Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మరో ప్రాణం తీసిన ఫ్రిజ్‌.. పాల కోసం ఫ్రిజ్‌ డోర్‌ పట్టుకొని వ్యక్తి మృతి
ఈ మధ్య ఫ్రిజ్‌ పట్టుకుంటే కరెంట్‌ షాక్‌తో ప్రాణాలు పోతున్నాయి.. ఈ నెలలో నిజామాబాద్‌ జిల్లాలో ఫ్రిజ్‌ పట్టుకున్న విద్యుత్‌ షాక్‌తో చిన్నారి మృతిచెందిన ఘటన మరువక ముందే.. అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి.. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరంలో ఇంట్లోని ఫ్రిజ్ లో ఉన్న పాలు తీసుకోవడానికి ఫ్రిజ్ డోర్ పట్టుకున్నాడు బాషా అనే వ్యక్తి.. దీంతో.. ఒక్కసారిగా విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు.. వెంటనే కుటుంబ సభ్యులు బాషాను ఆస్పత్రికి తరలించిన ఉపయోగం లేకుండా పోయింది.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది.. క్రిమినల్స్ ఉన్నారు..!
ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది.. మనం ఏం చేయలేం అనుకో కూడదు.. అందరూ కలిసి చెడును కడిగేయాలి.. మహనీయులను ఎన్నుకోవాలి.. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి అంటూ పిలుపునిచ్చారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. గుంటూరులో డాక్టర్ కాసరనేని సదా శివరావు శత జయంతి వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సదాశివరావు లాంటి డాక్టర్ లు ప్రజా సేవకొసమే వైద్య వృత్తి లో కొనసాగారు.. రాజకీయాల్లో కూడా సదా శివరావు తనదైన శైలిలో సామాన్యులకు అందుబాటులో ఉన్నారని గుర్తుచేశారు. మరోవైపు.. ఇప్పటి హాస్పిటల్ ల లో ఫీజులు మాత్రమే పరమావధితో వైద్యం చేస్తున్నారు అన్న అపవాదు ఉంది.. దాని నుండి వైద్య రంగం బయట పడాలి అని ఆకాక్షించారు వెంకయ్య నాయుడు.. ఇక, కులం,డబ్బు అండతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారు.. బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు పోలింగ్ బూతులో సమాధానం చెప్పాలన్నారు. చట్ట సభలు ప్రజలకు మేలు చేసే దేవాలయాలు.. వాటిని ప్రతీకారం తీర్చుకునే కోసం వాడుకోకూడదని హితవుపలికారు.. కులం చూసి కాదు, గుణం చూసి ఓటు వేయండి అని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ సందర్భంగా వైద్య, విద్యా, రాజకీయ రంగాలలో విశేష ప్రతిభ కలిగిన పలువురికి సేవ పురస్కారాలు అందించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

చంద్రబాబుకు భారీ ఊరట.. ఆ కేసులో బెయిల్‌
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో కేసులో భారీ ఊరట లభించింది.. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ఊరట దక్కింది.. ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అయితే, లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే.. కాగా, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు పోలీసులు. మొత్తం 179 మంది నేతలపై పోలీసులు కేటు పెట్టారు.. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు.. విచారణ క్రమంలో కొంతమందికి బెయిల్‌ వచ్చింది.. ఇప్పుడు చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు..

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైళ్లశాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు
రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ప్రచారాలు సాగుతోన్న నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. దేశంలోని జైళ్లలో ఎక్కడా ఏసీలు లేవు.. నిబంధనలు ప్రకారం తాము పని చేస్తున్నాం అని స్పష్టం చేశారు.. అయితే, డీహైడ్రేషన్ గా ఉందని చంద్రబాబు చెప్పారు.. ఓఆర్ఎస్ వాడుతున్నారని వెల్లడించారు.. ఇక, స్కిన్ కంప్లయింట్ ఉందని చెప్పారు.. ముందు జైల్లో ఉన్న డాక్టర్లు చంద్రబాబును పరిశీలించారు.. తర్వాత ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రాజమండ్రి జీజీహెచ్ సూపరిడెంట్ కి సమాచారం ఇచ్చామని.. ఆ తర్వాత.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి డెర్మటాలజిస్ట్ వచ్చి చంద్రబాబును పరిశీలించారని పేర్కొన్నారు.. వైద్యులు చంద్రబాబుకు కొన్ని మందులు రిఫర్ చేశారు, అవి వాడుతున్నారు.. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు హెల్త్ కండిషన్ నార్మల్ గా ఉందని తెలిపారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్.

