కడపలో దారుణం.. భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్.. ఆపై..!
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కడపలో సంచలనం సృష్టిస్తోన్న కానిస్టేబుల్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడపలోని కోపరేటివ్ కాలనీలో తన భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు.. అయితే, ఆ కుటుంబంలో ఏం జరిగిందనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపేశాడు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు.. ఇక, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న కడప పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలకు ఆస్పత్రికి తరలించారు.. కుటుంబ కలహాలతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.. కానీ, ఒకేసారి నలుగురి ప్రాణాలు పోవడం.. స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పవన్‌పై వైవీ సుబ్బారెడ్డి ఫైర్.. తప్పుచేసిన వ్యక్తిని ఎలా సపోర్ట్ చేస్తారు..!
వారాహి యాత్రలో ఏపీ ప్రభుత్వం, అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖకు చేరుకున్న మూడు జిల్లాల కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు నేతలు, కార్యకర్తలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారాహి యాత్ర అనేది గతంలో కూడా ఉన్నదే.. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. అప్పుడు పొత్తులు బైట పడలేదు.. ఇప్పుడు చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్లడంతో పవన్ కల్యాణ్ సింపతికోసం పొత్తులు పెట్టుకున్నాడు అని ఆరోపించారు. తప్పుచేసిన వ్యక్తికి ఏవిధంగా సపోర్ట్ చేస్తారు..? అని ప్రశ్నించారు. న్యాయస్థానంలో కూడా బెయిల్ రాక జైలులో ఉన్న వ్యక్తికి ఏ విధంగా మద్దతు తెలుపుతారు? అంటూ పవన్ ను నిలదీశారు వైవీ సుబ్బారెడ్డి. ఇక, మహిళలను కించపరిచి, జైలుకు వెళ్లి వచ్చినవారు కూడా సంబరాలు చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సెటైర్లు వేశారు వైవీ సుబ్బారెడ్డి.. మరోవైపు.. విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి నెల వస్తున్నారు.. పరిపాలన విషయంలో అధికారులు తగు ఏర్పాట్లు చేసిన వెంటనే పూర్తిగా ఇక్కడ నుండి పాలన కొనసాగిస్తారని వెల్లడించారు. చంద్రబాబు విషయంలో న్యాయస్థానం కూడా సరైన నిర్ణయాన్ని ప్రకటించడం వలన ప్రజలకు న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగిందన్నారు. చట్టం అందరికీ సమానమే అని, తప్పుచేసిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు వైవీ సుబ్బారెడ్డి.
జనసేన, టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్.. పవన్ యాత్ర ప్లాప్ షో..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర, టీడీపీ-జనసేన పొత్తు, పెడనలో వారాహి యాత్ర బహిరంగ సభపై సెటైర్లు వేశారు మంత్రి జోగి రమేష్.. పెడనలో అటెన్షన్ కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నం.. సినిమా స్టైల్ లో కత్తులు, కటార్లు, రాళ్లతో దాడులు అని హడావిడి చేశాడు.. రెండు వేల మందితో దాడులు అన్నాడు.. కానీ, పవన్ సభకు రెండు వేల మంది కూడా రాలేదని విమర్శించారు. అవనిగడ్డలో పవన్ ఫ్లాప్ షో.. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో అని దుయ్యబట్టారు. ఇక, జనసేన – టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. చంద్రబాబు స్కిల్ స్కాంలో ఆధారాలతో దొరికి ఊచలు లెక్క పెట్టుకుంటున్నాడు.. జైల్లో ఉన్న దత్త తండ్రి కోసం పవన్ పాకులాడుతున్నాడని మండిపడ్డారు. పెడన ప్రజలు శాంతి కాముకులు.. అటువంటి ప్రజలపై ఆరోపణలు చేసినందుకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జోగి రమేష్.. అత్తారింటికి దారేది సినిమా పైరసీ చేశారనే పేరుతో పెడనలో 30 మందిని అరెస్టు చేసి చిత్రహింసలు చేసిన చరిత్ర పవన్ కల్యాణ్‌ది అని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ బ్లడ్ ఎక్కించుకున్నావా? ప్యాకేజీ వచ్చిందని బ్లడ్ ఎక్కించుకున్నావా? అంటూ ఎద్దేవా చేశారు. నీకు లాగా కాపు సామాజికవర్గం అమ్ముడు పోదు.. రంగాను చంపిన వాళ్ళ పల్లకి మోస్తావా? అని నిలదీశారు. పవన్ ను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మబోరన్న ఆయన.. పవన్ కల్యాణ్ పావలా.. పావలాలు పంచుకునే పావలాగాళ్లు మీరంతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. కానీ, ఒక స్త్రీ విజయం వెనుక స్త్రీనే ఉంటుంది..
