టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. కిరణ్ సతీమణి, నటి రహస్య గోరక్ గురువారం పండండి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కిరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తనకు కుమారుడు పుట్టాడని, అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ బాబు కాలిని ముద్దాడుతున్న ఫొటో షేర్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2019లో విడుదలైన ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ నటించిన విషయం…