రేపటి నుంచి దసరా సెలవులు.. ఉత్తర్వులు జారీ
దసరా పండుగ వచ్చేస్తోంది.. రేపటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది.. తెలంగాణలో అతిపెద్ద వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగ రేపటి నుంచి ప్రారంభం కానుండడంతో.. ఇవాళ్లి నుంచే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రేపటి నుంచి అంటే శనివారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఏపీలోని పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.. అక్టోబరు 14 తేదీ నుంచి అక్టోబర్‌ 24 తేదీ వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.. అంటే.. అక్టోబర్‌ 25వ తేదీన తిరిగి తెరుచుకోనున్నాయి పాఠశాలలు.. ఈ మేరకు షెడ్యూలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ. మొత్తంగా ఏపీలో స్కూళ్లకు 11 రోజుల పాటు దసరా సెలవులు వస్తున్నాయి.

ఐటీ దాడుల్లో దొరికిన 40 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోనివే..!
ఐటీ దాడుల్లో దొరికిన 40 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోనివే..! అంటూ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని పార్టీ కండువా కప్పి మంత్రి హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయని గుర్తు చేశారు. ఐటీ దాడుల్లో దొరికిన 40 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోనివే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. గతంలో కర్ణాటకలో 40 శాతం కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు 50 శాతం కమిషన్ నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసి తెలంగాణకి డబ్బులు తరలిస్తున్నారని మండిపడ్డారు. 1500 కోట్లతో తెలంగాణలో గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లో అభ్యర్థులు కరువని అన్నారు. పక్క పార్టీల నుంచి వచ్చేవాళ్ళ కోసం కాంగ్రెస్ దిక్కులు చూస్తుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదన్నారు.

కోడ్ కూసింది.. సోషల్ మీడియాలో అలాంటి కామెంట్స్ పెడితే జైలుకే
కొందరు ఇతరులను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్ట్‌లు చేస్తుంటారు. మరికొందరు ఆ పోస్టులపై కామెంట్లు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో చాలా మంది పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగితే నిప్పులు చెరుగుతుంది. మీ చేతిలో ఫోన్ ఉందని సోషల్ మీడియాలో చిన్న వ్యాఖ్య చేశారా? ఒకరి పోస్ట్ మీకు నచ్చలేదు కాబట్టి మీరు దానిని తీవ్రంగా వ్యతిరేకించారా? పోలీసు కేసుల్లో ఇరుక్కోవడం తథ్యం. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు వారు పోస్ట్‌ల క్రింద కామెంట్‌లు పోస్ట్ చేసే వారిపై నిఘా పెట్టనున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో దాదాపు అన్ని పార్టీల నేతలు తమ ప్రచారానికి సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా విభాగాలను పార్టీ నేతలే కాకుండా పార్టీ కార్యకర్తలు తమ గ్రామాల్లో వివిధ పేర్లతో వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పేజీలను క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై ఆయా పార్టీల అనుచరులు స్పందిస్తున్నారు. కామెంట్లు, కౌంటర్లు పెడుతున్నారు. ఐదేళ్ల క్రితం ఉండేది.. ఇప్పుడు ఇదిగో ఇలా మార్చాం. ఈ గౌరవం మా నాయకుడికే దక్కుతుంది.. ఇలాంటివి ఎన్నో చేశాం.. ఇంకా ఎన్నో చేస్తాం.. అభివృద్ధి కోసం చేద్దాం.. అంటూ పోస్టులతో మండిపడుతున్నారు. ఇలాంటి వాటికి ఆయా పార్టీల అనుచరులు అవుననే చెబుతుంటే.. ప్రత్యర్థులు మాత్రం వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.