ఒక మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. కానీ, స్త్రీ విజయం వెనుక ఒక స్త్రీ నే ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళ సాధికారత సమావేశంలో పాల్గొన్న ఆమె… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా పక్షపాతి సీఎం వైఎస్ జగన్ అన్నారు. చరిత్రలో ఎవరు చేయని విధంగా మహిళల కోసం కృషి చేస్తున్నారని.. లక్షలాది మహిళల అకౌంట్స్‌లో నేరుగా కోట్లాది రూపాయల డబ్బులు వేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. పాలు ఇచ్చే స్థాయి నుండి పాలించే స్ధాయికి దేశంలో మహిళలు ఎదిగారు.. 33 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రిజర్వేషన్ల ఇవ్వకుండానే ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించిన ఘనత మహిళలది.. విద్యా, సినిమా, రాజకీయాలు ఎక్కడైనా సరే.. మహిళలను వెనక్కి తరిమేసిలా ప్రయత్నం చేస్తుంటారని.. మనం చేస్తున్న పని తప్పా, ఒప్పా అని మనకు తెలుస్తే చాలు.. మహిళలు విమర్శలకు భయపడి పారిపోకూడదు.. పోరాటం మాత్రమే చేయాలని పిలుపునిచ్చారు. లింగ వివక్షత అనేది సమాజంలో ఉండకూడదు.. కొత్త జనరేషన్, యువతరం దానిని మార్చాలని కోరారు మంత్రి రోజా.. సినిమా వాళ్లు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన యదవ మాట్లాడు.. మనం చేస్తున్న పని తప్పా? కాదా? అని మనకు తెలిస్తే చాలు.. మన మనసాక్షికి తెలిస్తే చాలు.. ఎవరో ఎదో తిట్టారని భయపడి వెనక్కి అడుగు వేయకుండా ముందుకే వెళ్లాలన్నారు. మహిళల కోసం ఎంతో పోరాటం చేశాను.. ఉద్యమాలు చేశానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు మంత్రి ఆర్కే రోజా.
వాట్సాప్ గ్రూప్‌లలో పోర్న్ వీడియోలు.. స్పందించిన కాంగ్రెస్ నేత!
