సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్లు ఇప్పుడు బాలివుడ్ లో కూడా హవాను కొనసాగించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. రష్మిక మందన్న యానిమల్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. అలాగే సమంత సిటాడెల్ సిరీస్ తో మరోసారి అలరించేందుకు రెడీ అయ్యింది. అలాగే జవాన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నయన్. ఈ మూవీ విజయం గురించి చెప్పక్కర్లేదు.. త్రిష, కీర్తి సురేష్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇటీవలే ఖుషి తో సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆరోగ్య సమస్య కారణంగా ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సిటాడెల్, చెన్నై స్టోరీస్ లతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఒక్కో సినిమాకు సామ్ రూ. 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది..
తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ అంటే నయనతార.. హీరోల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఇటీవలే జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ మూవీకు నయన్ ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేసే తదుపరి చిత్రాలకు మరింత పారితోషికం పెరుగుతుందని అంటున్నారు..
త్రిష.. దాదాపు 21 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలుగుతుంది. నాలుగు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ లతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది రెమ్యూనరేషన్ ను పెంచేసింది.. ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లు ఉంటుంది..
తమన్నా.. ఈ అమ్మడు కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ప్రస్తుతం మిల్క్ బ్యూటీ రూ. దాదాపు 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఓటీటీ ప్లాట్ ఫాంపై వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ బిజీ అయ్యింది. కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. కీర్తి సురేష్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఈమె ప్రస్తుతం రూ.3 కోట్లు తీసుకుంటుంది..