బెంగుళూరులో రూ.42 కోట్లు సీజ్.. తెలంగాణకు తరలిస్తుండగా పట్టివేత
కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున రూ. 42 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును తెలంగాణకు తరలిస్తుండగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు ఇవాళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే తెలంగాణకు రూ.8 కోట్లు తరలిపోయినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మంత్రికి చెందిన డబ్బుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసును ఐటీ నుంచి ఈడీకి బదిలీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సందర్భంగా కర్ణాటక నుంచి తెలంగాణకు నగదు తరలిస్తున్నారనే సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 22 బాక్సుల్లో నగదును పెట్టి లారీలో తరలిస్తుండగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 9న విడుదలైంది. ఈ టర్మ్ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ గట్టిగా ఉన్నాయి. ఈ సారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్‌ పట్టుదలతో ఉంది.

ఇప్పటివరకు గాజాపై 6000 బాంబులు వేసిన ఇజ్రాయెల్.. 2800 మంది మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాపై దాదాపు 6,000 బాంబులను పడవేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ దేశం హమాస్ స్థానాలపై దాడి చేస్తున్నాడని కూడా చెప్పబడింది. ఈ దాడిలో గాజా స్ట్రిప్‌లోని ఆసుపత్రులు, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన షెల్టర్లు కూడా ప్రభావితమయ్యాయి. వైమానిక దాడులు వారి ఇళ్లలో ఉన్న మొత్తం కుటుంబాలను కూడా చంపాయి. మొత్తం 22 కుటుంబాలు చనిపోయాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. డమాస్కస్, అలెప్పోలోని విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ దళాల తాజా దాడులను స్థానిక వార్తా సంస్థలు నివేదించాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ చేరుకున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. ఆ సమయంలోనే ఇజ్రాయెల్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చాడు. యుద్ధంలో ఇరువైపులా ఇప్పటి వరకు 2,800 మంది ప్రాణాలు కోల్పోయారు. బందీలను విడుదల చేసే వరకు గాజా స్ట్రిప్‌కు విద్యుత్, నీరు లేదా ఇంధనం లభించదని ఇజ్రాయెల్ గురువారం తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ ఎనర్జీ మినిస్టర్ ఇజ్రాయెల్ కాట్జ్.. “గాజాకు మానవతా సహాయం? ఇజ్రాయెల్ బందీలు స్వదేశానికి తిరిగి వచ్చే వరకు విద్యుత్ స్విచ్ ఆన్ చేయబడదు. నీటి హైడ్రాంట్లు తెరవబడవు. ఇంధన ట్రక్కులు ప్రవేశించవు. మానవతావాదం అంటూ ఎవరూ మాకు నైతికత బోధించకూడదు.” అని అన్నారు. భూమార్గం ద్వారా గాజా స్ట్రిప్‌పై దాడికి సిద్ధమవుతోందని ఇజ్రాయెల్ సైన్యం గురువారం చెప్పింది. అయితే ప్రధాని నెతన్యాహు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