వాట్సాప్ గ్రూపులో తాను అశ్లీల మెసేజ్ (పోర్న్ వీడియోలు)లు పోస్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బెల్లంపల్లి కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ స్పష్టం చేశారు. తన డ్రైవర్ తప్పిదం వల్ల మెసేజ్‌లు వచ్చాయని, ఈ ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. చేయని తప్పును తనపై రుద్ది రాజకీయంగా దెబ్బతీయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని గడ్డం వినోద్ పేర్కొన్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ సెల్ ఫోన్ నంబర్ నుంచి సోషల్ మీడియాలో పోర్న్ వీడియోలు పోస్ట్ అయ్యాయి. రాత్రిపూట కొన్ని వాట్సాప్ గ్రూప్‌లకు పోర్న్ వీడియోలు వెళ్లాయి. అవి చుసిన గ్రూప్ మెంబర్స్.. ఒక్కసారిగా షాక్ తిన్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత గడ్డం వినోద్.. ఆ వీడియోలను డిలీట్ చేశారు. అయితే అప్పటికే విషయం బయటికి రావడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతో సోషల్ మీడియాలో పోర్న్ వీడియోల పోస్టులపై గడ్డం వినోద్ స్పందించారు. ‘వాట్సాప్ గ్రూపులో నేను అశ్లీల మెసేజ్‌లు పోస్ట్ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా ఫోన్ నెంబర్ 9000081819 ఇదే. నేను ఏదైనా అత్యవసర మీటింగ్‌లో ఉన్నా లేదా నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన సమయంలో.. నా కొరకు ఫోన్ చేసే ప్రజలు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా సమాచారం తెలవడం కోసం మరొక ఫోన్ నా వాహనంలో ఉంటుంది. ఆ మొబైల్‌ను నా వెహికిల్ డ్రైవర్స్ నా సమాచారాన్ని ఇతరులకు చెప్పడం కొరకు వాడుతుంటారు. నిన్న రాత్రి నా డ్రైవర్ మొబైల్ వాడుతున్న సమయంలో అతడి తప్పిదం వల్ల వచ్చిన మెసేజ్‌లే అవి. వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చేయని తప్పును నాపై రుద్ది.. రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని నా ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తున్నారు. నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి, అసభ్యకర పనులకు నేను పాల్పడింది లేదు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు’ అని గడ్డం వినోద్ అన్నారు.
పిల్లలతో ఆడుకుంటే 83 లక్షలు జీతం.. వెంటనే జాయిన్ అయిపోండి
మీరు నెలకు వేల రూపాయలు లేదా లక్షల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగాల గురించి విన్నారు. కానీ కడు పేదవారిని కూడా లక్షాధికారిని చేసే ఉద్యోగం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఒక ఉద్యోగం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని జీతం 1 లక్ష డాలర్లు అంటే దాదాపు 83 లక్షల రూపాయలు. ఈ ఉద్యోగం మన దగ్గర కాదు. అగ్రరాజ్యం అమెరికాలో.. భారతీయ సంతతికి చెందిన ఒక వ్యాపారవేత్త నానీ కోసం వెతుకుతున్నాడు. పిల్లలను చూసుకోవడం, వారితో ఆడుకోవడం ఆయాల పని. అమెరికాలో ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకోవడానికి తరచుగా నానీలను నియమించుకుంటారు. అయితే నానీకి ఇంత ఎక్కువ జీతం ఇవ్వడం ఇదే తొలిసారి. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి తన ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు నానీ కోసం చూస్తున్నారు. అతను భారతీయ సంతతికి చెందిన బిలియనీర్. దీని కోసం రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ప్రకటనలు ఇచ్చాడు. అమెరికన్ మీడియా బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. ఎంపికైన అభ్యర్థికి 1 లక్ష డాలర్లు అంటే 83 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటనలో సమాచారం ఇవ్వబడింది. ఈ ఉద్యోగం EstateJobs.comలో ఇవ్వబడింది.
