సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్‌కి అద్భుత స్పందన రావడంతో సినిమాపై హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా సినిమాకు నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ వంటి స్టార్స్ భాగం కావడం ప్రత్యేక బలాన్ని ఇస్తోంది. అది కూడా కథలో కీలక మలుపు తిప్పే పాత్రల్లో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు..
Also Read : Bhairavam : ఓటీటీలో హవా చూపిస్తున్న భైరవం.. స్ట్రీమింగ్ నిమిషాలతో రికార్డ్ సెట్
సమాచారం ప్రకారం లోకనాయకుడు కమల్ హాసన్ ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో లోకేష్-కమల్ కాంబో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అదే బంధంతో లోకేష్ అడిగిన వెంటనే.. కమల్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు రజినీ-కమల్ కలిసి సినిమాల్లో నటించినా, ఈసారి రజినీ సినిమాలో కమల్ వాయిస్ వినిపించబోతుండడం అభిమానుల్లో అత్రుత మరింత ఎక్కువైంది. ఇది కేవలం ఓ వాయిస్ ఓవర్ కాకుండా, ఇద్దరు దిగ్గజాల మధ్య స్నేహ బంధానికి నిలువెత్తు ఉదాహరణగా మారనుంది. మొత్తనికి రజినీ మాస్‌తో, కమల్ క్లాస్‌తో, లోకేష్ మార్క్‌తో.. ‘కూలీ’ ఓ సంచలనం అవ్వడం ఖాయం..