ప్రపంచకప్‌ 2023లో ఇప్పటివరకు బద్దలైన రికార్డ్స్ ఇవే.. రోహిత్‌ శర్మవి రెండు..!
భారత గడ్డపై ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌ 2023 రసవత్తరంగా సాగుతోంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ తగలగా.. ఆపై ఐదుసార్లు వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. టోర్నీలో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరగ్గా.. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 9వ స్థానంలో ఉండి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు ప్రపంచకప్‌ 2023లో ఇప్పటివరకు చాలా రికార్డ్స్ బద్దలు అయ్యాయి. ఇప్పటివరకు బద్దలుకొట్టబడిన రికార్డుల జాబితాను ఐసీసీ పంచుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు (19 ఇన్నింగ్స్‌లు) తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ నిలిచాడు. 2015లో 22 వికెట్లు తీసిన స్టార్క్.. 2019లో 27 వికెట్లు తీశాడు. శ్రీలంక మాజీ ఆటగాడు లసిత్ మలింగ 25 ఇన్నింగ్స్‌లలో 50 వికెట్లు పడగొట్టాడు. మాజీ ఆటగాళ్లు గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్ 30 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్‌ను అందుకున్నారు. వన్డే ప్రపంచకప్‌లో కెవిన్ ఓబ్రియన్ వేగవంతమైన సెంచరీ (50 బంతుల్లో) రికార్డును బద్దలు కొట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐడెన్ మార్క్రమ్ 49 బంతుల్లో శతకం చేశాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ 428/5 స్కోర్ చేసింది. అంతకుముందు ప్రపంచకప్‌ 2015లో అఫ్గానిస్తాన్ జట్టుపై ఆస్ట్రేలియా 417/6 స్కోర్ చేసింది. పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ఛేజింగ్‌ రికార్డు పాకిస్తాన్‌ నెలకొల్పింది. హైదరాబాద్‌లో శ్రీలంక నిర్ధేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని పాక్ చేధించింది. మహ్మద్ రిజ్వాన్ మరియు అబ్దుల్లా షఫీక్ సెంచరీలు బాదారు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుపై ఐర్లాండ్ 329 రన్స్ చేధించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ కేవలం 19 ఇన్నింగ్స్‌లలో 7 శతకాలు చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 44 ఇన్నింగ్స్‌లలో 6 సెంచరీలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్‌ ఇప్పటివరకు 453 మ్యాచ్‌లు ఆడి 556 సిక్స్‌లు బాదాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్‌ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ (553) పేరిట ఉండేది.

ఓటీటీ లోకి వచ్చేసిన విశాల్ సూపర్ హిట్ మూవీ..
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ వరుస సినిమాల తో దూసుకుపోతున్నాడు. తాజాగా విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని.ఈ సినిమా తో విశాల్ సూపర్ హిట్ ను అందుకున్నాడు .ఈ సినిమా లో విశాల్ తో పాటు దర్శకుడు నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ లో నటించారు. సెప్టెంబర్‌ 15 న థియేటర్ల లో విడుదలైన మార్క్‌ ఆంటోని సూపర్‌ హిట్‌ గా నిలిచింది.కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో ఈ సినిమా కు మంచి క్రేజ్ లభించింది.విశాల్ ఈ సినిమా లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి మెప్పించారు.థియేటర్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొన్న మార్క్ ఆంటోని ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా లో నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటించారు.డైరెక్టర్‌ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమా కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ను దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మార్క్ ఆంటోని ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. నేటి నుంచి మార్క్ ఆంటోని సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. తెలుగు, తమిళ్ భాషల్లో మార్క్ ఆంటోని మూవీ అందుబాటులో ఉంది. థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు మార్క్ ఆంటోని మూవీ ఓటీటీ లోకి రావడం తో ప్రేక్షకులు ఎంతో ఎక్సయిట్ అవుతున్నారు.మరి ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

