Lok Sabha Election 2024: నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. బెంగళూరు, చిక్కబళ్లాపుర బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. ఇవాళ ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు (BTP) కృష్ణ విహార్, ప్యాలెస్ గ్రౌండ్, HQTC హెలిప్యాడ్ దగ్గర ఒక కిలో మీటర్ పరిధిలో తాత్కాలిక నో-ఫ్లై జోన్‌గా ప్రకటించారు.
Read Also: DC vs SRH: నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ..
అలాగే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ (శనివారం) కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని మూడు ఎన్నికల సమావేశాలలో ఆమె ప్రసంగించిన తర్వాత రోడ్ షో నిర్వహిస్తారు. ప్రత్యేక విమానంలో నేటి ఉదయం కొచ్చికి ప్రియాంక చేరుకుంటారు. అక్కడి నుంచి త్రిసూర్‌కు వెళ్లి చలకుడి లోక్‌సభ నియోజకవర్గంలో జరిగే తొలి ర్యాలీలో ఆమె మాట్లాడనున్నారు.. అనంతరం పతనంతిట్టలో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరువనంతపురం చేరుకుని ఎంపీ శశిథరూర్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం ఆమె తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.
Read Also: LSG vs CSK: జడేజా, ధోనీ మెరుపులు వృథా.. కీలక పోరులో లక్నో సూపర్ విక్టరీ..
ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల (ఏప్రిల్) 23, 24 తేదీల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏప్రిల్ 23వ తేదీన బెంగళూరులోని పలు ప్రాంతాల్లో షా రోడ్ షోలు చేయనున్నారు. ఆ మరుసటి రోజు చిక్కమగళూరు, తుమకూరు, హుబ్లీలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని సులిన్ కుమార్ తెలిపారు.