Tollywood: సినిమా ఎలా అయినా ఉండని.. ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లో ఉండాలి. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్. ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు, సక్సెస్ పార్టీలకు సినిమా సెట్స్ కు డబ్బులు ఖర్చు చేసేవారు.. కానీ, ఇప్పుడు ప్రమోషన్స్ కు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ప్రమోషన్స్ కు నిర్మాతలు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువ బడ్జెట్ సినిమా అని అర్ధం. ఇక ప్రమోషన్స్ అంటే రాజమౌళి. రాజమౌళి అంటే ప్రమోషన్స్.. పవన్ కళ్యాణ్ డైలాగ్ .. మనం ట్రెండ్ ఫాలో అవ్వం.. సెట్ చేస్తాం అన్నట్టు.. ఏదైనా జక్కన సెట్ చేయడం.. దాన్ని హీరోలు ఫాలో అవ్వడం జరుగుతుంది. ఒక్క సినిమాల విషయమే కాదు ప్రమోషన్స్ కూడా.. దేశం మొత్తం తిరిగి, అన్ని భాషల్లో ప్రమోషన్స్ మొదలుపెట్టింది జక్కన్న. అది బాహుబలి నుంచి కొనసాగుతోంది. ఇక ఇప్పుడు కొత్త ట్రెండ్.. ఆర్ఆర్ఆర్ తో మొదలు పెట్టారు. అదేంటంటే.. ప్రమోషన్స్ కు ఆ సినిమా టైటిల్ ప్రింట్ చేసిన షర్ట్స్ ను హీరోలు వేసుకొని రావడం.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ మొత్తం ఎన్టీఆర్, చరణ్, జక్కన్న.. ఆర్ఆర్ఆర్ నేమ్ ప్రింట్ చేసిన షర్ట్స్ నే వాడారు. చివరికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్స్ లో కూడా అలాంటి డిజైన్ ఉన్న బట్టలనే యూజ్ చేశారు.
Nani: బ్రదర్.. కొద్దిగా ఓవర్ గా అనిపించలేదా
ఇక ఏ ముహూర్తాన ఈ ట్రెండ్ సెట్ అయ్యిందో.. దాన్నే కుర్ర హీరోలందరూ ఫాలో అవుతున్నారు. మొన్నటికి మొన్న అడివి శేష్.. గూఢచారి 2 పోస్టర్ రిలీజ్ అప్పుడు ఆ టైటిల్ డిజైన్ తో ఉన్న షర్టు వేసుకొని ఆశ్చర్యపరిచాడు. ఇక నేడు.. నాని.. దసరా సినిమా టీజర్ ఈవెంట్ లో సిల్క్ స్మిత దానికింద దసరా నేమ్ ఉన్న డిజైనింగ్ షర్ట్ తో మెరిపించాడు. నిజం చెప్పాలంటే.. ఇదొక ప్రమోషన స్టాటజీ. తమ సినిమా పేరును ప్రత్యేకంగా చెప్పకుండా చూసిన వారు టక్కున గుర్తుపడతారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ మాత్రం టాలీవుడ్ లో బాగా కనిపిస్తోంది. ఈవెన్ హీరోయిన్లు ఏం తక్కువ తినలేదు..జాను సినిమా అప్పుడు సామ్.. సినిమా టైటిల్ తోనే చీర డిజైన్ చేయించుకొంది.ఎలాగైనా కానీ, మాకు ప్రమోషన్స్ ఉన్నప్పుడు టైటిల్ డిజైన్ షర్ట్ కావాల్సిందే అని హీరోలు పట్టు పడుతున్నారట.