వాట్సాప్ ఛానెల్స్ ను ఎలా హైడ్ చెయ్యాలో తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ఎక్కువ మంది వాడుతున్నారు.. ఇక వాట్సాప్ కూడా తన కస్టమర్లకు సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తున్నారు.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఫీచర్స్‌ను తీసుకొస్తోందీ కాబట్టే ఈ మెసేజింగ్ యాప్‌కు ఇంతటీ ఫాలోయింగ్ ఉంది.. మార్కెట్ లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సైట్స్ నుంచి వస్తున్న పోటీ తట్టుకోనేందుకు వీలుగా వాట్సాప్ ఛానెల్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ‘వాట్సాప్ ఛానెల్స్’ పేరుతో తెచ్చిన ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే భారత్‌తో పాటు పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫీచర్ సహాయంతో సెలబ్రిటీలు మొదలు పలు ప్రముఖ సంస్థల వరకు వాట్సాప్ ఛానెల్స్‌ను క్రియేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఛానెల్స్ సహాయంతో తమ అభిప్రాయాలను కానీ, తమ సంస్థ ప్రొడక్ట్స్‌ను కానీ ప్రమోట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.. దాంతో ఎక్కువ మంది వాట్సాప్ ఛానెల్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.. ఇక జనాల నుంచి కూడా మంచి ఆదరణ ను అందుకున్నాయి. అయితే ఈ కొత్త ఫీచర్ కొందరికి మాత్రం చిరాకు తెచ్చి పెడుతోంది. పర్సనల్ చాట్స్ చేసుకునే చోట ఈ ఛానెల్స్ గొడవ ఏంటనే అభిప్రాయం కూడా మరోవైపు వినిపిస్తుంది..
వెంకటేష్ కూడా విక్టరీ కోసం సంక్రాంతి బరిలో దిగాడు
2024 సంక్రాంతి ఇప్పటికే జామ్ ప్యాక్ అయ్యి ఉంది. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం, హను మాన్, ఈగల్, నా సామీ రంగ, VD 13 సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇవి చాలవన్నట్లు తమిళ్ నుంచి రజినీకాంత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ‘లాల్ సలామ్’, శివ కార్తికేయన్ నటిస్తున్న అయలాన్ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకే థియేటర్స్ దొరకడం కష్టం… తీరా సంక్రాంతి సీజన్ వచ్చినప్పుడు సగం సినిమాలు వాయిదా పడతాయి అనుకుంటుంటే కొత్తగా రేస్ లోకి వచ్చాడు విక్టరీ వెంకటేష్. వెంకీ మామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో వెంకీ మామ యాక్షన్ మోడ్ లోకి దిగుతున్నాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో విక్రమ్ సినిమాలోని కమల్ హాసన్ ని గుర్తు చేసేలా ఉన్న వెంకటేష్ తన సినిమాని డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తాడు అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యాడు. జనవరి 13న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కొత్త పోస్టర్ తో అఫీషియల్ అన్నౌన్స్మెంట్ ఇచ్చారు. సంక్రాంతి సీజన్ లో పోటీ ఉన్నా కూడా టాక్ బాగుంటే తమ సినిమాని ఆడియన్స్ ఆదరిస్తారు అనే నమ్మకం మూవీ మేకర్స్ లో ఉంటుంది. ఆ నమ్మకమే సైంధవ్ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెడుతుంది. సినిమా బాగుంటే ఆడియన్స్ ఆదరిస్తారు అనే ఆలోచన బాగుంది కానీ అసలు థియేటర్స్ దొరుకుతాయా లేదా అనేది ఎవరూ ఆలోచించట్లేదు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సగానికి పైగా థియేటర్స్ ని సొంతం చేసుకోవడం గ్యారెంటీ. మిగిలిన థియేటర్స్ ని హను మాన్, ఈగల్, నా సామీ రంగ, సైంధవ్, VD 13 సినిమాలు పంచుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి సినిమాకి నష్టం కలిగించే పరిణామమే. ఈ విషయాన్ని అలోచించి మేకర్స్ సంక్రాంతి సీజన్ నుంచి వెనక్కి కానీ ముందుకి కానీ వెళ్తారేమో చూడాలి.
