయిన్ సర్కారు వారి పాట సినిమాతోనే యూటర్న్ తీసుకోని గ్లామర్ ట్రాక్ ఎక్కింది. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాలోనే గ్లామర్ షో చేస్తుంది కీర్తి. ఎప్పటికప్పుడు డోస్ పెంచుతునే ఉన్న కీర్తి, లేటెస్ట్ గా ఒక ఈవెంట్ లో చేసిన స్కిన్ షో చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. తాజాగా కీర్తి హాట్ లుక్‌కు సోషల్ మీడియా హీటెక్కిపోతోంది.లావెండర్ లవ్ అని కోట్ చేస్తూ కీర్తి సురేష్ చీరలో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లావెండర్ చీరని అలా జాలువార్చి, క్లివేజ్ షో చేస్తూ కీర్తి సురేష్ మత్తెక్కించేలా ఉంది. ఆ మధ్యలో జిమ్ ఎక్కువగా చేసి, బక్కచిక్కినట్లు ఉన్న కీర్తి సురేష్ ని చూసి, ఇలా అయిపోతుంది ఏంటి? క్యూట్ గా ఉండే ఒకప్పటి కీర్తి సురేష్ ఇక కనిపించదా అనుకున్నారు? క్యూట్ గా కాదు హాట్ గా కనిపిస్తాను అంటూ కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటోస్ తో యూత్ హార్ట్స్ కి గెలిచేసింది. సారీ కట్టుకోని కూడా అందంగా కనిపిస్తూనే, గ్లామర్ ట్రీట్ ఇస్తూ బోల్డ్ ఫోటోస్ తో కీర్తి సురేష్ వావ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సైరెన్, రివాల్వర్ రీటా అనే సినిమాలు చేస్తోంది.