టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన యంగ్ నిర్మాత అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూశాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా గం గం గణేశా అనే సినిమా నిర్మించిన నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్లో మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. చాలా యుక్త వయసులోనే ఆయన మరణించినట్లుగా చెబుతున్నారు. కేదార్ అల్లు అర్జున్ బన్నీ వాసు సహా విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితుడు అని తెలుస్తోంది. బన్నీ వాసు ప్రోద్బలంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన గతంలో ముత్తయ్య అనే సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించారు.
Serial Actress: కదులుతున్న రైలులో నటికి షాక్.. పోలీసులే ఇలా చేస్తే ఎలా?
తర్వాత ఆనంద దేవరకొండతో గమ్ గమ్ గణేశా అనే సినిమా నిర్మించాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా కూడా కేదార్ బ్యానర్ లోనే తెరకెక్కాల్సి ఉంది. ఇప్పటికే సుకుమార్కి ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆయన మరణానికి సంబంధించిన వార్త ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాలకు షాక్ కలిగిస్తోంది. ప్రస్తుతానికి సినీ పరిశ్రమకు చెందిన చాలామంది దుబాయిలోనే ఉన్నారు. ఓ నిర్మాత కొడుకు పెళ్లికి దుబాయ్ వెళ్లినవారు ఆ పెళ్లి చూసుకొని ప్రస్తుతం కొంతమంది వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటే మరి కొంతమంది తిరిగి వచ్చారు. అయితే ఆ వివాహానికి కేదార్ వెళ్ళాడా లేక ఇటీవల జరిగిన పాక్- ఇండియా మ్యాచ్ కోసం వెళ్ళాడా అనే విషయం మీద క్లారిటీ లేదు.