ఈ లుక్ తో రాజమౌళి సినిమా చేస్తే టామ్ క్రూజ్ కూడా పనికి రాడు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ‘ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాట్టింగ్ కథని మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తాన”ని రాజమౌళి ఇప్పటికే చెప్పి SSMB 29 ప్రాజెక్ట్ పై ప్రపంచ సినీ అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అవతార్, అవెంజర్స్, టెర్మినేటర్, ఇండియానా జోన్స్ తరహాలో ‘SSMB29’ని కూడా ఒక ఫ్రాంచైజ్ లా చెయ్యాలనేది జక్కన ప్లాన్. సీక్వెల్, ప్రీక్వెల్ అనేలా కాకుండా ఒక వరల్డ్ ని క్రియేట్ చేసి అందులో నుంచి సినిమా చెయ్యాలని జక్కన ప్లాన్ చేస్తున్నాడట. మన దగ్గర ఫ్రాంచైజ్ లు ఉన్నాయి కానీ లార్జ్ స్కేల్ లో రూపొందిన ఫ్రాంచైజ్ లు అయితే లేవు. రాజమౌళి, మహేశ్ లు ఫ్రాంచైజ్ ని చేస్తున్నారు అనేది నిజమైతే… ఈ సినిమా వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం గ్యారెంటీ. ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక, రాజమౌళి -మహేశ్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవనుంది. దాదాపు 2023 డిసెంబర్ నుంచి ‘SSMB 29’ వర్క్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. లేటెస్ట్ గా SSMB29 ప్రాజెక్ట్ స్కెచ్ ఒకటి నెట్ లో వైరల్ అవుతోంది. మహేష్ ఫ్యాన్ పెన్సిల్ ఆర్ట్ తో మహేష్ ఇమేజినరీ లుక్ ని డిజైన్ చేసి, ఆ స్కెచ్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. వీటిని చూసిన ఫ్యాన్స్ SSMB 29 హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఈ లుక్ లో మహేష్ బాబు SSMB 29 సినిమా చేస్తే మిషన్ ఇంపాజిబుల్, ఇండియానా జోన్స్ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వడం గ్యారెంటీ. మరి జక్కన్న కాస్త వైరల్ అవుతున్న ఈ మహేష్ కొత్త లుక్స్ ని చూడన్నా…
క్యూట్ లుక్ లో రెచ్చగొట్టే పోజుల్లో అను ఇమ్మానియేల్..
అను ఇమ్మానియేల్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకటి రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. కొన్ని సినిమాల్లో నటించిన కూడా పెద్దగా సక్సెస్ టాక్ ను అందుకోలేక పోయింది.. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకసారి దర్శనమిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా మరోసారి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అను ఇమ్మానియేల్ కి కాలం కలిసి రాలేదు. కెరీర్ బిగినింగ్ లో నానికి జంటగా నటించిన మజ్ను మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవన్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ వచ్చినా సినిమా అవకాశాలు రాలేదు.. గత ఏడాది ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేక్షకులను పలకరించింది. హీరో శిరీష్ తో విచ్చలవిడి రొమాన్స్ చేసింది. వీరి సిల్వర్ స్క్రీన్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మొహమాటం లేకుండా నటించినా ఫలితం మాత్రం శూన్యం. మంచి టాక్ ను అందుకోలేక పోయింది.. అనుకి అడపాదడపా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. రవితేజకు జంటగా రావణాసుర చిత్రం చేసింది. ఇది కూడా డిజాస్టర్. ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్స్ తో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన రవితేజ కూడా ఆమెను కాపాడలేకపోయాడు. ఇక తెలుగులో అనుకు అవకాశాలు రావడం తగ్గాయి.. కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో అను ఇమ్మానియేల్ నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో జపాన్ తెరకెక్కుతుంది. ఈ రెండు చిత్రాల ఆశలు పెట్టుకుంది.. ఒకప్పుడు అల్లు శిరీష్ తో ఎఫైర్ ఉందనే నాకు స్నేహం ఉంది. ప్రేమించే చనువు కానీ, ఆకర్షణ కానీ లేదు. శ్రీ,సింధు పాత్రల్లో రియలిస్టిక్ గా కనిపించడానికి కష్టపడ్డాము. ఒక లవ్ మూవీలో నటించినా కూడా ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు.. అంటూ అమ్మడు మొన్నీమధ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది..
