పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. హరిహర వీరమల్లు ప్రీమియర్స్ కు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి.
Also Read : HHVM : మైత్రీ vs ఏషియన్ సినిమాస్..మధ్య పర్సంటేజ్ వార్..
ఈ నేపధ్యంలో ఈ సినిమా కు సంబంధించి క్యూబ్, UFOలో ప్రింట్స్ అప్ లోడ్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగానే రిలీజ్ కానున్న నేపధ్యంలో ప్రింట్స్ ను కాస్త ముందుగానే డెలివర్ చేయాల్సి ఉంది. 1.26 గంటల నిడివిగల ఫస్ట్ హాఫ్ కంటెంట్ ను రెండు రోజుల ముందుగానే అప్లోడ్ చేయగా 1.18 గంటల సెకండాఫ్ కంటెంట్ ను నిన్న రాత్రి అప్లోడ్ చేసేసారు. ఓవర్సీస్ ప్రీమియర్స్ కు అన్ని ఏర్పాట్లు ఫినిష్ అయ్యాయి. ఆ కంటెంట్ ను మరి కొన్ని గంటల్లో అక్కడి పంపిణీదారులకు కేటాయించాలి. ఆ తర్వాత, ఎలక్ట్రానిక్ లొకేషన్‌లకు 6-8 గంటల్లో కంటెంట్ అందుతుంది. అయితే ఓవర్సీస్ లో ప్రముఖ థియేటర్ చైన్ అయిన AMC లొకేషన్‌లకు హార్డ్ డ్రైవ్‌లు పంపాలి. ఒకవేళ అనుకున్న టైమ్ కు అందని పక్షంలో ప్రీమియర్స్ రద్దు చేసే అవకాశం ఉంది. ప్రముఖ పంపిణీదారులు ప్రత్యాంగిరా సినిమాస్ హరిహర వీరుమల్లు ను ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తోంది. నార్త్ అమెరికాలో పవర్ స్టార్ సినిమాకు సంబంధించి ప్రీమియర్స్ ను భారీగా ప్లాన్ చేసారు.