Tomato Price: పూర్తిగా పతనమైన టమాటా ధర.. కిలో 30 పైసలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Price: మొన్నటి వరకు సామాన్యులను ఏడిపించిన టమాటా.. ఇప్పుడు రైతులను ఏడిపిస్తోంది. దాదాపు మూడు నెలల పాటు సాధారణ ప్రజలు వాటిని తినాలంటేనే భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆ టమాటాలు కొనే నాథుడు లేక పశువులకు ఆహారంగా మారుతున్నాయి. 3 నెలల వరకు కిలో రూ. 300 వరకు పలికిన టమాటా.. ఇప్పుడు 30 పైసలకు కూడా కొనే దిక్కులేక నేలపాలవుతోంది. పంట పండించిన రైతులు రవాణా ఛార్జీలు కూడా రావనే ఉద్దేశంతో టమాటాలను రోడ్డు పక్కనే పారబోస్తున్నారు.
నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్, కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్లలో టమాటా ధరలు పూర్తిగా పతనమయ్యాయి. 25 కేజీల బాక్స్ 10 రూపాయల నుంచి 35 రూపాయలు పలుకుతోంది. అంటే కేజీ టమాటా ధర దాదాపు 30 నుంచి 40 పైసలు పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై రైతులు టమాటాలను పారబోస్తున్నారు. గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నేల మీద పారబోసే స్థాయికి చేరుకున్నాయి. పలు ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ పంట వస్తుండటం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో.. టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓ నెల క్రితం మార్కెట్‌కు టమాటాలు తీసుకొచ్చి జేబు నిండా డబ్బులు తీసుకెళ్లిన రైతు.. ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
Also Read: Minister RK Roja: చంద్రబాబుది మాటల ప్రభుత్వం.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వం
పెరిగిన టమాటా ధరలు జూన్, జూలై నెలలో రైతులకు కాసుల వర్షం కురిపించాయి. ఊహకందని ధరలతో కొందరు రైతులను టమాటా కోటీశ్వరులను చేసింది. ఇదే విషయాన్ని రైతులు స్వయంగా చెప్పారు. టమోటాకు ఇంత ధర ఎప్పుడూ లేదని, చాలా డబ్బు సంపాదించామని తెలిపారు. అయితే ఇప్పుడు అదే టమోటా రైతుకు కంటతడి పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పంటకు పెట్టుబడి, ఎరువులు, కూలీల ఖర్చులు కూడా పూడే పరిస్థితి లేదని కంటతడి పెట్టుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురుస్తూ నష్టాలను కలిగిస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. నష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!