Best Mileage Bikes: భారత్ లో ప్రధాన ప్రయాణ సాధనంగా మోటార్ సైకిళ్లు ఉన్నాయనడంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అయితే మధ్య తరగతి ప్రజలు బైక్ కొనే సమయంలో ఎక్కువగా ఆలోచించించే అమర్చలలో ప్రధానంగా మైలేజ్ (ఇంధన సామర్థ్యం) ను కీలక అంశంగా చూస్తారు. పెరిగిన పెట్రోల్ ధరలు, రోజువారీ ప్రయాణ ఖర్చులు, పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణ అవసరాలు అన్ని కలిపి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ బాయ్స్ లకు రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అధిక మైలేజ్ బైక్‌లు కచ్చితంగా అవసరమయ్యాయి. కాబట్టి మార్కెట్లో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ మెయింటెనెన్స్‌తో, ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగిన బైక్ లను ఎంచుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ 5 మైలేజ్ బైక్స్ గురించి ఒకసారి చూద్దాం.
* బజాజ్ ప్లాటినా 110 హెచ్-గియర్ (Bajaj Platina 110 H-Gear):
ఇంధన వ్యయం తగ్గించుకోవాలనుకునే రైడర్లకు భారత్‌లో మార్కెట్‌లో లభ్యమవుతున్న కొన్ని అధిక మైలేజ్ బైక్స్ చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. వాటిలో మొదటిగా చెప్పుకోవలసిన బైక్ బజాజ్ ప్లాటినా 110 హెచ్-గియర్ (Bajaj Platina 110 H-Gear). ఇది 70 నుండి 75 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 115.45cc ఇంజిన్ ఉండి, 8.6PS పవర్‌తో వస్తుంది. ముఖ్యంగా 5 గేర్ ట్రాన్స్‌మిషన్, హై కంఫర్ట్ సస్పెన్షన్ వలన దీని రైడింగ్ అనుభవం మెరుగ్గా ఉంటుంది. ఈ బైక్ ధర రూ.73,000 నుంచి రూ.79,000 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది.

HHVM : వీరమల్లు ఓవర్శీస్ ప్రింట్లు అప్లోడ్ ఫినిష్.. కానీ టెన్షన్ తప్పదు
* హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ (Hero Splendor Plus XTEC):
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్‌లో ఒకటి హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ (Hero Splendor Plus XTEC). ఇది 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ లో 97.2cc ఇంజిన్‌తో 8.02PS పవర్ కలిగి ఉంటుంది. ఈ బైక్ లో LED DRL లు, బ్లూటూత్ కనెక్టివిటీ, తక్కువ మెయింటెనెన్స్ వంటివి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ బైక్ ధర రూ.78,000 నుంచి రూ.82,000 మధ్య ఉంటుంది.

* టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport):
ఈ లిస్ట్ లో టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)ను కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది సిటీ రైడింగ్‌కు చాలా అనువైన ఎంపిక. దీని మైలేజ్ 70 నుంచి 74 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 109.7cc ఇంజిన్ ఉంది. ఇది 8.29PS పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ తేలికైన బాడీ, మంచి పికప్, ఈకనోమీటర్ వంటి ప్రత్యేకతలతో ఇది వస్తుంది. దీని ధర 64,000 నుండి 69,000 మధ్యలో ఉంటుంది.

Coolie : రజినీ ‘కూలీ’ సినిమాలోకి మరో స్టార్ హీరో ఎంట్రీ..?
* హోండా ఎస్‌పి 125 (Honda SP 125):
స్టైలిష్ లుక్స్, మంచి బిల్డ్ క్వాలిటీతో హోండా ఎస్‌పి 125 (Honda SP 125) కూడా మంచి ఎంపిక. ఇది 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 124cc ఇంజిన్ ఉంది. ఇది 10.87PS పవర్ కలిగి ఉంటుంది. డిజిటల్ మీటర్, సైలెంట్ స్టార్ట్ వంటి ఆధునిక ఫీచర్లతో ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది. దీని ధర రూ.86,000 నుండి రూ.91,000 వరకు ఉంటుంది.

* హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)
మైలేజ్ పరంగా హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడే మోడల్. దీని మైలేజ్ కూడా 65 నుండి 70 కిలోమీటర్లు వరకు ఉంటుంది. ఇందులో 97.2cc ఇంజిన్, 8.02PS పవర్ ఉంది. ఇది i3S స్టార్ట్-స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్‌తో వస్తుంది. దీని ధర కేవలం 60,000 నుండి 68,000 వరకు మాత్రమే ఉంటుంది.
