Nara Rohit: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరోలు లేదా హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో త్వరలో పెళ్లిలెక్కబోతున్నారు. 40 ఏళ్ల లేటు వయస్సులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు నారా వారబ్బాయి నారా రోహిత్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోదరుడు కుమారుడు నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బాణం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోలో సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు అనే సినిమాల్లో నటించారు.
Read Also:Dho Kaminey : షోలే, ఆర్ఆర్ఆర్ తరహా వండర్ ఫుల్ స్క్రిప్ట్ తో రూపొందనున్న దో కమీనే
#NaraRohith got engaged to Sireesha today in Hyderabad in the presence of AP CM #ChandraBabu, #NBK and other family members. pic.twitter.com/cmEBqn1KcI
— తార-సితార (@Tsr1257) October 13, 2024
తాజాగా ప్రతినిధి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఆ సినిమా హీరోయిన్ శ్రీ లేళ్లతో ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇరుకుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ రోజు అంటే ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన వారి ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతోపాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Read Also:Balu Gani Talkies : ఆహాలో దూసుకుపోతోన్న ‘బాలు గాని టాకీస్’