పది రోజుల్లో పాన్ ఇండియా స్టార్ బర్త్ డే…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ బర్త్ డే అంటే సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే, ఆ రోజు రావడానికి ఇంకా పది రోజుల సమయం ఉంది కానీ ఇప్పటి నుంచే కౌంట్‌ డౌన్ స్టార్ట్ చేసేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్ డేకి ఇంకా సమయం ఉన్నా కూడా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ… సలార్, కల్కి, ప్రభాస్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. కల్కి సినిమా నుంచి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి బర్త్ గిఫ్ట్ రానుంది కానీ అది ఎలాంటి గిఫ్ట్ అనేది అక్టోబర్ 23నే తెలియనుంది. సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న మారుతీ, షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రీప్రొడక్షన్ వర్క్ చేసుకుంటున్న హను రాఘవపూడి, అనిమల్ రిలీజ్ అవ్వగానే స్పిరిట్ పనులు మొదలుపెట్టనున్న సందీప్ రెడ్డి వంగ సినిమాల నుంచి కూడా అక్టోబర్ 23న అప్డేట్స్ బయటకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఒకెత్తు… సలార్ ఒక్కటీ ఒకెత్తు. సలార్ ట్రైలర్ అనౌన్స్మెంట్ ప్రభాస్ బర్త్ డే రోజున జరగనుందని సమాచారం. ట్రైలర్ అప్డేట్ రాకుంటే సలార్ సాంగ్ అనౌన్స్మెంట్ అయినా వస్తుందని టాక్. ఈ రెండింటిలో ఏది వచ్చినా కూడా మిగిలిన సినిమాల వార్తలు వినిపించవు. ఇవి చాలవున్నట్లు ఛత్రపతి సినిమా గ్రాండ్ రీరిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ సెలబ్రేషన్స్ రీరిలీజ్ ట్రెండ్ లోనే టాప్ పొజిషన్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సో అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే రోజున… ప్రభాస్ తనతో తానే పోటీ పడి రికార్డ్స్ క్రియేట్ చేయనున్నాడు. ఇక ఆ రోజున సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు తప్ప ఇంకోటి వినిపించదేమో.

ఎవరి టైమ్ వాళ్లు లాక్ చేసుకున్నారు? ఇక రిలీజ్ అవ్వడమే లేట్
వచ్చే దసరాకు తెలుగు నుంచి రెండు, తమిళ్ నుంచి ఒకటి, కన్నడ నుంచి ఒకటి, హిందీ నుంచి ఓ ఫిల్మ్ థియేటర్లోకి రాబోతున్నాయి. హిందీ, కన్నడ నుంచి ఘోస్ట్, గణపథ్ సినిమాలు వస్తున్నప్పటికీ… లియో, టైగర్ నాగేశ్వర రావు, భగవంత్ కేసరి సినిమాలదే హవా కానుంది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వర రావు తెలుగులో పోటీకి సై అంటున్నాయి. ఈ రెండు సినిమాలకు పోటీగా తమిళ్ నుంచి విజయ్ లియో రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 19న బాలయ్య-అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’, విజయ్-లోకేష్ కనగరాజ్ ‘లియో’ రిలీజ్ అవుతుండగా.. 20న మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వర రావు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ప్రస్తుతం మేకర్స్ అంతా… ఈ సినిమాల ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పటికే ఈ సినిమాలు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. రన్ టైం కూడా లాక్ అయ్యింది. ఈ మూడు సినిమాల రన్ టైం ఓ సారి చూస్తే… టైగర్ నాగేశ్వరరావుకే ఎక్కువగా ఉంది. దాదాపు మూడు గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది కానీ భగవంత్ కేసరి మాత్రం రెండు గంటల 35 నిమిషాల రన్‌ టైంతో రానుందని తెలుస్తోంది. దళపతి లియో మూవీ మూవీ రెండు గంటల 44 నిమిషాల నిడివితో రానుందట. ఈ లెక్కన బాలయ్య  సినిమానే తక్కువ మరియు పర్ఫెక్ట్ రన్ టైంతో థియేటర్లోకి రాబోతోంది. ఈ మూడు సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ నిడివి ఉన్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు అనే చెప్పాలి. మాస్ రాజా ఆడియెన్స్‌ను ఎక్కువసేపు థియేటర్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. లెంగ్తీ రన్‌ టైమ్‌ కాబట్టి… టైగర్‌ టాక్ పైనే సినిమా రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. లెంగ్త్ ఎక్కువ అయితే ఆడియన్స్ నుంచి ఫస్ట్ వచ్చే కామెంట్స్ రన్ టైమ్ పైనే ఉంటుంది.

Exit mobile version